Tiananmen Square
-
జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?!
బీజింగ్: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్‌పిన్ సర్కార్. కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨 Tanks are being put on the streets in China to protect the banks. This is because the Henan branch of the Bank of China declaring that people's savings in their branch are now 'investment products' and can't be withdrawn. 🔊sound pic.twitter.com/cwTPjGz84K — Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022 చరిత్ర పునరావృతం అయ్యేనా.. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్‌లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా. అన్నట్లు మొన్న జూన్ 4వ తేదీకి టియానన్ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా. -
యాపిల్ పుట్టినిల్లు ఎక్కడో తెలుసా? ఆ పండ్లు చిన్నగా, చేదుగా ఉండేవా!
హాలిఫాక్స్: యాపిల్ పండును వర్ణించమంటే ఎలా వర్ణిస్తాం? ఎర్రగా, తియ్యగా, పెద్దగా ఉంటుంది అంటాం. కానీ నిజానికి పురాతన కాలంలో యాపిల్ ఇలా ఉండేది కాదట! చాలా చిన్నగా, చేదుగా ఉండేదని కెనడా పరిశోధకులు చెప్తున్నారు. వేలాది సంవత్సరాల కాలంలో రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పుడున్న ఆకారం, రంగు, రుచికి తీసుకొచ్చారని తేల్చారు. యాపిల్ పుట్టినిల్లు ఇప్పటి కజకిస్తాన్‌లోని తియాన్షెన్ కొండలు. ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మాటీ పేరు యాపిల్ నుంచే పుట్టింది. అల్మాటౌ అంటే కజక్ భాషలో యాపిల్ కొండ అని అర్థం. మానవులు గత 5,000 సంవత్సరాలుగా యాపిల్‌ను సాగు చేస్తున్నారు. పురాతన కాలంలో యాపిల్ విత్తనాలను సిల్క్ రూట్ గుండా ఆసియా అంతటికీ రవాణా చేశారు. తర్వాత ఇవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చేరాయి. అప్పట్లో యాపిల్స్ చాలా చిన్నవిగా, చేదుగా ఉండేవి. కజకిస్తాన్ కొండల్లో సహజంగా యాపిల్ చెట్లు పెరుగుతుంటాయి. వాటికి కాసే పండ్లు చిన్న, చేదుగా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ అటవీ జాతి యాపిల్స్‌తో పోలిస్తే మనుషులు సాగు చేసే పండ్లు 3.6 రెట్లు అధిక బరువు, 43 శాతం తక్కువ అమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. చేదుకు కారణమయ్యే ఫినోలిక్ కాంపౌండ్ 68 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే చేదు చాలావరకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత 200 ఏళ్లుగా యాపిల్స్‌లో కొత్త రకాలను సృష్టించడంలో వేగం పెరిగింది. ఎక్కువ కాలం నిలువ ఉండే పండ్లను సాగు చేస్తున్నారు. అందులో తీపి శాతాన్ని పెంచుతున్నారు. -
బెదిరింపులకు భయపడం..తైవాన్‌పై మా నిర్ణయం మారదు
బీజింగ్: చైనాను బెదిరించాలనుకునే విదేశీ శక్తులు 140 కోట్ల దేశ ప్రజలు, శక్తిమంతమైన దేశ మిలటరీలతో కూడిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాను వ్యతిరేకించే దేశాలకు జిన్‌పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షిక ఉత్సవాలను గురువారం ప్రతిష్టాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మావో జెడాంగ్ భారీ చిత్రపటం నేపథ్యంలో.. తియానన్మెన్ గేట్ బాల్కనీ నుంచి వేలాది దేశభక్తులను ఉద్దేశించి జిన్‌పింగ్ ప్రసంగించారు. చైనాలో తైవాన్ పునఃవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా.. చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని సీపీసీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ కూడా అయిన జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతోందని అమెరికా సహా ఇండో పసిఫిక్ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు, మానవహక్కులు, కరోనా పుట్టుక.. తదితర అంశాలపై చైనాను విమర్శించడం తెలిసిందే. ‘విదేశాల బెదిరింపులకు భయపడం. మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు.. అణచివేయలేదు.. వేధించలేదు. ఇకపై కూడా అలా చేయబోం. అలాగే, ఏ దేశం కూడా మనల్ని భయపెట్టే, అణచివేసే, వేధించే చర్యలకు పాల్పడితే సహించబోం’ అని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. 3ఒకవేళ ఏ దేశమైనా అందుకు తెగిస్తే.. 140 కోట్ల మందితో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్‌ను ఢీ కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో దాదాపు 70 వేల మంది పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కార్యక్రమంలో అత్యాధునిక జే 20 ఫైటర్ జెట్స్ సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేత విన్యాసాలు చేశాయి. ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో మావో తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ ఎదిగారు. పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో 100 ఏళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్ సూట్‌ను ధరించి జిన్‌పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తైవాన్ విలీనంపై రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే విషయంలో దేశ ప్రజల ప్రతిన, పట్టుదల, అసాధారణ సామర్ధ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. తైవాన్ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్తులు భావిస్తారు. కానీ చైనా మాత్రం అది చైనా భూభాగమేనని వాదిస్తోంది. ఒకవేళతైవాన్‌ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే.. తైవాన్‌కు మిలటరీ సాయం అందించాలని అమెరికా చట్టాల్లోనే ఉంది. రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి, నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జిన్‌పింగ్ ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జిన్ పింగ్ పేర్కొన్నారు. సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను 1921 జులై 1 న మావో ప్రారంభించారు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి సీపీసీ అధికారంలో కొనసాగుతోంది. సీపీసీని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. 95 లక్షల మంది పార్టీ సభ్యులు, 140 కోట్ల దేశ ప్రజలు ఆ పరిస్థితిని రానవ్వరన్నారు. సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్‌లను ఏరివేస్తామని, పార్టీలో అసమ్మతిపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, హాంకాంగ్‌లో చైనా నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడాన్ని జిన్‌పింగ్ సమర్థ్ధించారు. ‘మనకు చెప్పే హక్కు తమకే ఉందని భావించే వారి నీతులను వినే ప్రసక్తే లేదు’ అని అమెరికాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థి క వ్యవస్థపై మాట్లాడుతూ.. మైలురాళ్ల వంటి సంస్కరణలతో కేంద్రీకృత ఎకానమీని సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా విజయవంతంగా మార్చగలిగామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. -
నూరేళ్ల జన చైనా జైత్రయాత్ర
చైనా కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవ త్సరాల ఉజ్వల చరిత్రకు సాక్షిగా ఈనాటి జనచైనా అరుణకాంతు లతో వెలుగులీనుతోంది. ఒక నిరు పేద స్థితి నుంచి రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పురోగమించిన మహ త్తర విప్లవ నిర్మాణానికి చిహ్నంగా వారి ఎర్రజెండా ఎగురుతోంది. 140 కోట్ల ప్రజల కలలకు, ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నాయకత్వం వహిస్తూ వారి మన్న నలు పొందుతోంది. ఇదంతా తేలికగా సాధ్యమయ్యింది కాదు. అకుంఠిత దీక్షతో ఒక్క మాటగా, కలసికట్టుగా చేసిన జైత్రయాత్ర. అనేక కుట్రలను, శత్రుప్రేరిత చర్యలను తిప్పి కొడుతూ తనను తాను నిరూపించుకుంటూ సాగిన మహా ప్రయాణం. అయితే, అభూత కల్పనలను, అంతర్ విద్వేషా లను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ సాగిన ఒక చారిత్రక ఘట్టమే తియనన్మెన్ స్క్వేర్. 1989 జూన్ 4 నాడు తియనన్మెన్ స్క్వేర్‌లో పదివేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు ఒక విష ప్రచారం చేశారు, చేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతున్నది అని పరి శీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్త లను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కూడా కొందరు అందులో భాగమయ్యారు. ఆనాడు 500 బిలియన్ డాల ర్లున్న చైనా జీడీపీ నేడు 14,000 బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్ చూపెట్టిన, ఆ తర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంలో వారు ఈ స్థాయికి చేరారు. 1989 తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనా మార్గం స్థానంలో ప్రజాస్వామ్యం పేరిట మరో వ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీ ప్రజల్లో కన్పించటం లేదు. దేశంలో అమలు చేయవలసిన సంస్కరణల గురించి పార్టీ నాయకత్వంలో చర్చలు కొనసాగుతున్న కాలం. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత హుయావొ. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధాన కార్యదర్శిగా రాజీనామా (16–1–1987) చేసి, పొలిట్‌బ్యూరోలో వుండగా 15–04–89న మరణించారు. నాటి సంతాప వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యం పోశాయి విదేశాలు, విదేశీ మీడీయా. అలా ఏప్రిల్ 18–22న సంతాపం పేరిట వేలాదిమంది తరలి వచ్చారు. అదే ముదిరి 50 రోజులు కొనసాగింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని కొందరు విద్యార్థులు, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని తలకెత్తుకున్న కొందరు విద్యార్థులు కూడా అందులో వున్నారు. అమె రికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం. అప్పటి విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వాల గురించి పైపై అవగాహనే వుంది. అభివృద్ధి, సంపద, సౌకర్యాలు, టెక్నాలజీ... ఇవన్నీ కలిసి ‘రెడ్ జీన్’ని పలుచన చేస్తాయేమోనని కొంత ఆందోళన వున్న కాలం అది. డెంగ్ లిబరల్ ఆర్థిక సంస్క రణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడి దారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ‘చైనా తరహా సోషలిజం’ పేరిట అనుసరించిన వ్యూహం–ఎత్తుగడల ఫలితాలు ఈనాడు ప్రపంచమంతా చూస్తున్నది. సిద్ధాంత సంక్షోభం తలెత్త నీయకుండా ఆ ప్రమాదాన్ని పసిగట్టే ‘బూర్జువా లిబర లైజేషన్’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించాయి(పార్టీ 13వ మహాసభలో, 1987 అక్టోబరు). సంస్కరణల క్రమంలో పెచ్చరిల్లిన బూర్జువా లిబరలైజే షన్ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్క్సిస్టు లెనినిస్టు మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేశారు. ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్య వాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, కొద్దిమంది తీవ్రమైన తప్పు చేశారు. ‘మొత్తం’ ఎంతమంది చనిపోయారు? చైనా లెక్క 300 (సైనికులతో సహా). జూన్ 3 రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్న పుకారు: పదివేలమంది. అమెరికా గూఢచారి సంస్థ లెక్క– 500 మందిదాకా. యామ్నెస్టీ లెక్క 1000 దాకా. స్క్వేర్‌లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. ‘అక్కడ’ రక్తపాతం జరగలేదని 2011లో అమెరికా రాయబార కార్యా లయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్య కపటాన్ని (నేటి భాషలో పోస్ట్ ట్రూత్) చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. ఆ తరువాత నడిచిన చరిత్ర చైనా వారి సూత్రీకరణలు ఎంత సరైనవో నిరూపించింది. తూర్పు యూరప్‌లో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతన మవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ తన ప్రస్థానం కొనసాగిస్తున్నది. ‘పాశ్చాత్యీకరించబడిన’ ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. సోషలిస్టు మార్కెట్ విధానాలతో, ప్రపంచీ కరణ సమయంలో ఏర్పడ్డ సౌలభ్యాలని తమ జాతీయ అభి వృద్ధికి మార్గంగా చేసుకుని జన చైనా మహాప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చైనా లక్ష ణాలతో సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకున్న సోషలిస్ట్ రాజ్యంగా మునుముందుకు దూసుకు వెళుతున్నది. ఇది సహించలేని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ భయకంపిత చిహ్నాలే చైనాకు వ్యతిరేకంగా కూటములు కట్టడం, అడు గడుగునా చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగించటం. వారి సంస్కృతిని, సాంకేతిక నైపుణ్యాన్ని కించపరచటం, అసలు ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం చైనా అనే బూటకపువాదం యుద్ధభేరీలా మోగించటం. అయితే ప్రపంచ ప్రజల అభి ప్రాయం భిన్నంగా ఉంది. సామ్రాజ్యవాద, ఆధిపత్య శక్తుల దోపిడీ ప్రయోజనాలను, పీడక స్వభావాణ్ని ప్రపంచ ప్రజలు అవగతం చేసుకుంటూ జన చైనా వెనుక నిలుస్తు న్నారు, జేజేలు చెబుతున్నారు. వ్యాసకర్త భారత–చైనా మిత్ర మండలి ఉపాధ్యక్షులు మొబైల్ : 98498 06281 -
‘తియాన్మెన్ స్క్వేర్’ సంస్మరణపై చైనా ఉక్కుపాదం
హాంకాంగ్: హాంకాంగ్‌లో జరగబోయే తియాన్మెన్ స్క్వేర్ సంస్మరణ కార్యక్రమాలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో ఎలాంటి స భలు, సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లే దని తేల్చిచెప్పింది. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించింది. చైనాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తూ 1989 జూన్ 4న బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్‌లో వేలాది మంది విద్యార్థులు సమావేశమయ్యారు. చైనా సైన్యం వారిపై దమనకాండ సాగించింది. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయా రు. ఈ మా రణకాండలో బలైన విద్యార్థుల త్యాగాలను స్మరించుకొనేందుకు ప్రతిఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఆంక్షలు పెరగడంతో ప్రధాన సంస్మరణ కార్యక్రమాలను హాంకాంగ్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల హాంకాంగ్‌లోని విక్టోరియా పార్క్ పరిసరాల్లో ఈసారి వీటికి అనుమతి ఇవ్వ బోమని చైనా సర్కారు తేల్చిచెప్పింది. గత ఏడాది విక్టోరియా పార్క్‌లో వేలాదిమంది సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు హాంకాంగ్‌లో క్యాండిల్ లైట్ ర్యా లీకి పిలుపునిచ్చిన చౌ హాంగ్ తుంగ్ అనే ఉద్యమకారిణిని, సంస్మరణ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంక్షలున్నప్పటికీ, జనం పెద్ద సంఖ్యలో విక్టోరియా పార్క్ వద్దకు చేరుతున్నట్లు సమాచారం. -
ఊచకోత కారకుడు మృతి
బీజింగ్: చైనా మాజీ ప్రధాని, తియానన్మెన్ స్క్వేర్‌లో వేలాది మంది ఊచకోతకు కారకుడు లీపెంగ్(90) కన్నుమూశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ లీపెంగ్ అనారోగ్యంతో సోమవారం బీజింగ్‌లో మృతి చెందినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఇంతకుముందు ఆయన మూత్రాశయ కేన్సర్‌తో బాధపడ్డారు. 1989లో దేశ రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్యవాదులు కొన్ని వారాలపాటు శాంతియుత నిరసనలు తెలిపారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న లీపెంగ్ బీజింగ్‌లో మార్షల్ లా విధించారు. అయినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో 1989 జూన్ 3, 4వ తేదీల్లో తియానన్మెన్ స్క్వేర్‌లో బైఠాయించిన నిరసనకారుల పైకి సైన్యాన్ని పంపారు. యుద్ధట్యాంకులతో వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కించారు. దీంతో నిరాయుధులైన వెయ్యి మందికి పైగా యువకులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాన్ని చైనా ఉక్కుపాదంతో అణచివేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. అప్పటి నుంచి లీ పెంగ్ ప్రపంచం దృష్టిలో అణచివేతకు ప్రతిరూపంగా, బీజింగ్ కసాయి (బుచర్ ఆఫ్ బీజింగ్)గా నిలిచిపోయారు. సైనిక చర్య చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవ నిర్ణయమైనప్పటికీ, ఈ ఘటనకు లీపెంగ్‌నే బాధ్యుడిగా భావిస్తారు. ఆయన ఆ తర్వాత కూడా తన నిర్ణయాన్ని ‘అవసరమైన చర్య’గా సమర్థించుకున్నారు. ‘ఇలాంటి చర్యలు తీసుకోకుంటే ఒకప్పటి సోవియట్ యూనియన్, పశ్చిమ యూరప్ల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పట్టిన గతే చైనాకూ పట్టేది’ అని 1994లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా లీపెంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
ట్యాంక్ వీరుడిపై వీడని మిస్టరీ
ట్యాంక్‌మ్యాన్ ప్రతిఘటనకు దిగిన వేళ – 1989 జూన్ 5న కొందరు అతడి ఫొటోలు తీశారు. ఆ సమయంలో అతడు తెల్ల చొక్కా వేసుకున్నాడు. చేతిలో రెండు సంచులు న్నాయి. నేరుగా వెళ్లి భారీ ట్యాంకులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. విదేశీ పత్రికల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సమీప హోటళ్ల బాల్కనీల్లో నుంచి అతడి ఫొటోలు తీశారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అతడికి మరణశిక్ష అమలు చేశారని కొందరు భావిస్తుంటారు. ఎక్కడో రహస్య జీవనం గడుపుతున్నాడనేది మరికొందరి అభిప్రాయం. మిలటరీ అతడి ప్రాణానికి ఎలాంటి హానీ తలపెట్టలేదని చైనా అధికారులు ప్రకటించారు. చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కూడా 1990లో బార్బరా వాల్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతణ్ణి చంపలేదని చెప్పారు. మొత్తం మీద ట్యాంక్‌మ్యాన్ గురించిన చర్చ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆ ధీరునికి ఏమయ్యిందో వెల్లడించాలని చైనా ప్రభుత్వాన్ని కోరుతూ తియానన్మెన్ నిరసనల్లో పాల్గొని, ప్రస్తుతం ఆమెరికాలో హక్కుల కార్యకర్తగా పని చేస్తున్న యాంగ్ జియాన్లీ ఇటీవల ఒక పిటిషన్ రూపొందించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాడు. ట్యాంక్ మ్యాన్ జ్ఞాపకాలను తుడిచేసే పనిలో పడిన చైనా.. ఇటీవల అతడి ఆన్లైన్ ఫొటోలపై నిషేధం విధించింది. ఆజ్ఞలను ధిక్కరించిన వారికి శిక్ష విధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 49 శాతం మంది అతడి ఫొటోలను తాము గుర్తుపడతామంటారు. చైనా వెలుపల ట్యాంక్‌మ్యాన్ ఒక హీరో. అతడిని కేంద్రంగా చేసుకుని పలు పుస్తకాలు, డాక్యుమెంటరీలు వెలువడ్డాయి. టీవీ షోలు ప్రసారమయ్యాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యాయి. ‘చిమెరికా’పేరిట ఇటీవల ప్రారంభమైన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ ట్యాంక్‌మ్యాన్ పాపులారిటీకి ఒక ఉదాహరణ. ట్యాంక్‌మ్యాన్ మిస్టరీని ఛేదించేందుకు ఓ అమెరికన్ ఫొటో జర్నలిస్టు జరిపే అన్వేషణ ఇందులోని ఇతివృత్తం. మొత్తం మీద – తన చిత్రాలు, పోస్టర్లు, తన చిత్తరువులు ముద్రితమైన టీ షర్టులు, టీవీ షోల ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు ట్యాంక్‌మ్యాన్. అమెరికా, చైనా పరస్పర విమర్శలు బీజింగ్/వాషింగ్టన్: ఊచకోత ఘటనలో ఎంతమంది ప్రజాస్వామ్యవాద నిరసనకారులు మరణించారో బహిరంగంగా ప్రకటించాలంటూ చైనాను అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో కోరారు. మారణకాండకు చైనా ఆర్మీదే బాధ్యత అని అన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ అమెరికా ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. పాంపియో వ్యాఖ్యలపై అమెరికాతో తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ‘ప్రజాస్వామ్యం, మానవహక్కులనే నెపంతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కొందరు అమెరికా వ్యక్తులు తమ సొంత దేశంలోని సమస్యలపై మాత్రం మాట్లాడటం లేదు’ అని షువాంగ్ అన్నారు. చైనా మౌనం వీడాలి: ఈయూ తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన దారుణాలపై చైనా పెదవి విప్పాలనీ, 30 ఏళ్ల క్రితం అక్కడ చనిపోయిన నిరసనకారులు ఎంతమందో, ఇంకెందరిని జైళ్లలో పెట్టారనే సంఖ్యలను చైనా ప్రకటించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది. అప్పుడు అరెస్టయిన వారిలో ఇంకా జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని చైనాను ఈయూ కోరింది. -
రక్తపు మరకలు..!