కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు అమ్రుల్లా సలేహ్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో తాలిబన్లపై తిరుగుబాటు జరిగింది. తాలిబన్లతో జరిగిన పోరులో చారికర్ ప్రాంతాన్ని అఫ్ఘాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. కాగా, పంజ్‌షేర్ ప్రాంతంలో అఫ్ఘాన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తిరుగుబాటుతో పాటు త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు అమ్రుల్లా సలేహ్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడమేకాదు ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల భారీ నిక్షేపాల ప్రాప్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు.
దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తూ.. ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నారు.
చదవండి: సర్టిఫికెట్స్ జిరాక్స్ కోసం వెళ్ళింది.. సాయంత్రమైనా రాకపోయేసరికి..
Comments
Please login to add a commentAdd a comment