సంగారెడ్డిలో టైగర్ బటర్ఫ్లై
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలోని రాజంపేటలో ధన్రాజ్ యాదవ్ ఇంటి ఆవరణలో బుధవారం అరుదైన టైగర్ సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. పులిచర్మం రంగులో ఉన్న సీతాకోక చిలుక కనిపించడంతో కాలనీవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. అచ్చం పులి కళ్లు మాదిరిగా ఉండే టైగర్ సీతాకోక చిలుక కనిపించడం చాలా అరుదు.