
భర్త దుర్గప్ప, హేమలత (ఫైల్)
సాక్షి, బెంగళూరు (కంప్లి): అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను అనుమానంతో అంతమొందించాడో కిరాతక భర్త. బళ్లారి జిల్లా కంప్లి కోట ప్రాంతంలో చోటు చేసుకుంది. కంప్లి కోట 1వ వార్డులో నివసించే దుర్గప్ప, హేమలత (30)కు 15 ఏళ్ల క్రితం పెళ్లి కాగా ముగ్గురు సంతానం ఉన్నారు. సజావుగా సాగిన వారి దాంపత్యంలో ఇటీవల కలతలు రేగాయి. పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని దుర్గప్ప తరచూ అనుమానంతో గొడవ పడేవాడు.
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. కత్తితో భార్యపై దాడి చేసి హతమార్చాడు. ఆ శబ్ధాలకు మేల్కొన్న పక్కింటి వ్యక్తి దుర్గప్పను పట్టుకునేందుకు యత్నించగా, అతనిపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాలించి శనివారం తెల్లవారుజామున దుండగుడు దుర్గప్పను అరెస్టు చేశారు. హేమలత మృతదేహాన్ని బళ్లారి విమ్స్‌కు తరలించారు. కాగా తల్లి చనిపోయి, తండ్రి జైలుకుపోయి పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)
(సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)
Comments
Please login to add a commentAdd a comment