మహిళల జట్టుకు నిరాశ | India women lose last T20I, clinch series 2-1 against Australia | Sakshi
Sakshi News home page

మహిళల జట్టుకు నిరాశ

Published Mon, Feb 1 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

మహిళల జట్టుకు నిరాశ

మహిళల జట్టుకు నిరాశ

* మూడో టి20 మ్యాచ్‌లో ఓడిన మిథాలీ బృందం
* సిరీస్ 2-1తో కైవసం

సిడ్నీ: వరుసగా రెండు టి20 మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టుకు చివరిదైన మూడో మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఫలితంతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఎల్సీ పెర్రీ (41 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు; 4/12) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులకే పరిమితమైంది. వనిత (28) టాప్ స్కోరర్. హర్మన్‌ప్రీత్ కౌర్ (24), వేద కృష్ణమూరి (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. జులన్ గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement