Kampli
-
అగ్నిసాక్షిగా తాళికట్టి.. అనుమానంతో చంపేశాడు..
సాక్షి, బెంగళూరు (కంప్లి): అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను అనుమానంతో అంతమొందించాడో కిరాతక భర్త. బళ్లారి జిల్లా కంప్లి కోట ప్రాంతంలో చోటు చేసుకుంది. కంప్లి కోట 1వ వార్డులో నివసించే దుర్గప్ప, హేమలత (30)కు 15 ఏళ్ల క్రితం పెళ్లి కాగా ముగ్గురు సంతానం ఉన్నారు. సజావుగా సాగిన వారి దాంపత్యంలో ఇటీవల కలతలు రేగాయి. పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని దుర్గప్ప తరచూ అనుమానంతో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. కత్తితో భార్యపై దాడి చేసి హతమార్చాడు. ఆ శబ్ధాలకు మేల్కొన్న పక్కింటి వ్యక్తి దుర్గప్పను పట్టుకునేందుకు యత్నించగా, అతనిపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాలించి శనివారం తెల్లవారుజామున దుండగుడు దుర్గప్పను అరెస్టు చేశారు. హేమలత మృతదేహాన్ని బళ్లారి విమ్స్‌కు తరలించారు. కాగా తల్లి చనిపోయి, తండ్రి జైలుకుపోయి పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) (సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..) -
పుడమి తల్లి రుణం తీర్చుకున్న మాతృమూర్తి
కంప్లి: ఈ రోజుల్లో తమ పిల్లలను ఏ డాక్టరో, ఇంజనీరో చేయాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. కానీ తనకు జన్మనిచ్చిన ఈ మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఆలోచించేవారు నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. ఆ ఒక్కరు.. హోస్పేట తాలుకా కమలాపురానికి చెందిన భువనేశ్వరి. భర్తను కోల్పోయి ఓ పూరింట్లో ముగ్గురు కొడుకులతో జీవనం సాగించేది. తన పెద్ద కొడుకు హరీష్‌ను బెళగాంలో జరిగిన మిలటరీ రిక్రూట్‌మెంటుకు పంపించింది. ఆ సెలక్షన్లో కుమారుడు అర్హత సాధించాడు. గత పదిహేను సంవత్సరాలుగా దేశ రక్షణలో ఉన్నారు. తన రెండో కొడుకును కూడా మిలటరీ సెలక్షన్స్‌కు పంపించింది. ప్రస్తుతం రెండో కుమారుడు వినోద్‌కుమార్ కశ్మీర్- పంజాబ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ మాతృమూర్తి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దిగమింగి జీవనం సాగిస్తోంది. తన ఇద్దరు కొడుకులు సైన్యంలో పొందిన ప్రశంసలు, బహుమతులను భద్రపరుచుకునే స్థితిలో కూడా లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. అయితే జన్మనిచ్చిన ఈ భూమి రుణం తన కొడుకుల ద్వారా తీర్చుకోవడం తనకెంతో తృప్తిగా ఉందని అంటోంది. ఆ మాతృమూర్తి భువనేశ్వరికి మనం సెల్యూట్ చేసి జోహార్లు పలకాలి. -
భార్య, ముగ్గురు పిల్లలు, మరదలి నరికివేత
కర్ణాటకలో కిరాతకం కంప్లి(కర్ణాటక): కుటుంబ కలహాల కారణంగా ఐదుగురు కుటుంబ సభ్యులను కత్తితో నరికి దారుణంగా హతమార్చిన సంఘటన కర్నాటకలోని బళ్లారి జిల్లా కంప్లిలో చోటు చేసుకుంది. కురుగోడు పట్టణానికి చెందిన తిప్పణ్ణ భార్య, మరదలు, ముగ్గురు పిల్లలతో కలసి కంప్లిలో నివసిస్తున్నాడు. తిప్పణ్ణకు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి భార్య ఫక్కీరమ్మ(35), కుమారుడు(10), ఇద్దరు కుమార్తెలు(8, 6 ఏళ్లు), భార్య సోదరి గంగమ్మ (25)ని అతడు కత్తితో నరికి పోలీసులకు లొంగిపోయా డు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మరో జన్మ ఉంటే వైశ్య కుటుంబంలో పుడతా
కంప్లి, న్యూస్‌లైన్: తాను వైశ్య కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని, మరో జన్మంటూ ఉంటే వైశ్య కుటుంబంలోనే పుట్టేలా దేవున్ని కోరుకుంటానని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి కవిత అన్నారు. ఆమె ఆదివారం ఆర్యవైశ్య సమాజ 15వ రాష్ట్రస్థాయి ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్లరిగూ... నమస్కార అని కన్నడంలో ప్రసంగం ప్రారంభించగానే అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. అనంతరం తన ప్రసంగం తెలుగులో ప్రారంభించారు. సహోదరర సవాల్, కిలాడికిట్టు అనే కన్నడ చిత్రాలలో నటించడం ద్వారా కన్నడ ప్రజల్లో గుర్తింపు పొందానన్నారు. ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా వారి వారి సంప్రదాయాలు మరవకపోవడం గర్వకారణమన్నారు. ఇతర వర్గాలు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారో అదే విధంగా ఆర్యవైశ్యులు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. తమ సమాజం మోసపూరితులు కారని, ఒకరికొకరు అదుకునే దయాగుణం ఉన్నవారన్నారు. తమ సమాజం వారికి చేయూత ఇవ్వడం అందరూ నేర్చుకోవాలన్నారు. కుడిచేతితో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని సూచించారు. వరకట్నం నిషేధించడం తన ప్రధాన అభిప్రాయమని, ధనంతో లెక్కకట్టి కోడలునో, అల్లుడినో ఖరీదు చేయడం మంచిది కాదన్నారు. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయ ప్రవేశం చేశానన్నారు. ఈ సందర్భంగా ఆర్యైవైశ్య సమాజ ప్రజలు అమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నటుడు పసనూరు శ్రీనివాసులు, కర్ణాటక ఆర్యవైశ్య మహాజన ప్రధాన కార్యదర్శి గిరీష్ బెండకూరు, ఆంధ్ర ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య అధ్యక్షులు విజయవాడ ఎం.ఆనంద్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.సంజీవప్ప, హనుమనాడు విభాగం మాజీ ఉపాధ్యక్షులు జీ.రాజారావ్, జీ.శ్రీనివాస్, కంప్లి వాసవి యువజన సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, డీవీ. సత్యనారాయణ, నారాయణాద్రి రైస్ ఇండస్ట్రీస్ ప్రముఖులు కేదారేశ్వరా వు, జీ.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.