Thotapalli
-
మాకెందుకు రుణమాఫీ కాలేదు
సాక్షి, నెట్వర్క్: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ⇒ మెదక్ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యూనియన్ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ⇒ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్ బ్యాంక్‌లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. ⇒ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్ మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.మాకు రుణమాఫీ కాలేదు⇒ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు రైతుల ఫిర్యాదు⇒ రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు ⇒ సందర్శించే షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్ డేటాలో తప్పులు, పట్టా పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. మండల స్థాయిలో నోడల్ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన తోటపల్లి నిర్వాసితులు
-
అన్నదాత ఆశలకు గండి!
తోటపల్లి ఎడమ కాలువకు భారీగండి పరిమితికి మించి నీరు విడుదలే కారణమనే విమర్శలు 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం సైపూన్ మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు పిలవని అధికారులు తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలకు ఆదిలోనే గండిపడింది. పెద్దబుడ్డిడి–సంతనర్సిపురం మధ్యలో ఉన్న కాలువ సైపూన్‌కు గురువారం భారీ గండి పడడంతో నీరు వృథాగా ఒట్టిగెడ్డలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు కాలువకు నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వరుణుడు ముఖం చాటేయడంతో చాలాచోట్ల వరినాట్లు పడలేదు. అక్కడక్కడ పడిచోట వేసవిని తలపిస్తున్నట్టు ఎండలు మండిపోతుండడంతో ఎండిపోతున్నాయి. ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతోందనుకుంటే.. గండి పడడంతో రైతుల ఆశలు అడిఆసలయ్యాయి. 2011 అక్టోబర్ నాలుగో తేదీన కూడా ఇదే సైపూన్ ప్రధాన గట్టు విరిగిపోవడంతో భారీ గండి పడి 23 రోజులు సాగునీరందక పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజా గండితో అన్నదాత గుబులు చెందుతున్నాడు. వీరఘట్టం: తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు గండి పడడంతో సాగునీరు అందుతోందో..లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంద మీటర్ల పొడవు ఉన్న సైపూన్‌కు సుమారు 50 మీటర్లు గండి ఏర్పడడంతో కాలువ ద్వారా వస్తున్న వేలాది క్యూసెక్కులనీరు ఒట్టిగెడ్డలో కలిసిపోయింది. దీంతో నీటిని అధికారులు నిలిపివేయడంతో తిరిగి నీటిని ఎప్పుడు ఇస్తారు, గండిని ఎప్పుడు పూడ్చుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ధనదాహమే గండికి కారణం! అధికార పార్టీ నాయకుల ధనదాహమే గండి పడటానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కాలువ పరిస్థితిని ఇటీవల ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి మరమ్మతులు అవసరమని భావించారు. ఇందుకోసం రూ.38.50 లక్షలతో గట్టు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. నిధులు కూడా ఈ ఏడాది మే నెలలో మంజూరు అయినప్పటికీ పనులు జరిపించడంలో అధికార పార్టీ నాయకులు తమ ప్రతాపాన్ని చూపించారు. టెండర్ల ద్వారా పనులు జరిపితే తమకు ప్రయోజనం లేదని, ఆ నిధులను విభజించి నామినేటెడ్ పనులు చేపట్టి నిధులు కాజేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే టెండర్లను పిలవకుండా అధికార ప్రతాపాన్ని చూపించడంతో జలవనరుల శాఖాధికారులు టెండర్లు పిలవకుండా పనులను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వందేళ్ల చరిత్ర ఉన్న తోటపల్లి కాలువలను ఆధునీకరించకుండా తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురై పూడికలతో నిండిపోయావి. ఈ పరిస్థితుల్లో అప్పటి డిజైన్ ప్రకారం సైపూన్ వద్ద ఆరు అడుగుల నీరు విడుదల చేస్తే తప్ప సాగునీరు అందని పరిస్థితి. ఆ స్థాయిలో నీరు విడుదల చేస్తే కాలువ ప్రారంభమయ్యే చోటే గండి పడేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత వారం రోజులుగా శివారు రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితిల్లో ఉన్నతాధికారులు దిగువస్థాయి సిబ్బందిని మందలించి వారిని బాధ్యులను చేశారు. దీంతో ఒత్తిడిలో ఉన్న అధికారులు పరిమితికి మించి నీటిని కాలువలోకి విడిచిపెట్టారు. నీరు విడిచిపెట్టిన 24 గంటల లోపే బలహీనంగా ఉన్న గట్లు వద్ద లీకులు ఏర్పడి..కోతకు గురై సైపూన్ వద్ద గండి పడింది. 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో అధికారికంగా సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు. ఉంది. అయితే ఈ ఏడాది ఖీరీఫ్ ప్రారంభంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో.. శివారు పొలాలకు కూడా సాగునీరందించడమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. దీంతో మరో 25 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. ఇప్పటి వరకూ 55 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అయితే తాజాగా కాలువకు గండి పడడంతో సాగునీరు ఎక్కడ అందదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బందిపై ఎస్ఈ ఆగ్రహం సైపూన్ మరమ్మతులకు నీరు–చెట్టులో భాగంగా మంజూరైన రూ.38.50 లక్షల నిధులతో పనులు చేయించకపోవడంపై స్థానిక అధికారులపై బొబ్బిలి సెక్షన్ జలవనరుల శాఖ ఎస్ఈ ఎం.వి.రమణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి శ్రీకాకుళం డివిజన్లో ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నాలుగు రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఒట్టిగెడ్డలో వస్తున్న నీటిని మళ్లించి పనులు చేయించాలని సూచించారు. అంతకుముందు గండిని పరిశీలించారు. ఆయనతో పాటు ఈఈ రవీంద్ర, డీఈఈ గనిరాజు, ఏఈలు ఉదయభాస్కర్, రాజేష్‌కుమార్, దాలయ్య,తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ నిమ్మక పాండురంగ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. కాలువలను అభివృద్ధి చేయాలని, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాలువల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ తరఫున అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేపడతాను. – విశ్వసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే -
రోడ్డుప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి
(బెజ్జంకి) కరీంనగర్ : వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. మంథనికి చెందిన హోండా షోరూం ఓనర్ సదాశివ రెడ్డి(55), ఆయన కూతురు నిహారిక(14)తో కలిసి హైదరాబాద్ వెళ్లి తరిగి కారులో వస్తుండగా.. తోటపల్లి సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'మార్కెటింగ్ లో చంద్రబాబు దిట్ట'
-
తోటపల్లి కుడికాల్వకు భారీ గండి
పార్వతీపురం(విజయనగరం): విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు కుడికాల్వకు శనివారం మధ్యాహ్నం భారీ గండిపడింది. దీంతో రూ.3 కోట్లలో చేపట్టిన అక్విడెక్ట్ పనులు మట్టి పాలయ్యాయి. సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖీ అక్విడెక్ట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండటంతో ఆయనతో ప్రారంభించాలనే తొందరలో ట్రయల్స్ చేపట్టారు. పనులు పూర్తి చేయకుండానే శనివారం మధ్యాహ్నం నీరు వదలటంతో 15వ కిలోమీటర్ వద్ద కుడికాల్వకు పెద్ద గండిపడింది. దీంతో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న అక్విడెక్ట్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దిగువన పొలాల్లో మట్టి మేటవేసింది. నారు మళ్లు నీటి ముంపునకు గురయ్యాయి. ఇదంతా అధికారుల అత్యుత్సాహం వల్లే జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. -
అగ్నిప్రమాదం : భారీ నష్టం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా నెల్లిపాక మండలం తోటపల్లిలో శుక్రవారం వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో పక్కనే ఉన్న మరో వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో రూ. 20 లక్షలు ఆస్తి అగ్నికి ఆహుతి అయిందని దుకాణం యజమానులు తెలిపారు.