ఈసారి మూడు బాలిస్టిక్ క్షిపణులు పేల్చింది
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా తన అణు పరీక్షలు క్షిపణుల రూపంలో చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తు లెక్కచేయకుండా దిక్కార తీరుతో ముందుకెళ్తూనే ఉంది. మంగళవారం మూడు స్వల్ప దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ అణు క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణి కొరియా అధికారులు చెప్పారు. స్కడ్ సీ టైప్ క్షిపణులను తమ దేశంలోని వాంజున్ అనే ప్రాంతం నుంచి ఉదయం 5.45 నుంచి 6.05గంటల మధ్యలో పరీక్షించినట్లు వెల్లడించారు.
ఇవి నేరుగా 500 నుంచి 600 కిలో మీటర్లు ప్రయాణించి తూర్పు సముద్రంలోని లక్ష్యాలను ఢీకొట్టి సముద్రం పడినట్లు తెలిపింది. అంటే, ఈ క్షిపణులతో కూడా నేరుగా దక్షిణ కొరియాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా దాడులు చేయవచ్చన్నమాట. ఇరు దేశాల మధ్య టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్)ను విస్తరించుకోవాలని అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ఒప్పందం జరిగిన ఆరు రోజులకే ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.