Third match
-
రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్‌నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్‌కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్‌శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్‌ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్‌లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్‌మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్‌పాండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్‌మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్‌శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్‌పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
సమష్టిగా రాణిస్తేనే...
పార్ల్: సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో... నేడు దక్షిణాఫ్రికాతో జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమిండియా తొలి వన్డేలో ఘనవిజయం సాధించినా... రెండో వన్డేలో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆకట్టుకోలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ అదరగొట్టగా... ముకేశ్ కుమార్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఫామ్ కోల్పోయిన తిలక్ వర్మ స్థానంలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు రెండో వన్డేలో సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్ టోని జోర్జి సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. మార్క్రమ్, రీజా హెన్డ్రిక్స్, క్లాసెన్, డసెన్, మిల్లర్ కూడా రాణిస్తే ఆ జట్టు మరో విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. మూడో మ్యాచ్ వేదికైన పార్ల్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. గత ఏడాది ఈ వేదికపై భారత్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. -
IND W vs ENG W 3rd T20: మళ్లీ ఓడిన మన మహిళలు
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన హర్మన్ బృందానికి ఓటమిని అందించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 9.5 ఓవర్లకే షఫాలీ (5), స్మృతి (9), మేఘన (0), హేమలత (0), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (5) వెనుదిరగ్గా... 52 పరుగుల వద్ద స్నేహ్ రాణా (8) వికెట్ పడింది. ఈ దశలో రిచా ఘోష్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు), దీప్తి శర్మ (25 బంతుల్లో 24) ఆదుకోవడంతో స్కోరు 100 పరుగులు దాటగలిగింది. చివర్లో పూజ వస్త్రకర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) కూడా కొన్ని పరుగులు జోడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (3/25) భారత్‌ను దెబ్బ తీయగా, సారా గ్లెన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు సాధించి గెలిచింది. సోఫియా డంక్లీ (44 బంతుల్లో 49; 6 ఫోర్లు), అలైస్ క్యాప్సీ (24 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, డానీ వ్యాట్ (22; 1 ఫోర్) రాణించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హోవ్‌లో తొలి వన్డే జరుగుతుంది. -
మహిళల జట్టుకు నిరాశ
* మూడో టి20 మ్యాచ్‌లో ఓడిన మిథాలీ బృందం * సిరీస్ 2-1తో కైవసం సిడ్నీ: వరుసగా రెండు టి20 మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టుకు చివరిదైన మూడో మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఫలితంతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఎల్సీ పెర్రీ (41 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు; 4/12) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులకే పరిమితమైంది. వనిత (28) టాప్ స్కోరర్. హర్మన్‌ప్రీత్ కౌర్ (24), వేద కృష్ణమూరి (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. జులన్ గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. -
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం