ఇప్పుడు మూడు కళ్ల సిద్ధాంతం!
హైదరాబాద్: అన్ని జాతీయ పార్టీలను మోసం చేసిన ఘనుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని టిఆర్ఎస్ నేత హరీష్రావు మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రెండు కళ్ల సిద్ధాంతం పోయి, మూడు కళ్ల సిద్ధాంతం వచ్చిందన్నారు. ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలది ఒక దారి, తెలంగాణ నేతలది ఇంకో దారి, చంద్రబాబుది మరోదారని విమర్శించారు.
అన్ని పార్టీల నేతలను చంద్రబాబు ఒంటరిగా కలవడంలో ఆంతర్య మేంటీ?అని హరీష్రావు ప్రశ్నించారు.