‘థింక్ పై’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తాజాగా పర్యావరణ అనుకూల టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ‘థింక్ పై’లో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఎంత మొత్తం పెట్టుబడి పెట్టినదీ వెల్లడి కాలేదు. ఏంజెల్ ఫండింగ్ రూపంలో లభించిన నిధులను కార్యకలాపాల విస్తరణకు వినియోగించుకోనున్నట్లు ‘థింక్ పై’ తెలిపింది. గోద్రెజ్ ఇంటీరియో, రుస్తుమ్జీ తదితర క్లయింట్లకు ఇప్పటికే కొన్ని ఉత్పత్తులు విక్రయించినట్లు వివరించింది. ప్రసాద్ గతంలో మ్యాట్రిక్స్ ల్యాబరేటరీస్, మా టీవీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు.