భార్య, ముగ్గురు పిల్లలు, మరదలి నరికివేత
కర్ణాటకలో కిరాతకం
కంప్లి(కర్ణాటక): కుటుంబ కలహాల కారణంగా ఐదుగురు కుటుంబ సభ్యులను కత్తితో నరికి దారుణంగా హతమార్చిన సంఘటన కర్నాటకలోని బళ్లారి జిల్లా కంప్లిలో చోటు చేసుకుంది. కురుగోడు పట్టణానికి చెందిన తిప్పణ్ణ భార్య, మరదలు, ముగ్గురు పిల్లలతో కలసి కంప్లిలో నివసిస్తున్నాడు. తిప్పణ్ణకు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
శనివారం రాత్రి భార్య ఫక్కీరమ్మ(35), కుమారుడు(10), ఇద్దరు కుమార్తెలు(8, 6 ఏళ్లు), భార్య సోదరి గంగమ్మ (25)ని అతడు కత్తితో నరికి పోలీసులకు లొంగిపోయా డు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.