మూడేళ్ల పాలనపై శ్వేతపత్రం ఇవ్వండి
టీఆర్ఎస్కు కొండా రాఘవరెడ్డి డిమాండ్
షాద్‌నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గురు వారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు తన మేనిఫెస్టో లోని ఒక్కహామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ మూడేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్త య్యాయి. వాటికి చేసిన ఖర్చు ఎంత.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తానని, ఒక్కో జిల్లాకు 5 నియోజకవర్గాలు ఉంటా యని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 31 జిల్లాలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం 36 లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసినా ఇంకా బాకీ తీరలేదన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలిస్తామని కేవలం 250మందికే ఆ డబ్బు అందజేశారన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డులు ఇంకా అమలుకు నోచుకో లేదన్నారు. రాబోయే ఆసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రతి నియోజకవర్గం లో పోటీ చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు శీలం శ్రీను, మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ జహంగీర్, విద్యార్థి విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ అఖిల్, యూత్ జనరల్ సెక్రటరీ సంతోష్ పాల్గొన్నారు.