ఫ్లో మ్యాచ్‌లో భీమవరం జట్టు గెలుపు
గణపవరం (నిడమర్రు) : ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి(ఫ్లో) సీజ న్ –2లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం భీమవరం, తాడేపల్లిగుడెం జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. భీమవరం జట్టు 3–0 స్కోర్‌తో తాడేపల్లిగూడెం జట్టుపై విజేతగా నిలిచింది. మ్యా న్ ఆఫ్ ది మ్యాచ్‌గా నైజీరియా ఆటగాడు స్కిల్స్ నిలిచాడు. ప్రేక్షకుల నుంచి నిడమర్రు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని డి.ఉష లావా మొబైల్ గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ప్లో చైర్మ న్ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ మన జిల్లా నుంచి ఒక్కరినైనా ఆంతర్జాతీయ క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు, కైకలూరు, గోపాలపురం నియోజకవర్గాల కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, తలారి వెంకట్రావు, సర్పంచ్ కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు.