Threat to PM NarendraModi
-
ప్రధానిని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ ఒకటి ముంబైలోని ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని, 20 కేజీల ఆర్డీఎక్స్ను సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను ధృవీకరించిన ముంబై ఎన్ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీనిపై మరింత అప్డేట్స్ అందాల్సి ఉంది. -
గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?
-
గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. ప్రధాని ప్రాణాలకు ప్రమాదం!
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్ని భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రతినిధులు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రమూకలతోనే ముప్పు పొంచి ఉందని, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరపడానికి ఉగ్ర సంస్థలు పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు తొమ్మిది పేజీల నివేదికని కేంద్రానికి పంపారు. డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడ్, యూఏవీలను రాజధాని పరిధిలో నిషేధించినట్టుగా మంగళవారం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థలను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదనపు భద్రత కోసం అత్యంత ఎల్తైన భవంతులపై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారీ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది 5,000–8,000 మందికి మాత్రమే వేడుకలకు అనుమతించాలని భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక అతిథులెవరూ లేకుండానే వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేడుకలకి హాజరవడానికి అనుమతి ఉంటుంది. చిన్నారుల్ని వేడుకలకి దూరంగా ఉంచనున్నారు. ఈసారి పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు బదులుగా 10.30కి వేడుకలు మొదలవుతాయి. రాజ్‌పథ్‌లో 10 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. చదవండి: జంతువులపై ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది శకటాల ఎంపిక నిపుణుల కమిటీదే : రాజ్‌నాథ్ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ శకటాల ప్రదర్శనకు ఈ ఏడాది అనుమతి లభించకపోవడంపై వివాదం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉద్దేశపూర్వకంగానే తమ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చేస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్, మమతలకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 29 ప్రతిపాదనలు వస్తే 12 మాత్రమే ఆమోదం పొందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌పై శకటాన్ని రూపొందిస్తే తిరస్కరించారంటూ ఘాటుగా విమర్శించిన మమతకు బదులిస్తూ నేతాజీకి నివాళిగా ఆయన జయంతి జనవరి 23 నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు -
మోదీకి ప్రాణహాని?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు హెచ్చరికలు జారీ చేశాయి. వచ్చే నెల స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చచ్చనే బలమైన సమాచారంతో ఈ విషయాన్ని భద్రతా అధికారులు దోవల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడే సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం. ప్రమాద సూచికలు బలంగా ఉండటం వల్ల ప్రధాని కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించాలని భద్రతా అధికారులు కోరారు. ప్రధానిమంత్రిగా పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. కేవలం కశ్మీర్ కల్లోలం, బోర్డర్లలో చొరబాటుదారులు పెరుగుతుండటమే కాకుండా ప్రధానిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ మేరకు ఎస్పీజీ, యాంటీ టెర్రర్ యూనిట్లను కొద్దివారల క్రితం అలర్ట్ చేసినట్లు చెప్పారు. ఆగష్టు 15న వరుసదాడులు లేదా ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఆల్-ఖైదా, ఐసిస్ లు ఆర్మీ, పోలీసుల చెక్ పోస్టులపై దృష్టిపెట్టాయని, ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారని ఆయన చెప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ద్వారా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆనవాయితీగా మారింది. 2014లో ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసిన మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా ప్రసంగం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సెక్యూరిటీ ఏజెన్సీలు ప్లాన్-బీని అమలు చేశాయి. ఎర్రకోటలోని నలువైపుల నుంచి స్పాటర్స్ ను అంచెలంచెలుగా ఉంచి ప్రధానికి భద్రతను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు డ్రిల్స్ నిర్వహించిన భద్రతా దళాలు ప్రధానిని ఏ షార్ట్, లాంగ్ రేంజ్ వెపన్ లకు చేరువ కాకుండా ఉండేలా నిర్దిష్ట ప్రదేశాల్లో స్పాటర్స్, కమాండోలను ఉంచనున్నారు. ప్రధానికి దగ్గరలో ఉంటూ భద్రత కల్పించే కార్డన్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఐసిస్, ఆల్-ఖైదా, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మొహమ్మద్ లే కాకుండా హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్-ఉల్-జిహాదీ-ఇస్లామీలు మోదీని టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా స్పీచ్ ఇవ్వడం, ఎలైట్ ఎస్పీజీ, ఇంటిలిజెన్స్ బ్యూరో, సెక్యూరిటీ ఏజెన్సీలను ఒకింత కలవరపాటుకు గురిచేసింది. దీని తర్వాత కోటకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నభవనాల్లో కమాండోలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. గత ఏడాది దాదాపు 5000 మంది ఎస్పీజీ, ఐబీ, పారామిలటరీ, ఢిల్లీ పోలీసులు, డ్రోన్లు ఎర్రకోటకు రక్షక కవచంగా ఉన్నాయని సమాచారం.