సుబ్బిరామిరెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డిపై సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదు అయింది. కాచిగూడ మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లో అక్రమ పార్కింగ్ వసూళ్ల పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 188, 418, 420 సెక్షన్లతో పాటు అపార్టుమెంట్ యాక్టు కింద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.