thailand polices
-
‘షేన్ వార్న్‌ది సహజ మరణమే’
మెల్బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి విషయంలో అనుమానించాల్సిన అంశమేమీ లేదని తేలింది. అతనిది సహజ మరణమేనని, గుండె పోటు కారణంగానే చనిపోయినట్లు థాయ్‌లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వార్న్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యుడు థాయ్ పోలీసులకు నివేదిక ఇవ్వగా, దానిని వారు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి అందజేశారు. ‘వార్న్ మృతికి సంబంధించి సందేహించాల్సిన అంశాలేమీ కనపడలేదు. ఇది హత్య కాదు. అతను సహజంగానే చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్ వెల్లడించారు. అంతకుముందే తనకు ఛాతీలో కొంత నొప్పి వస్తోందని, థాయ్‌లాండ్ నుంచి తిరిగి రాగానే వైద్యులను కలుస్తానని వార్న్ తన తండ్రితో కూడా చెప్పాడు’ అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సురచటే హక్‌పర్న్ స్పష్టం చేశారు. మరోవైపు సెలవుల కోసం థాయ్‌లాండ్ వెళ్లడానికి ముందే వార్న్ ఛాతీ నొప్పితో బాధపడినట్లు, అతని డైట్లో మార్పు కూడా అందుకు కారణం కావచ్చని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ వెల్లడించాడు. ‘బరువు తగ్గే క్రమంలో వార్న్ కఠోర ఆహార నియమాలను అలవాటు చేసుకున్నాడు. థాయ్ వెళ్లే ముందు రెండు వారాలుగా అతను కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు. అతను తన జీవితంలో చాలా ఎక్కువగా ధూమపానం చేసేవాడు. బహుశా అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చేమో’ అని అతను వివరించాడు. అధికారిక లాంఛనాలతో... వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్‌కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. దేశ ప్రధాని స్కాట్ మోరిసన్, విక్టోరియా ముఖ్యమంత్రి డానియెల్ ఆండ్రూస్ అంత్యక్రియలకు హాజరవుతారు. ‘ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనగా చెప్పగా... ‘నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి’ అంటూ అతని కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్ నుంచి వార్న్ మృతదేహం ఇంకా అతని ఇంటికి చేరలేదు. -
వార్న్ మృతిపై థాయ్ పోలీసులు ఏమన్నారంటే..
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. థాయిలాండ్‌లోని తన విల్లాలో వార్న్ అచేతనంగా పడి ఉండడం.. తన వెంట ఉన్న స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించడం చకచకా జరిగిపోయాయి. వైద్యులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు వార్న్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వార్న్ గుండెపోటుతో మృతి చెందినట్లు దృవీకరించారు. అయితే వార్న్ మృతి వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కారణంతో థాయ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా దర్యాప్తులో థాయ్ పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వార్న్ మృతిలో ఎలాంటి తప్పులు జరగలేదని.. తీవ్ర గుండెపోటు రావడంతోనే దిగ్గజ స్పిన్నర్ మరణించినట్లు థాయ్ పోలీసులు పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్ ప్రాంతంలో వార్న్ తన విల్లాలో హాలిడే ఎంజాయ్ చేయడానికి వచ్చాడని తెలిపారు.వార్న్‌తో పాటు అతని స్నేహితులు కూడా విల్లాకు వచ్చారు. వార్న్ స్నేహితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వార్న్ మృతి చెందిన రోజు వారంతా క్రికెట్ మ్యాచ్‌ను చూశారు. వార్న్ ఎలాంటి అల్కాహాల్.. మత్తు పదార్థాలు తీసుకోలేదని తేలింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో వార్న్ తన రూంలో పడుకున్నాడు. అదే సమయంలో తన స్నేహితులు తినడానికి రమ్మని పిలిచారు.. కానీ అప్పటికే అతను సృహ కోల్పోయాడు. వెంటనే వార్న్‌ను థాయ్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు దాదాపు 20 నిమిషాల పాటు వార్న్‌ను బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో వార్న్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఇక వార్న్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఇక లేడన్న వార్తను తట్టుకోలేకపోతున్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ బయట వేలాది మంది అభిమానులు వార్న్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు వస్తున్నారు. కొందరు వార్న్‌కు ఇష్టమైన బీర్, సిగరేట్ ప్యాకెట్లను, మాంసాన్ని విగ్రహం వద్ద గుర్తుగా పెట్టారు. ఇక వార్న్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్.. ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయాం అంటూ ట్వీట్ చేశారు. వార్న్ అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Shane Warne: భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం! Shane Warne: వార్న్‌ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ -
ఆత్మహత్యే కావచ్చు..
కార్ల్ స్లిమ్ మృతిపై థాయ్‌లాండ్ పోలీసుల ప్రాథమిక అంచనా గదిలో పెనుగులాట జరిగిన ఆధారాల్లేవు సూసైడ్ నోట్లో ఇంటి సమస్యల ప్రస్తావన ఉన్నట్లు వెల్లడి స్లిమ్ భార్యను ప్రశ్నిస్తాం: పోలీసులు బ్యాంకాక్/న్యూఢిల్లీ: టాటా మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ కార్ల్ స్లిమ్ (51) ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే సంగతి ఇంకా ఇదమిత్థంగా వెల్లడి కాలేదు. ఆయన ఆత్మహత్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాన్ని థాయ్‌లాండ్ పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకాక్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో 22వ అంతస్తు నుంచి 4వ అంతస్తులో పడి ఆదివారం ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం తెలిసిందే. కార్ల్ స్లిమ్ హత్యకు గురై ఉండే అవకాశాల్లేవని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘యన్నావా జిల్లాలోని రివర్సైడ్ షాంఘ్రి-లా హోటల్లో స్లిమ్ బస చేసిన గదిలో 3 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నాం. అందులో కొంతవరకూ ఇంటి సమస్యల ప్రస్తావన ఉంది. ఆ లేఖను రాసింది ఆయనేనా కాదా? అన్నది పోలీసులు విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ జాతీ యుడైన స్లిమ్ బసచేసిన గదిలో పెనుగులాట జరిగిన దాఖలాల్లేవు. స్లిమ్ ఈ నెల 24న తన భార్య(30)తో కలసి హోటల్ రూములో దిగారు. ఆదివారం (26న) వారు ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గదికి బాల్కనీ లేదు. పెద్ద అద్దం, దానికో చిన్న కిటికీ ఉన్నాయంతే. దానిలోంచి బయటపడటం చాలా కష్టం. నాలుగో అంతస్తులోకి పడి మరణించిన స్లిమ్ దేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. గదిలో నిద్రిస్తున్న ఆయన భార్యకు ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. స్లిమ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనేది మా ప్రాథమిక అంచనా’ అని పోలీస్ లెఫ్టినెంట్ సోమ్యోట్ బూన్యకియోవ్ తెలి పారు. స్లిమ్ భార్యను కూడా ప్రశ్నిస్తామని చెప్పారు. కాగా, కార్ల్ స్లిమ్ మరణం నేపథ్యంలో... టాటా మోటార్స్ కొత్త ఎండీ నియామకం త్వరలో జరగనుంది. కొద్ది రోజుల్లోనే డెరైక్టర్ల బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.