thaliban
-
అఫ్గాన్ పరిస్థితులు సవాల్‌గా మారాయి: రాజ్‌నాథ్ సింగ్
-
Afghanistan: అప్పుడే మొదలు.. ఇంటింటికీ వెళ్లి..
కాబూల్: తాము గతంలో పాలించినట్లు ఈ సారి పాలన ఉండదని పూర్తిగా మారినట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే వారి పలుకులకు జనసంచరంలోని తాలిబన్ల చేతలకు ఏ మాత్రం పొంతన లేదు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాలకి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంట్లిట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారట. దీని బట్టి చూస్తే అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు నరమేదాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా గతంలో నాటో దళాలకు, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ఆచూకీ దొరకకపోతే వారి కుటుంబసభ్యులను బెరిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొందర్ని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారని, ఆ బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో తెలిపింది.అమెరికా బలగాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్న సమయంలో.. నాటో దళాలు కూడా తాలిబన్ల అరాచకాలను ఎంతో సమర్థవంతంగా నిలువరించగలిగాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సహకరించిన వారి కోసం తాలిబన్లు వేట మొదలు పెట్టారంట. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయమని, లేదంటే వాళ్లను పట్టుకుని విచారించి, వారి కుటుంసభ్యులను శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు యూఎన్ తన రిపోర్ట్‌లో తెలిపింది. -
Afghanistan: తాలిబన్లపై ప్రారంభమైన తిరుగుబాటు
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు అమ్రుల్లా సలేహ్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో తాలిబన్లపై తిరుగుబాటు జరిగింది. తాలిబన్లతో జరిగిన పోరులో చారికర్ ప్రాంతాన్ని అఫ్ఘాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. కాగా, పంజ్‌షేర్ ప్రాంతంలో అఫ్ఘాన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తిరుగుబాటుతో పాటు త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు అమ్రుల్లా సలేహ్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడమేకాదు ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల భారీ నిక్షేపాల ప్రాప్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తూ.. ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నారు. చదవండి: సర్టిఫికెట్స్ జిరాక్స్ కోసం వెళ్ళింది.. సాయంత్రమైనా రాకపోయేసరికి.. -
ఆఫ్ఘనిస్థాన్ నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘనీ!
-
11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ సైన్యం
కాబూల్: అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న 11 మంది తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం మట్టుబెట్టింది. పాక్టిక ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపిన సైన్యం 11 మంది తాలిబన్ తీవ్రవాదులను హతమార్చింది. అంతకు ముందు శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు దాడి చేసి 17 మందిని హతమార్చారు.