Thomas Cook
-
థామస్ కుక్‌లో ప్రమోటర్ వాటా అప్
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్‌బ్రిడ్జ్ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు బోర్డు సబ్‌కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్ కుక్ (ఇండియా) ఎండీ మాధవన్ మీనన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో థామస్ కుక్(ఇండియా) షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది. -
ఆ విమానాల చార్జీలు రెట్టింపు!
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రిటిష్ ట్రావెల్ ఏజెన్సీ థామస్ కుక్ అనూహ్యంగా దివాలా తీయడంలో లండన్‌కు చెందిన దాదాపు 1,60,000 మంది ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వారంతా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. వారంతా ‘హాలీడే ప్యాకేజీ’ కింద థామస్ కుక్ కంపెనీకి ముందుగానే డబ్బులు చెల్లించడంతో చేతిలో అదనపు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్లేందుకు తిప్పలు తప్పడం లేదు. థామస్ కుక్ దివాలా కారణంగా ఆ సంస్థ బుక్ చేసిన విమానయాన టిక్కెట్లు, హోటళ్లలో బసలు అన్నీ రద్దయిపోయాయి. ఇదే అదనుగా జెట్, టూయీ లాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రయాణికుల అవసరాన్ని దోచుకుంటున్నాయి. ఆ సంస్థలు విమానయాన చార్జీలను సోమవారం నాటి నుంచి అనూహ్యంగా రెట్టింపు చేశాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లు హాలీ డే ప్యాకేజీలను కూడా రెట్టింపు చేశాయట. ‘డిమాండ్–సరఫరా’ ఆర్థిక సూత్రాన్ని బట్టే తాము చార్జీలను వసూలు చేస్తున్నామని, లేకపోతే తక్కువ రేట్లకు టిక్కెట్లను మంజూరు చేసి ‘థామస్ కుక్’ సంస్థ లాగా దివాలా తీయాలా! అని జెట్ 2 విమానయాన సంస్థ ప్రతినిధ ఒకరు వ్యాఖ్యానించారు. తమ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఇటు విమానయాన సంస్థలు, అటు హోటళ్లు గద్దల్లా దోచుకుంటున్నాయని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. తాము వచ్చేటప్పుడు 250 పౌండ్లకు, రిటర్న్ టిక్కెట్‌ను 260 పౌండ్లకు బుక్ చేసుకోగా, ఇప్పుడు జెట్ 2లో రిటర్న్ టిక్కెట్ 413 పౌండ్లకు పెంచారని టర్కీలోని దలామన్లో ఓ ప్రయాణికుడు వాపోయారు. విమానం టిక్కెట్ కింద తమ నుంచి థామస్ ఒక్కరికి 317 పౌండ్లను వసూలు చేయగా, ఇప్పుడు అదే టిక్కెట్ ధరను వర్జిన్ ఐలాండ్ విమానయాన సంస్థ 570 పౌండ్లకు పెంచిందని మరో ప్రయాణికుల కుటుంబం ఆరోపించింది. 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కుక్ కథ సోమవారం ముగిసిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకున్న 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పరోక్షంగా మరెంతో మంది ఉపాధి కోల్పోయారు. -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
‘థామస్ కుక్’ దివాలా...
లండన్: ప్రముఖ బ్రిటిష్ పర్యాటక సంస్థ.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న థామస్ కుక్ దివాలా తీసింది. దీంతో దాదపు 6 లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వానికి భారీగానే వ్యయం కానున్నది. బల్గేరియా, క్యూబా, అమెరికా, టర్కీ తదితర దేశాల నుంచి ఈ యాత్రీకుల తరలింపునకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలను ప్రకటించింది. ఆపరేషన్ మ్యాటర్‌హార్న్ పేరుతో ఈ తరలింపును తక్షణం ప్రారంభించింది. దీని కోసం డజన్ల కొద్దీ చార్టర్ విమానాలను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో బ్రిటీషర్లను స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 9,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. వేరే దారి లేక దివాలా.. 178 ఏళ్ల చరిత్ర గల ఈ కంపెనీ భారీ రుణ భారంలోకి కూరుకుపోయింది. ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ యత్నాలు విఫలమవడంతో దివాలా తీసినట్లుగా సోమవారం ప్రకటించింది. కంపెనీ వాటాదారులకు, కొత్తగా రుణాలివ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందం కుదర్చడంలో శతథా ప్రయత్నాలు చేశామని, అవన్నీ విఫలమయ్యాయని పేర్కొంది. వేరే దారి లేక తక్షణం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తున్నామని వెల్లడించింది. ఆన్లైన్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడం, బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా హాలిడే ట్రిప్పులు, ప్యాకేజీల బుకింగ్స్ పడిపోవడం థామస్ కుక్ కష్టాలను మరింతగా పెంచింది. 2007లో మై ట్రావెల్ సంస్థను థామస్ కుక్ విలీనం చేసుకోవడం ఆ కంపెనీ పుట్టి మునగడానికి గల కారణాల్లో ఒకటి. వ్యయాలు తడిసి మోపెడై భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. 1841 నుంచి కార్యకలాపాలు.. 1841లో థామస్ కుక్ తన పేరు మీదనే ఈ పర్యాటక సంస్థను స్థాపించాడు. ఆరంభంలో ఇంగ్లాండ్‌లోని రైల్వే ప్రయాణికులకు పర్యాటక సేవలందించిన ఈ సంస్థ, ఆ తర్వాత విదేశీ యాత్రలను నిర్వహించడం మొదలు పెట్టింది. . పర్యాటకానికి సంబంధించి వివిధ రంగాల్లోకి విస్తరించింది. వార్షిక టర్నోవర్ 1,000 కోట్ల పౌండ్లు, ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందికి పర్యాటక సేవలందించే ఘనతలున్నప్పటికీ, భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయింది. ఒకప్పుడు లండన్ స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ షేరును ఇటీవలే తొలగించారు. గోవా పర్యాటకంపై దెబ్బ థామస్ కుక్ దివాలా ప్రకటన గోవా పర్యాటకంపై తీవ్ర ప్రభావమే చూపించనున్నది. గత టూరిస్ట్ సీజన్లో దాదాపు 30 వేలమంది బ్రిటీషర్లు గోవా వచ్చారు. వీరంతా థామస్ కుక్ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానాల ద్వారా వచ్చిన వాళ్లే, రోజుకు 300 మందిని ఇంగ్లాండ్ నుంచి గోవాకు థామస్ కుక్ తీసుకువచ్చేది. ఒక్కో బ్రిటీషర్ గోవాలో సగటున రెండు వారాలు పాటు ఉంటారని అంచనా. ఇక థామస్ కుక్ దివాలా తీయడంతో ఇంగ్లాండ్ నుంచి వచ్చే పర్యాటకులు సగం మేర తగ్గుతారని విశ్లేషకులంటున్నారు. కాగా థామస్ కుక్ భారత కార్యకలాపాలను 2012లో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసింది. థామస్ కుక్ యూకేకు, థామస్ కుక్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదిన థామస్ కుక్ ఇండియా స్పష్టం చేసింది. -
కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో
బ్రిటిష్ పర్యాటక సంస్థ థామస్‌కుక్ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. థామస్కుక్కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్ వారున్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి లిక్విడేషన్లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు అయన క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని బ్రిటన్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు. అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని తెలిపారు. కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్ కుక్‌ను 1841లో లీసెస్టర్స్ షైర్లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. థామస్ కుక్ సీఈవో పీటర్ ఫాంక్‌హౌజర్ అయితే థామస్ కుక్ ఇండియా మాత్రం ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్న ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. Lots of red cancelled markers for Thomas Cook flights due out from Manchester Airport today. Live on @bbc5live throughout the morning. pic.twitter.com/UuiTk9sjRU — Justin Bones (@justinbones) September 23, 2019 అయితే థామస్ కుక్ ఇండియా ఆర్థికంగా, నిర్వహరణ పరంగా చాలా పటిష్టంగా ఉంది. 2012 నుంచి స్వతంత్ర సంస్థగా కొనసాగుతున ఈ కంపెనీలో మేజర్ వాటా ఫెయిర్‌ఫాక్స్ గ్రూపు సొంతం. -
దివాలా అంచుల్లో థామస్ కుక్
లండన్: బ్రిటిష్ పర్యాటక సంస్థ, థామస్ కుక్ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్ కుక్కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం... కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్ కుక్ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్ కుక్ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్ఎస్ఏ(ట్రాన్స్పోర్ట్ శాలరీడ్ స్టాఫ్స్ అసోసియేషన్) కోరుతోంది. మోనార్క్ ఎయిర్‌లైన్స్ మునిగిపోయినప్పుడు.. ప్రస్తుతం థామస్ కుక్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. బ్రెగ్జిట్, ఆన్లైన్ పోటీతో భారీగా నష్టాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. -
చేదు అనుభవం; ఎయిర్‌లైన్స్ క్షమాపణలు!
బ్రిటన్‌కు చెందిన థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలనుకున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్ స్టాఫ్.. డ్రెస్ మార్చుకోకపోతే విమానం నుంచి దింపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు సదరు మహిళ కజిన్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే తాను ఎదుర్కొన్న అనుభవం గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎమిలీ ఓ కన్నార్ అనే మహిళ మార్చి 2న బర్మింగ్‌హామ్ నుంచి కెనరీ ఐలాండ్స్కు వెళ్లేందుకు థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కింది. అయితే పై ఆమె ధరించిన డ్రెస్‌పై... స్టాఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయర్ నెక్ ఉన్న క్రాప్టాప్పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని లేదంటే లగేజ్‌తో సహా విమానం దిగాలని పేర్కొన్నారు. అయితే అందుకు ఎమిలీ నిరాకరించడంతో బలవంతంగా విమానం దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో తన డ్రెస్ కారణంగా ఎవరికైనా ఇబ్బందిగా ఉందా అంటూ ఎమిలీ అడగటంతో.. ఓ వ్యక్తి.. ‘నోరు మూసుకుని వాళ్లు చెప్పింది చెయ్యి’ అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె కజిన్ జోక్యం చేసుకుని తన జాకెట్‌ను ఎమిలీకి ఇవ్వడంతో సీట్లో కూర్చుకునేందుకు ఆమెకు అనుమతినిచ్చారు. కాగా తనకు ఎదురైన అనుభవం గురించి ట్విటర్లో రాసుకొచ్చిన ఎమిలీ.. ‘చాలా దారుణంగా వ్యవహరించారు. నా జీవితంలో అత్యంత చెత్త ఘటన ఇది’ అని పేర్కొంది. ‘నన్ను అన్నారు సరే మరి నా వెనుకాల ఉన్న ఓ వ్యక్తి కేవలం షార్ట్ మాత్రమే ధరించి అసభ్యంగా ప్రవరిస్తున్నా అతడిని ఎవరూ ఏమీ అనలేదు’ అని వాపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ కన్నార్ను క్షమాపణ కోరుతున్నాం. మేము అందరినీ సమానంగా చూస్తాం. లింగ వివక్షకు మా ఎయిర్‌లైన్స్‌లో ఎంతమాత్రం తావులేదు’ అంటూ థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా తమ డైరెక్టర్ ఎమిలీని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పినట్లు పేర్కొంది. అయితే మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, ఫొటోలు కలిగి ఉన్న దుస్తులు ధరిస్తే మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. Flying from Bham to Tenerife, Thomas Cook told me that they were going to remove me from the flight if I didn’t “cover up” as I was “causing offence” and was “inappropriate”. They had 4 flight staff around me to get my luggage to take me off the plane. pic.twitter.com/r28nvSYaoY — Emily O'Connor (@emroseoconnor) March 12, 2019 -
థామస్ కుక్ చేతికి డిజిఫొటో
ముంబై: పర్యాటక సేవలందించే థామస్ కుక్ ఇండియా గ్రూప్...ఇమేజింగ్ సొల్యూషన్స్, సేవలందించే డిజిఫొటో ఎంటర్టైన్మెంట్ ఇమేజింగ్(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్ కుక్ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్ కుక్ ఇండియా సీఎమ్‌డీ మాధవన్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం 25 దేశాల్లో నిర్వహిస్తున్న పర్యాటక సేవలకు అనుబంధంగా కొత్త అవకాశాలను ఈ కొనుగోలు అందించగలదని పేర్కొన్నారు. సింగపూర్, యూఏఈ, హాంగ్‌కాంగ్, మకావూ, చైనా, అమెరికా తదితర 14 దేశాల్లో 250 నగరాల్లో 120 మంది భాగస్వాములతో డీఈఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాదిలో 36 లక్షల లావాదేవీలను నిర్వహించిందని పేర్కొన్నారు. థామస్ కుక్‌తో అనుబంధం కారణంగా తమ స్థానం మరింత పటిష్టమవుతుందని డీఈఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కె. రామకృష్టన్ తెలిపారు. -
చిన్న పట్టణాలకూ థామస్ కుక్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రావెల్ సేవల రంగంలో ఉన్న థామస్ కుక్ చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. బుకింగ్స్ కోసం నగరాలకు వచ్చే అవసరం లేకుండా కస్టమర్ల వద్దకే సేవలను తీసుకెళ్తామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారమిక్కడ తెలిపారు. ‘ప్రస్తుతం 110 నగరాలు, పట్టణాల్లో సేవలందిస్తున్నాం. వీటిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు 70 శాతముంటాయి. 118 ఫ్రాంచైజీలు, 64 సొంత ఔట్లెట్లు, 500 మంది ఏజెంట్లతో వినియోగదార్లకు చేరువయ్యాం. వ్యాపార అవకాశాలున్న మరిన్ని కొత్త పట్టణాలకు చేరుకుంటాం. మెట్రోల్లో అయితే 3 కిలోమీటర్లకు ఒక టచ్ పాయింట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం వ్యాపారంలో మెట్రో నగరాల వాటా ఏకంగా 65 శాతముంది’ అని తెలిపారు. ఈవెంట్స్ విభాగంలోకి ఏడాదిలో ప్రవేశిస్తామన్నారు. విదేశాల్లో శుభకార్యాలు జరుపుకునే వారికి పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. థామస్ కుక్ ద్వారా ఏడాదికి 50 వేల పైచిలుకు మంది విదేశాల్లో జరిగే సమావేశాల కోసం వెళ్తున్నారని వివరించారు. -
థామస్ కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్
ముంబై: విదేశీ మారక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ భారత్‌లో తొలిసారిగా ‘ఫారిన్ ఎక్స్చేంజ్ యాప్’ను ప్రవేశపెట్టినట్లు థామస్ కుక్ (ఇండియా) తెలిపింది. ఇందులో డాలర్, యూరో, ఫ్రాంక్ తదితర ప్రధాన కరెన్సీల మారక విలువలు ఎప్పటికప్పుడు పొందుపర్చడం జరుగుతుందని వివరించింది. రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండేందుకు ‘బ్లాక్ మై రేట్’ ఆప్షన్ కూడా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో ఉంటుందని థామస్ కుక్ (ఇండియా) సీవోవో అమిత్ మదన్ తెలిపారు. అలాగే, నిర్దిష్ట కరెన్సీల మారకం విలువలకు సంబంధించి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా రేట్ అలర్టులు కూడా పొందవచ్చని వివరించారు.