DSSSB Notification 2021, Apply For 5801 TGT Vacancies - Sakshi
Sakshi News home page

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 5807 టీజీటీ పోస్టులు

Published Mon, May 31 2021 5:24 PM | Last Updated on Mon, May 31 2021 6:50 PM

DSSSB TGT Recruitment 2021: Qualification, Age Limit, Salary, Selection Process - Sakshi

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(ఎన్‌సీటీ ఢిల్లీ)ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ)..అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

     మొత్తం పోస్టుల సంఖ్య: 5807
సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ.

అర్హత: మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌(ఎంఐఎల్‌)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్‌), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్‌ ఉండాలి. సీబీఎస్‌ఈ నుంచి సీటెట్‌లో అర్హత కలిగి ఉండాలి.
     

వయసు: 32ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: వన్‌ టైర్‌/టూ టైర్‌ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 04.06.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.07.2021

వెబ్‌సైట్‌: https://dsssb.delhi.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement