time waste
-
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్‌గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్‌ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్‌జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
121 గంటలు వృధా; వెంకయ్య ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలాంటి కీలక అంశాలను చేపట్టకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో సభ్యుల నిరవధిక ఆందోళనతో ఏకంగా 121 గంటల విలువైన సభా సమయం వృధా అయింది. వాయిదాల పర్వం, సభ్యుల ఆందోళనలతో రాజ్యసభలో 27 రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టలేదని సభాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. కేవలం 44 గంటల పాటే సభా సమయం సజావుగా సాగింది. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా సభ సజావుగా లేదంటూ చర్చకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటు, విగ్రహాల ధ్వంసం, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం ఉత్తర్వులు వంటి పలు అంశాలపై పార్లమెంట్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో నాలుగింట మూడొంతుల సమయం సభ్యుల అభ్యంతరాలు, అవాంతరాలు, వాయిదాలతో వృధా అయింది. విలువైన సభా సమయం హరించుకుపోవడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని రాజ్యసభ 245వ సమావేశాల ముగింపు సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. -
లోపల సమావేశం.. బయట కాలక్షేపం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మంగళవారం స్థానిక బాలుర ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమావేశానికి వచ్చిన హెచ్ఎంలు స్థలం లేక కొందరు హాలు బయట కూర్చొని కబుర్లు చెప్పుకోగా, మరికొందరు చెట్ల కింద కాలక్షేపం చేశారు. వందలాది మంది హెచ్ఎంలు సమావేశానికి హాజరుకాగా కూర్చోవడానికి స్థలం లేక సుమారు 20 శాతం పైగా బయట ఉండాల్సిన పరిస్థితి. ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తే అధికారుల సందేశం వినే పరిస్థితి లేదంటూ వారు నిట్టూర్చారు. అందరికీ సరిపడే వేదికను ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు. తాము ఇంతదూరం వచ్చి ఏంలాభమని మండిపడ్డారు. -
ఇదేనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ?
-
పది నెత్తిన ప్రత్యేక భారం
నెల్లూరు(విద్య): పరీక్షలు దగ్గర పడుతున్నాయి... టైమ్ వేస్ట్ చేయొద్దు.. కొత్త మెటీరియల్ వచ్చింది. చూశావా... అంటూ పదో తరగతి విద్యార్థులను టీచర్లు, బంధువులు అడుగుతుంటే విద్యార్థుల్లో రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతోంది. కారణం రోజుకొక కొత్త మెటీరియల్ మార్కెట్లోకి విడుదల కావడమే. స్పెషల్ మెటీరియల్ టెన్త్ విద్యార్థులపై మోయలేని భారంగా తయారవుతున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు పరీక్షల విధానం ఖరారు కాలేదు. కొత్త సిలబస్, పాత పరీక్షా పద్ధతిని ఖరారు చేసినప్పటి నుంచి మెటీరియల్ రూపకల్పన ప్రారంభమైంది. సంక్రాంతి సెలవుల నుంచి ఈ మెటీరియల్స్ మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా వెలిశాయి. వర్క్‌బుక్స్, స్టడీ మెటీరియల్స్, బిట్‌బ్యాంక్స్, ఆల్ ఇన్ ఒన్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్తపుస్తకం మార్కెట్లోకి విడుదలైన వెంటనే ఆ పుస్తకాన్ని చదవాలంటూ రకరకాలుగా ప్రచారాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ పుస్తకం చదవకపోతే మార్కులు తగ్గిపోతాయోనన్న భయం పిల్లలను చదివింది కాస్తా మరచిపోయేలా చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు మోయలేని భారం ఇదిలా ఉంటే మార్కెట్లోకి విడుదలైన ప్రతి స్పెషల్ మెటీరియల్‌ను కొనేందుకు తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధపడాల్సిన విద్యార్థులను లాభపేక్షతో కొందరు ఇబ్బందులపాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. డబ్బులు వెచ్చించి తమ పిల్లలను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. తమ పిల్లలకు మంచి మార్కులు రావాలనే క్రమంలో అప్పులపాలైనా పర్వాలేదని మార్కెట్లో ఉండే స్పెషల్ మెటీరియల్స్‌ను కొంటున్నారు. పిల్లవాడిపై పడుతున్న భారం వారికి గుర్తుకు రాకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు 34,680 విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో జెడ్పీ పాఠశాలల నుంచి 15,691 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,070 మంది, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల నుంచి 1,348 మంది, వెల్ఫేర్ పాఠశాలల నుంచి 1,714 మంది, కేజీబీవీల నుంచి 337 మంది, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 1,170 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 13,344 మంది, ప్రైవేటుగా 1,437 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆంగ్లమాధ్యమంలో 17,890, తెలుగు మాధ్యమంలో 16,778 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్కొక్క మెటీరియల్ సగటున రూ.150 వేసుకున్నప్పటికీ 10 మెటీరియల్స్ కొనడం తల్లిదండ్రుల ఆర్థిక భారమవుతుంది. వాటిని చూస్తేనే పిల్లల్లో ఆందోళన పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఈ స్పెషల్ మెటీరియల్స్‌పై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల ఆరాటం ఉత్తమ ఫలితాలను సాధించాలనే ఆరాటంతో కొందరు టీచర్లు కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే కఠినచర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరిస్తుండటంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల మానసిక పరిస్థితులను గమనించకుండా రకరకాల మెటీరియళ్లపై దృష్టిపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొన్ని ప్రైవేటు స్కూళ్లు సిండికేట్లుగా ఏర్పడి ఏకంగా పబ్లిషర్స్‌తో ఒప్పందాలు చేసుకుని తమ పాఠశాలల్లో ఆ మెటీరియళ్లను మాత్రమే వాడేలా చూస్తున్నారు. కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు పరీక్షల కోసం కొత్త అంశాల జోలికి వెళ్లవద్దు. ఏడాది పొడవునా చదివిన పాఠ్యాంశాలనే మళ్లీ మళ్లీ చదవండి. ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్ బాగుంది. ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే మనకు వచ్చిన అంశాలనే పరీక్షల కోసం పునశ్ఛరణ చేసుకోవాల్సిన సమయం ఇది. కొత్త అంశాల కోసం ఆరాటపడితే నేర్చుకున్న అంశాలను కూడా మరిచిపోయే అవకాశం ఉంది. - ఆంజనేయులు డీఈఓ