ఇంజనీర్ హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష
గుంటూరు:ఓ హత్య కేసుకు సంబంధించి ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2012 లో జరిగిన ఇంజనీర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున ముగ్గురికి ఉరిశిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ మంగళవారం అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు తీర్పు వెలువరించారు.ఆ దోషులు ముగ్గురు జిల్లాలోని దాచేపల్లికి చెందిన వారు. వీరు మరో 20కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు.
రెండు సంవత్సరాల క్రితం ఓ ఇంజనీర్ ను కిరాతకంగా హత్య చేసి ఘటనలో వీరు జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో తుది తీర్పును ప్రకటించిన కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.