Three commit suicide
-
ముగ్గురి ఆత్మహత్య
భర్త మందలించాడని ఒకరు, మగాడు మోసగించాడని ఇంకొకరు, కడుపు నొప్పి భరించలేక మరొకరు... ఇలా శనివారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మందలించాడని... దమ్మపేట ఖమ్మం : భర్త మందలించాడన్న మనోవేదనతో ఓ మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ జలకం ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని రంగువారిగూడెం గ్రామానికి చెందిన గంపా వెంకటేశ్వరికి, ఇదే మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామస్తుడు గంపా నాగేంద్రబాబుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. బుధవారం సాయంత్రం, పిల్లాడు అదే పనిగా ఏడుస్తుండడంతో ఆ తల్లి విసిగిపోయి, చిన్న దెబ్బేసింది. దీనిని గమనించిన భర్త నాగేంద్రబాబు, ఆమెను మందలించాడు. దీంతో తీవ్రంగా మనోవేదనకు లోనైన ఆమె, ఇంట్లో ఉన్న కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను భర్త నాగేంద్రబాబు, అతని చెల్లెలు రెడ్డిరోజా కలిసి ఆటోలో సత్తుపల్లి ప్రభుత్వాసుత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఆమె అక్కడే గురువారం రాత్రి మృతిచెందింది. ఆమె తల్లి పాండ్ల శేషమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మగాడు మోసగించాడని... దమ్మపేట : పెళ్లి కాకుండానే ఆమె తల్లయింది. తనను పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు... మండలంలోని దురదపాడులో గురువారం అర్ధరాత్రి ఇది జరిగింది. దురదపాడు గ్రామానికి చెందిన అవివాహితురాలు సున్నం అలివేలు(25), ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగేళ్ల క్రితమే ఓ పాపకు తల్లయింది. తనను పెళ్లి చేసుకునేందుకు ఆ ప్రియుడు నిరాకరించాడు. దీంతో, తీవ్ర మనోవేదనను తట్టుకోలేని ఆమె గురువారం అర్ధరాత్రి ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి నాగమ్మ ఫిర్యాదుతో ఎస్సై జలకం ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కడుపు నొప్పి భరించలేక బాలిక... మధిర : కడుపు నొప్పి భరించలేని బాలిక, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధిర పట్టణంలోని ముస్లిం బజారులో శుక్రవారం ఇది జరిగింది. ముస్లిం బజారుకు చెందిన రషీద్ వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె అర్షియా ఖాఠూన్(17), మధిర పట్టణంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. దీనిని తట్టుకోలేక, శుక్రవారం తన ఇంటి పైనున్న గదిలో చదువుకుంటానని చెప్పి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రషీద్ ఫిర్యాదుతో కేసును టౌన్ ఎస్ఐ బెంద్రం తిరుపతిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. -
విషం తాగిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి
అనంతపురం : చదువుకోవడం ఇష్టం లేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజమునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ లు చనిపోయారు. మరో విద్యార్ధి చంద్రశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాడికి మండలం పుప్పాల యంగన్నపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించారు. వీరు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గత కొంతకాలంగా చదువు అంటే ఇష్టం లేదని, స్కూల్ కి వెళ్లమని కుటుండసభ్యులకు చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండ వద్దకు చేరుకుని అక్కడ విషపు గుళికలను కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గమనించి పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అయినా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు లోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు విద్యార్థులు మరణించారు. (యాడికి) -
స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం
యాడికి (అనంతపురం): రోజూ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామ శివారులో ఉన్న కొండమీద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ఇష్లం లేని ఆ ముగ్గురూ కలిసి విషపు గుళికలను పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరుగా ముగ్గురి ఆత్మహత్య
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: ప్రేమవివాహం అనంతర ం తల్లిదండ్రులు చేరదీయడం లేదని మాదగోని హరీష్‌గౌడ్(25) అనే యువకుడు గురువారం రాత్రి గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివరాజ్ వివరాల ప్రకారం.. నవీపేట్ మండలం నందిగామకు చెందిన హరీష్ గౌడ్ పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆర్మూర్ పట్టణానికి వలస వచ్చాడు. పట్టణంలో రాంనగర్లో నివాసముంటూ ఓ కల్లు డిపోలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిత్రం పట్టణానికి చెందిన స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని హరీష్ తల్లితండ్రులు నిరాకరించారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా మూడు రోజుల క్రితం కుమారుడి పుట్టు వెంట్రుక ల కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించాడు. వారు ఆహ్వానాన్ని తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన హరీష్ గురువారం సాయంత్రం ఇంట్లో గుళికల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్‌ను స్థానికులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శివరాజ్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్, సావిత్రిలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నవీపేట : పుట్టు వెంట్రుకల శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావుమేళాలు మోగాయి. నవీపేట మండలంలోని నందిగామకు చెందిన హరీష్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన సొంతూరు నందిగామలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హరీష్గౌడ్కు 11 నెలల కిందట బాబు పుట్టగా పుట్టు వెంట్రుకల శుభకార్యాన్ని శుక్రవారం వైభవంగా జరపాలని నిశ్చయించుకున్నారు. బంధువులకు ఆహ్వానాన్ని పంపారు. అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. బావిలో దూకి వివాహిత మద్నూర్ : మద్నూర్ మండలంలోని మేనూర్‌కు చెందిన పులికల్ల సారిక(27) అనారోగ్యంతో బాధపడుతూ గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో శోభన్‌బాబు తెలిపారు. ఎస్‌హెచ్‌వో వివరాల ప్రకారం... సారిక కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గురువారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వె ళ్లిపోయి గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం వరకు సారిక ఇంటికి రాకపోవడంతో కుటంబసభ్యులు ఆందోళన చెందారు. బావిలో మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బావిలోంచి బయటకి తీసి సారికగా గుర్తించారు. బిచ్కుంద సీఐ వేంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. సారికకు ఇద్దరు కుమారులు,భర్త సాయిలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో.. ఆర్మూర్ అర్బన్ : భార్యభర్తల మధ్య గొడ వ భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో రోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఉరుసు భీమయ్య(25) శుక్రవారం లయన్స్ బిల్డింగ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై ఖాజమొహీయోద్దీన్ వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఉరుసు భీమయ్య పదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి జీవనోపాధి కోసం వలస వచ్చాడు. మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన శాంతతో ఆయనకు వివాహం జరిగింది. కాగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం భార్యతో గొడవపడి భీమయ్య ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయలు దేరాడు. అనంతరం లయన్స్ బిల్డింగ్ సమీపంలో చెట్టు ఉరివేసుకుని కొట్టుమిట్టాడుతుండగా.. ఆయనను వెతుక్కుంటూ వెళ్లిన ఉర్సు గణేష్, పల్లెపు సాయిలు, ఉర్సు లక్ష్మణ్ అనే బంధువులు గమనించి ఉరి తాడును తొలగించి భీమయ్యను రక్షించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే భీమయ్య ప్రాణాలను విడిచాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.