Three peoples died
-
ఆశలు.. బుగ్గిపాలు
చందంపేట (దేవరకొండ) : జిల్లాలోని గుర్రపుతాండాకు చెందిన కేతావత్ శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె సాత్విక(18) ఇం టర్ మొదటి సంవత్సరం, సుహాస్ నాయక్(16) 10వ తరగతి, జై సుచిత(14) 9వ తరగతిని అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని కొలిర్ విల్లేలో విద్యనభ్యసిస్తున్నారు. తండ్రి స్వగ్రామంలోనే పాస్టర్‌గా వ్యవహరిస్తూనే గుర్రపుతండాలో ఓట్రస్ట్ ఆధ్వర్యంలో అలేత్య బంజార పాఠశాలను నిర్వహిస్తూ సుమారు 450 మందికి విద్యనందిస్తున్నాడు. 20నెలల క్రితం వరకు శ్రీనివాస్‌నాయక్ సంతానం హైదరాబాద్‌లోనే ఓ పాఠశాలలో విద్యనభ్యసించారు. తదనంతరం ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు పంపించారు. అక్కడ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో.. సాత్విక, సుహాస్‌నాయక్, జై సుచిత అభ్యసిస్తున్న విద్యాసంస్థలకు ఈ నెల 20 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. అయితే, అమెరికాలోని ఐయోవా రాష్ట్రం లోనికొలిర్ విల్లేలో నివాసముంటున్న ఓపాస్టర్తో గుర్రపుతండా పాస్టర్ శ్రీనివాస్ నాయక్‌కు పరిచయముంది. కాగా, సదరు పాస్టర్ శ్రీనివాస్‌నాయక్ ముగ్గురు పిల్లలను తండ్రి అనుమతితో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చారు. షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అమెరికాలో ఉంటున్న పాస్టర్ ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అందరూ గాఢనిద్రలో ఉండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇల్లు పూర్తిగా కాలి పోగా అందులో ఉన్న పాస్టర్ శ్రీనివాస్ నాయక్ ముగ్గురు పిల్లలతో పాటు స్నేహితుడు పాస్టర్ భార్య ఖేలి కూడా సజీవ దహనమైంది. తమ సంతానానికి బంగారు భవిష్యత్ ఇవ్వాలనేది.. ఆ దంపతులు కల. అందుకు ఎన్ని వ్యయప్రయాసాలకోర్చైనా వారిని ఉన్నత విద్య అందించాలని నిర్ణయించుకున్నారు. కష్టనష్టాలు ఎదురైనా పిల్లలను అమెరికా పంపించి చదివిస్తున్నారు. కుటుంబ పెద్ద ఓ వైపు పాస్టర్‌గా వ్యవహరిస్తూనే...మరో వైపు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. విధి వైపరిత్యమో.. ప్రభువు ఆగ్రహమో తెలియదు కానీ.. అమెరికాలో క్రిస్మస్ వేడుకల్లో చోటు చేసుకున్న అపశ్రుతిలో ఆ దంపతుల ఆశలు సజీవ దహనమయ్యాయి. దీంతో నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండ లం గుర్రపుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్రపుతండాలో విషాదఛాయలు అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నిప్రమాదంలో మృత్యువాతపడడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాస్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌నాయక్‌కు బంధువులు అధికమే. అయితే స్వగ్రామంలో ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్‌గా శ్రీనివాస్‌నాయక్ స్వయంగా అన్ని తానై నిర్వహించారు. ఎప్పటికప్పుడు పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండే శ్రీనివాస్‌నాయక్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. అగ్నిప్రమాద ఘటనలో పిల్లలు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న బంధువులు, పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గ్రామానికి చేరుకున్నారు. కాగా పిల్లల మరణవార్త విన్న తండ్రి శ్రీనివాస్నా యక్, తల్లి సుజాతలు హుటాహుటిన అమెరికా పయనమయ్యారు. ఎమ్మెల్యే పరామర్శ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు మృతిచెందిన పిల్లల తండ్రి శ్రీనివాస్‌నాయక్ స్నేహితుడు. అగ్నిప్రమాద ఘటనలో గుర్రపుతండాకు చెందిన ముగ్గురు మృత్యువాతపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ స్వగ్రామానికి చేరుకున్నారు. మృతుల బంధువులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మండలంలోని గుర్రపుతండాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృత్యువాతపడిన విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు విషయాన్ని తెలియజేశారు. మృతదేహాలు స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు దౌత్యపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
అనుబంధాల్ని చిదిమేసింది..
- ఆస్తి గొడవల్లో దంపతులు, కొడుకు హత్య - మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - కర్ణాటకలో దారుణం బళ్లారి: పొలంలో రక్తం ప్రవహించింది. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం అనుబంధాల్ని చిదిమేసింది. దాయాదుల మధ్య ఏర్పడిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం సేడం తాలూకా ముగనూరు గ్రామ శివార్లలోని వ్యవసాయ భూమిలో రెండు దాయాది కుటుంబాలు ఆస్తి పంపకాల గొడవలతో బాహాబాహీకి దిగాయి. పరస్పరం గొడ్డళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన దేవరాయ (56), అతని భార్య కాళమ్మ (50), వారి కుమారుడు రాజశేఖర్(20)లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కలబుర్గి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సేడం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురిని బలిగొన్న టిప్పర్
పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం రూరల్) : టిప్పర్ ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన గెడ్డం వెంకటేశ్వరరావు అనే యాకోబు (18) అక్క విజయ నిశ్చితార్థం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పెదతాడేపల్లి శివారులోని పోశమ్మపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకునేందుకు యాకోబు మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా, అదే సెంటర్లో నెల్లూరు జిల్లాకు చెందిన సర్కస్ చేస్తూ భవాని కల్లి (15), భవాని ఏసు (17) తమను పెదతాడేపల్లిలో దింపాలని కోరారు. దీంతో వీరిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని వస్తుండగా భారతీయ విద్యాభవన్స్ సమీపంలోకి వచ్చేసరికి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో యాకోబు, భవాని కల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఏసుకు తీవ్రగాయాలు కావడంతో అతనిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. సొమ్మసిల్లిన అక్క ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టిన యాకోబు అందరితో చనువుగా ఉండేవాడు. అక్కలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. యాకోబు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి ఎస్తేరు సంరక్షణలో వీరు పెరిగారు. ఇద్దరు అక్కలకు గతంలో పెళ్లి జరగ్గా, చిన్న అక్కకు గురువారమే ఇంటి వద్ద నిశ్చితార్థం సందర్భంగా కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సమయంలో యాకోబు మృతి వార్త వారిని కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు ఎక్కడుకు వెళ్లావురా అంటూ అక్కలు కన్నీటిపర్యంతమయ్యారు. యాకోబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం వచ్చి.. నెల్లూరు జిల్లా నుంచి పొట్టకూటికోసం సర్కస్ ఫీట్లు చేసే సంచారజీవుల బతుకులు రోడ్డుప్రమాదంలో తెల్లారిపోయాయి. గుప్పెడు అన్నం కోసం జిల్లాలు దాటి వచ్చిన వీరిని తీరని ఆవేదనను మిగిల్చింది. పెదతాడేపల్లి శివారులో పదిరోజులుగా టెంట్లు వేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శనల ద్వారా పొట్టనింపుకుంటున్న వారిలో ఏసు, కల్లి ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలంలోని పలుగ్రామాల్లో సర్కస్ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేందుకు వాహనాలు లేకపోవడంతో అదే సమయంలో మోటారు సైకిల్‌తో ఒంటరిగా వెళుతున్న యాకోబు వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ అడిగితే కాదనలేకపోయాడు. ప్రమాదంలో వీరిద్దరూ దూరం కావడంతో సంచారజీవులు గుండెలవిసేలా రోదించారు. రూరల్ ఎస్సై కఠారి రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరుకాని ఊరిలో..
విజయనగరం క్రైం: రాష్ట్రం కాని రాష్ట్రం. ఎక్కడి నుంచో వస్తున్న వారు తమకు తెలియని ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయనగరం పట్టణంలో గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ ఇలా తెలియజేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఎం.పి.మోనికుట్టు (58) విన్ ఇండియా మిషనరీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈనెల 9న ఒడిశాలోని కొరాపుట్ జిల్లా జైపూర్‌లో మిషనరీ ప్రచార కార్యక్రమం కోసం వచ్చా రు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో జైపూర్‌కు చెందిన శుభంనాయక్ (19), పద్మనాభ నాయక్ (31), డ్రైవర్ నాదీరావ్ కౌంట్ మౌర్య బుధవారం రాత్రి 11 గంటలకు బొలెరో వాహనంలో విశాఖపట్నం వెళ్లేందుకు బయలు దేరారు. ఎం.పి.మోనికుట్టు కూడా విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వారితో పాటు బొలెరో వాహనంలో ప్రయాణం చేస్తున్నారు. విజయనగరంలోని ఆర్టీఏ కార్యాలయం మలుపు వద్దకు వచ్చేసరికి విజయనగరం వైపు నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్, బొలెరో ఎదు రెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శుభం నాయక్ (19), పద్మనాభనాయక్ (31) సంఘటన స్ధలంలో మృతి చెందగా, ఎం.పి.మోనికుట్టు, (58) బొలెరో డ్రైవర్ నాదీరావ్ కౌంట్ మౌర్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108, పట్టణ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎం.పి.మోనికుట్టు మృతి చెందారు. నాదీరావ్ కౌంట్ మౌర్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. శుభంనాయక్, పద్మనాభనాయక్ దగ్గర బంధువులు. విషయం తెలుసుకున్న ట్రాఫి క్ సీఐ ఎ.రవికుమార్, ఎస్సై ఎస్.అమ్మినాయుడు, స్వామినాయుడు, ఏఎస్సై ఎం.రాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పొక్లెయినర్‌తో పక్కకు నెట్టించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. మృతదేహాలను జిల్లా కేంద్రాస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళ వాసి అయిన ఎం.పి.మోనికుట్టు కుటుంబ సభ్యులు రావడానికి రెండు రోజులు పడుతుందని, మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచామని సీఐ తెలిపారు. అరగంట నరకయాతన.. లారీ, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న శుభం నాయక్ అరగంటపాటు నరక యాతన అనుభవించాడు. డైవరు పక్క సీట్లో కూర్చు న్న శుభం నాయక్ వాహనం ముదు భాగం అంతా నుజ్జునుజ్జవడంతో సీటుకు మధ్యలో ఇరుక్కుపోయా డు. కాపాడండి.. కాపాడండి.. అని కేకలు వేస్తూ..దాహం..దాహం వేస్తోంది మంచినీళ్లు కావాలని మొరపెట్టుకున్నాడు. శుభం నాయక్‌ను రక్షించేందుకు ట్రాఫిక్ సిబ్బంది అరగంటపాటు పడిన శ్రమ ఫలించలేదు. చివరకు వాహనంలోనే ప్రాణం విడిచిపెట్టాడు. నిన్ననే కొన్నారు..శుభం నాయక్ తండ్రి సుభాష్ చంద్రనాయక్ బొలెరో వాహనాన్ని బుధవారమే కొన్నారు. ఇంకా కొత్త టీ.ఆర్.నంబర్‌తోనే బొలెరో వాహనం ఉంది.