నిజాంసాగర్: జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను రెండేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సదరు పాఠశాల ల్లో ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించాలి. జిల్లాలోని 15 మండలాల్లో గతేడాది నుంచి తరగతులను ప్రారంభించారు. మొదట్లో 6, 8వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ తరగతులకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులను లాటరీ పద్ధతిన పాఠశాలల్లో చేర్చుకున్నారు.
ప్రస్తుతం రెండో సంవత్సరం ఆదర్శ పాఠశాలల్లో పదోతరగతి మినహా ఆరు నుంచి ఇంట ర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఆద ర్శ పాఠశాలల్లో తరగుతులవారీగా విద్యాబోధన చేపట్టేందుకు సరపడా ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌కు అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్ట లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో బోధించేం దుకు ఉపాధ్యాయులు, ఆధ్యాపకుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
విద్యాబోధనకు గాను ఒక్కొక్క మోడల్ పాఠశాలల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని పలు మోడ ల్ పాఠశాలల్లో ఏడెనిమి మంది ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ అయ్యారు. ఆదర్శ పాఠశాలలకు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయినా అప్పటి ప్రభుత్వం వారిని పాఠశాలల్లో నియమించ లే దు. నిజాంసాగర్, మద్నూర్, కొత్తాబాది, ఎల్లారెడ్డి, గాందారి, సదాశివనగర్, రెంజల్ తదితర మండలాల్లోని ఆదర్శ పాఠశాలలు సమస్యలతో సతమవుతున్నాయి.
ఆదర్శానికి ఆరు వందలు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటితో పాటు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. అలాగే సబ్జెక్టులవారిగా ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తి చేయకపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. గతేడాది ఆరకొర వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతతో విద్యాసంవత్సరాన్ని నెట్టుకొట్చారు.
కానీ ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోంది. ఈ విషయమై పాఠశాల నిర్వహకులు విద్యార్థుల తల్లితండ్రులతో ఇటీవల సమావేశమై పాఠశాలలో కనీస వసతులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల నిమాయకం కోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 600 చెల్లిం చాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లిస్తేనే వసతులు కల్పించడంతోపాటు ప్రైవేట్ టీచర్ల నియమించొచ్చని నిర్వహకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న బోజనం తింటున్నా తాగడానికి మంచినీటి కొరత వేధిస్తోంది.
ఈ సమస్య తీర్చడానికి విద్యార్థులు డబ్బులు చెల్లించాలని నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని విద్యార్థులను పంపిస్తే ఆరువందలు చెల్లిం చడం ఇబ్బందికరంగా మారుతోందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన, విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని తల్లితండ్రులు కోరుతున్నారు.
పేరుకే ఆదర్శం
Published Mon, Aug 11 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement