three children killed
-
ముగ్గురు పిల్లల్నీ చంపేసి.. దంపతుల ఆత్మహత్య!
- మంత్రాలు చేస్తున్నారంటూ అవమానించడంతో దారుణం - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాదం - మంత్రాలు చేస్తోందంటూ సొంత చెల్లెలిపైనే అన్నావదినల దాడి.. కలత చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం - పిల్లలకు ఉరివేసి చంపేసి.. ఆపై దంపతులూ బలవన్మరణం - మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఈటల.. ముగ్గురిపై కేసు నమోదు సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్ పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతాం.. వారి బాధ చూడలేక మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం.. కానీ ఓ తల్లిదండ్రులు తమ ముగ్గురు కన్నబిడ్డలనూ తమ చేతులతోనే చంపేశారు.. ఒకరి తర్వాత ఒకరికి ఉరివేశారు. వారి మృతదేహాలను మంచంపై వరుసగా పడుకోబెట్టి.. తల్లిదండ్రులు కూడా ఉరివేసుకున్నారు.. మంత్రాలు చేస్తున్నారంటూ దగ్గరివారే నిందలు వేసి అవమానించడాన్ని భరించలేక ఆ కుటుంబం దారుణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో ఆదివారం వేకువజామున ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురూ పదేళ్లలోపు పిల్లలే కావడం, ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. తాము చనిపోతే కూతుళ్లు ఎలా బతుకుతారోనన్న ఆవేదనో.. తమపై వచ్చిన మచ్చకు కూతుళ్లను ఎక్కడ వేధిస్తారనుకున్నారోగానీ.. కన్నబిడ్డలను తమ చేతులతోనే చంపేసిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది. కొంతకాలంగా అనుమానాలు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన చిన్నబత్తుల రాజయ్య, లచ్చమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు కొద్దిరోజుల కింద మరణించాడు. రెండో కుమార్తె కొమురమ్మకు కందుగుల గ్రామానికి చెందిన గంట కొమురయ్యతో పదేళ్ల కింద వివాహం చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఎల్లమ్మ (9), కోమల (6), అంజలి (4) ఉన్నారు. ఈ కుటుంబం కులవృత్తి (గంగిరెద్దుల) అయిన యాచక వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా కొమురమ్మ తమపై మంత్రాలు చేస్తోందని, అందుకే తమ ఆరోగ్యం బాగుండడం లేదని ఆమె అన్న కొమురయ్య, అతడి భార్య పెద్ద రాజమ్మ, చనిపోయిన తమ్ముడి భార్య చిన్నరాజమ్మ అనుమానిస్తున్నారు. వారు దీనిపై తరచూ గొడవపడుతుండడంతో కొమురమ్మ కొంతకాలంగా పుట్టింటికి వెళ్లడమే మానేసింది. అయితే ఇటీవల కొమురమ్మ తల్లిదండ్రులు రాజయ్య, లచ్చమ్మ మానకొండూర్ మండల కేంద్రానికి నివాసాన్ని మార్చడంతో.. అప్పుడప్పుడూ వారి వద్దకు వెళ్లి వస్తోంది. అప్పు చెల్లిస్తానని తీసుకెళ్లి.. రాజయ్య గతంలో కొమురమ్మ వద్ద రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము తిరిగిస్తానంటూ కుమార్తెను, అల్లుడిని మానకొండూర్‌కు పిలిపించుకున్నాడు. అయితే పెద్ద రాజమ్మ అనారోగ్యంతో ఉందని, ఆమెను సిద్దిపేట జిల్లా ధూళికట్టలోని ఓ చర్చికి తీసుకెళ్లారని వారికి సమాచారం వచ్చింది. దీంతో రాజయ్య, కొమురమ్మ, కొమురయ్యలు ధూళికట్టకు వెళ్లారు. కానీ అక్కడ కొమురమ్మను అన్నావదినలతో సహా తండ్రి కూడా తీవ్రంగా దూషించినట్లు తెలిసింది. ‘నువ్వు మంత్రాలు చేయడం వల్లే మాకు ఇలా జరుగుతోంది.. రోగాల పాలవుతున్నం.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్..’అంటూ దాడికి కూడా పాల్పడినట్లు సమాచారం. దీంతో కొమురమ్మ దంపతులు బాధతో ఇంటి ముఖం పట్టారు. ఈ అవమానం తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆవేదనతో వారిని చంపి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బోనాలు చేసుకుంటున్నామంటూ.. కొమురమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెల్లో చిన్న కుమార్తె వారివద్దే ఉండగా.. హుజూరాబాద్‌లోని బాల సదనంలో ఎల్లమ్మ ఐదో తరగతి, కోమల రెండో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం బాల సదనానికి వచ్చిన కొమురయ్య తమ ఇంట్లో బోనాలు చేసుకుంటున్నామని, తమ పిల్లలను పంపించాలని వార్డెన్‌కు లెటర్ రాసిచ్చి వెంట తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి ముగ్గురు కుమార్తెలకు ఉరివేసి.. అనంతరం దంపతులు కూడా ఉరి వేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. నిన్నటి వరకు తమతో కలిసి చదువుకున్న, ఆటలాడుకున్న ఎల్లమ్మ, కోమల మృతి చెందారనే తెలియడంతో బాల సదనంలో విద్యార్థులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురిపై కేసు నమోదు కొమురమ్మ దంపతుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చిగురుమామిడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు కొమురయ్య అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కొమురమ్మ అన్న చిన్నబత్తుల కొమురయ్య, అతడి భార్య రాజమ్మ, మరో అన్న భార్య పెద్ద రాజమ్మలపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. ఇలాంటి ఘటనలు బాధాకరం: ఈటల కందుగుల ఘటన విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో కొమురమ్మ దంపతులు, పిల్లల మృతదేహాలను సందర్శించారు. ఈ ఘటన బాధాకరమని.. సంచార తెగల్లో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ ‘మంత్రాల’గొడవలు! కందుగుల గ్రామంలోని గంగిరెద్దులకాలనీలో రెండేళ్ల కింద కూడా మంత్రాల నెపంతో కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాజా ఘటనలో ఆత్మహత్య చేసుకున్న కొమురయ్య బంధువైన ఓ మహిళ మంత్రాలు చేస్తోందంటూ కొండయ్య అనే ఓ వ్యక్తి గొడవకు దిగాడు. అయితే ఆ కులానికి చెందిన పెద్ద మనుషులు ఇరు వర్గాల నుంచి రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న మహిళను కాగుతున్న నూనెలో చేతులు పెట్టాలని, చేతులు కాలకుంటే మంత్రాలు చేయలేదని నమ్ముతామని తీర్మానించినట్లు తెలిసింది. ఆ మహిళ వేడి నూనెలో చేతులు పెట్టగా కాలలేదని.. దాంతో కొండయ్య డిపాజిట్ సొమ్మును వదిలి గ్రామం నుంచే వెళ్లిపోయినట్లు తెలిసింది. అప్పట్లో ఈ వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లగా.. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించినట్లు సమాచారం. -
భార్య, ముగ్గురు పిల్లలు, మరదలి నరికివేత
కర్ణాటకలో కిరాతకం కంప్లి(కర్ణాటక): కుటుంబ కలహాల కారణంగా ఐదుగురు కుటుంబ సభ్యులను కత్తితో నరికి దారుణంగా హతమార్చిన సంఘటన కర్నాటకలోని బళ్లారి జిల్లా కంప్లిలో చోటు చేసుకుంది. కురుగోడు పట్టణానికి చెందిన తిప్పణ్ణ భార్య, మరదలు, ముగ్గురు పిల్లలతో కలసి కంప్లిలో నివసిస్తున్నాడు. తిప్పణ్ణకు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి భార్య ఫక్కీరమ్మ(35), కుమారుడు(10), ఇద్దరు కుమార్తెలు(8, 6 ఏళ్లు), భార్య సోదరి గంగమ్మ (25)ని అతడు కత్తితో నరికి పోలీసులకు లొంగిపోయా డు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు చిన్నారుల మృతి
-
కాలయముడైన కన్నతండ్రి
' కూల్‌డ్రింక్‌లో విషం కలిపి హత్యాయత్నం ' చనిపోకపోవడంతో గొంతునులిమి ముగ్గురు చిన్నారుల హత్య వలిగొండ : కంటికి రెప్పలా కాపాడా ల్సిన తండ్రే కాలయముడయ్యాడు. ఆదమరిచి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తిలో సోమవారం వెలుగు చూసింది. వెల్వర్తికి చెందిన చముడాల రమేశ్ భార్య కవిత మూడు సంవత్సరాల క్రితం ముగ్గురు పిల్లలను, భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో రమేశ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు రెండోభార్యతోపాటే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో రెండోభార్య కూడా తల్లిగారింటికి వెళ్లిపోయింది. రమేశ్ పిల్లలు మాత్రమే ఉంటున్నారు. తన జీవనానికి అడ్డువస్తున్నారని అతడు తన ఇద్దరు కూతుళ్లు నిరోష(8), రక్షిత(7), కుమారుడు జశ్వంత్(4)లను చంపాలనుకున్నాడు. ఆదివారం రాత్రి ఎలుకలు చంపే మందును కూల్‌డ్రింక్(మజా)లో కలిపి తాగించాడు. సోమవారం తెల్లవారుజామున పిల్లలు కదులుతుండడంతో చనిపోలేదని నిర్ధారించుకుని దస్తీతో ఒక్కొక్కరిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం రమేశ్‌కూడా ఉరేసుకుని, కరెంట్ షాక్‌తో ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు. కానీ, భయపడి వెనుకంజ వేశాడు. సోమవారం తెల్లవారుజామున తండ్రి రాములు తలుపు కొట్టాడు. చాలాసేపు అవుతున్నా తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి గట్టిగా తలుపులు కొట్టారు. దీంతో వెంటనే తలుపు తీసి బైక్‌పై పరారయ్యాడు. మధ్యాహ్నం సమయంలో రమేశ్ పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. -
ఎలుకల మందు తాగించి.. గొంతు నులిమి..
ముగ్గురు పిల్లలను హత్య చేసిన తండ్రి వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో దారుణం పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..? వలిగొండ : కాపురానికి అడ్డొస్తున్నారని అనుకున్నా డో?..సాకలేక వదిలించుకోవాలనుకున్నాడో?.. కారణమైతే తెలియదు కానీ ఓ తండ్రి కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కడుపునపుట్టిన పిల్లలను తానే కాటేశాడు. శీతలపానియంలో ఎలుకలమందు కలిపి తాగించాడు.. అయినా చనిపోలేదని నిర్ధారించుకుని ఆపై గొంతు నులిమి కడతేర్చాడు. ఈ దారుణ ఘటన వలిగొండ మండలం వెల్వర్తి లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చముడాల రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం గుర్రంపోడ్ మండలంమొసంగి గ్రామానికి చెందిన కవితను వివాహం చేసుకున్నాడు. మకాం హైదరబాద్‌కు మార్చి అక్కడే జీవనం సాగించాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు నిరోష (8), రక్షిత (7), కుమారుడు జశ్వంత్(4) జన్మించారు. భార్యభర్త సఖ్యత లేకపోవడంతో కవిత మూడేళ్ల క్రితం భర్తను, పిల్లలను విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయింది. దీంతో రమేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన సుమలత ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలుగలేదు. కొంత కాలం క్రితం రమేష్ తన పిల్లలు, భార్యతో కలిసి వెల్వర్తికి వచ్చి తన సోదరుడిఇంట్లో నివసిస్తున్నాడు. పెద్ద కూతురు స్థానిక పవిత్రాత్మ హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి చదువుతుండగా రక్షిత ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి, కుమారుడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి.. రెండో భార్య పుట్టింటికి వెళ్లడంతో రమేష్, అతడి ముగ్గురు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో ఎలుకలమందు కలిపి తన ముగ్గురు పిల్లలు నిరోష, రక్షిత, జశ్వంత్‌కు తాగించాడు. అనంతరం వారిని పడుకోబెట్టాడు. తెల్లవారుజామున వారి కదలికలను గుర్తించాడు.చనిపోలేదని నిర్ధారించుకుని చేతి రుమాలుతో దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తానుకూడా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి విరమించుకున్నాడు. ఆపై విద్యుత్ దాఘాతంతో చనిపోవాలని ప్లగ్గులో వెర్లు పెట్టి వాటిని పట్టుకున్నాడు. వెంటనే విద్యుత్ ప్రసరణ కావడంతో బయపడి వెనుకంజ వేశాడు. ఈ సమయంలో అతని తండ్రి రాములు తలుపుకొట్టిన తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. దీంతో భయాందోళన చెందిన రమేష్ తలుపు తీసుకుని వెంటనే బైక్‌పై పారిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐలు ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న సమాచారం మేరకు రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, భువనగిరి రూరల్ సీఐ తిరుపతి, ఎస్ఐలు మంజునాథ్‌రెడ్డి, ప్రణీత్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వెల్వర్తికి తరలించారు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. మృతుల తాత రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రమేష్ పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రెండో భార్యను చితక్కొట్టడంతో.. లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్ తాగుడు కు బానిసయ్యాడు. రెండు,మూడు రోజుల కోసారి ఇంటికి వచ్చి భార్యతో తగాదా పడుతుండేవాడు. గత శనివారం కూడా భార్యతో గొడవపడి చితక్కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని వచ్చి చిన్నారుల మృతదేహాలను చూసి సొమ్మసిల్లింది. బంధువులు వచ్చారని.. బంధువులు వచ్చారని రమేష్ గ్రామంలోని హాస్టల్ ఉంటూ చదువుకుం టున్న నిరోషను ఆదివారం రాత్రి ఇంటికి తీసుకువచ్చాడు. కాగా, రెండో భార్య సుమలతతో గొడవపడిన రమేష్ ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.