third-party premium
-
(అ)సాధారణ బీమా
కోల్‌కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు. అందరికీ అందుబాటు.. బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు. -
వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు
థర్డ్ పార్టీ ప్రీమియంను 41 శాతం పెంచుతూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ముంబై: వాహన బీమా థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను 41 శాతం వరకు పెంచుతూ ఐఆర్డీఏఐ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక లీటర్‌కు మించి ఒకటిన్నర లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు థర్డ్ పార్టీ ప్రీమియం ప్రస్తుతం రూ.2,237 ఉండగా తాజా పెంపుతో అది రూ.3,132కు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏ తెలిపింది. ఒక లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు పెంపు వర్తించదు. ప్రైవేటు నాలుగు చక్రాల వాహనాలు 1,500 సీసీ సామర్థ్యం కంటే అధికంగా ఉన్న వాటికి ప్రీమియం రూ.6,164 ఉండగా, తాజా పెంపుతో రూ.8,630 కానుంది. రూ.7,500 కిలోల కంటే అధిక లోడ్ సామర్థ్యం గల వాణిజ్య వాహనాలకు ప్రీమియం తగ్గుతుంది. 75 సీసీ వరకు గల ద్విచక్ర వాహనాలకు పెంపు లేదు. ఆపై 150 సీసీ వరకు ఉన్న వాటికి ప్రీమియం రూ.619 నుంచి 720కి పెరుగుతోంది. ఆపై 350 సీసీ వరకు గల వాహనాలకు రూ.970, అంతకు మించితే రూ.1,114 ప్రీమియం ఉంటుంది. త్రిచక్ర వాహనాలకు ప్రీమియం రూ.4,200 నుంచి రూ.5,680కి పెరగనుంది. -
వాహన బీమా ఇక మరింత ప్రియం
ఏప్రిల్ 1 నుంచి 40% పెరగనున్న థర్డ్ పార్టీ ప్రీమియంలు న్యూఢిల్లీ: వాహనదారులకు షాక్ నిచ్చేలా కార్లు, బైకుల బీమా ప్రీమియంలు ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని 40 శాతం పెంచాలని నిర్ణయించినట్లు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వెల్లడించింది. దీని ప్రకారం చిన్న కార్లకు (1,000 సీసీ సామర్థ్యం దాకా) థర్డ్ పార్టీ వాహన బీమా ప్రీమియం రూ. 1,468 నుంచి 39.9 శాతం పెరిగి రూ. 2,055కి చేరనుంది. అలాగే మిడ్ సెగ్మెట్ కార్లకు (1,000-1,500 సీసీ) 40 శాతం పెరుగుతుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలకు (1,500 సీసీ) ఇది 25 శాతంగానే ఉండనుంది. దీని ప్రకారం వీటి బీమా ప్రీమియంలు ప్రస్తుతమున్న రూ. 4,931 నుంచి రూ. 6,164కి పెరుగుతాయి. అటు బైకులు, స్కూటర్ల విషయానికొస్తే 75 సీసీ దాకా సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాల ప్రీమియంలు రూ. 519 నుంచి రూ. 569కి, 75-150 సీసీ టూవీలర్లకు 15 శాతం పెరుగుదలతో 619కి చేరతాయి. ఇక 150-350 సీసీ బైక్‌ల ప్రీమియం 25 శాతం మేర ఎగియనుంది. అయితే, 350 సీసీ మించిన బైక్‌ల ప్రీమియంలు మాత్రం రూ. 884కి తగ్గనున్నాయి. అటు త్రిచక్ర వాహనాల బేసిక్ థర్డ్ పార్టీ ప్రీమియం కూడా పెరుగుతోంది. ఆరుగురు ప్రయాణికుల సామర్థ్యం ఉండే ఈ-రిక్షా కేటగిరినీ ప్రవేశపెట్టిన ఐఆర్డీఏఐ వీటికి స్థిరంగా రూ. 1,125 ప్రీమియం నిర్ణయించింది. అటు పబ్లిక్ క్యారియర్ల ప్రీమియంలు 15-30 శాతం పెరగనుండగా, 12 టన్నుల సామర్ధ్యం ఉండే గూడ్స్ వాహనాల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. కాస్ట్ ఇన్ఫ్లేషన్ సూచీ (సీఐఐ) క్రిత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో 1024 నుంచి 1081కి పెరిగిందని, దానికి అనుగుణంగానే ప్రీమియంలు మార్చినట్లు కొత్త రేట్లను నోటిఫై చేస్తూ ఐఆర్డీఏఐ తెలిపింది.