time zones
-
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశం 1 టైమ్ జోన్లు 2
భారత్‌లో రెండు టైమ్ జోన్లను ప్రవేశపెట్టాలన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యుడు ఉదయం 4 గంటలకే ఉదయించి, సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు. ఈ నేపథ్యంలో విలువైన పగటి సమయాన్ని వాడుకోవడానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక టైమ్ జోన్ రూపొందించాలని ఢిల్లీలోని సీఎస్ఐఆర్–నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయమై పరిశోధనలు జరిపిన నిపుణులు.. అస్సాం, మేఘాలయ , నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్, మిజోరం, త్రిపురతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా భారీగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని కనుగొన్నారు. పగటి సమయంలో వ్యత్యాసం సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం రెండు గంటలు ముందుగానే జరుగుతుంది. దేశమంతా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) లేదా టైమ్ జోన్ పాటిస్తూ ఉండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుండటంతో రాత్రిపూట ఇంటికి వెళ్లిన భావన ప్రజల్లో కలుగుతోంది. రాత్రిపూట విధులు నిర్వహించేందుకు విపరీతంగా విద్యుత్ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో పగటి సమయాన్ని ముందుకు జరపగలిగితే స్థానిక ప్రజలు ఇబ్బందిపడకుండా పనులు చేసుకోగలుగుతారనీ, విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని సీఎస్ఐఆర్–ఎన్పీఎల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు కలిపి ఓ టైమ్ జోన్, మిగతా దేశమంతటికీ మరో టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30 గంటలుగా అమలవుతోంది. అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశం ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం(యూసీటీ) అర్ధరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైమ్‌గా లెక్కిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా? లేదా? ఈ విధానాన్ని అమలు చేయగలమా? అన్న విషయమై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అందులో భారత కాలమానాన్ని మరో గంట ముందుకు జరపగలిగితే ఈశాన్య భారతం, పోర్ట్బ్లెయిర్లో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తేలినట్లు ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్.కె.అస్వల్ తెలిపారు. భారత్‌లో రెండు టైమ్ జోన్లను అమలు చేయొచ్చని తాము శాస్త్రీయంగా నిరూపించామనీ, ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాలంపై కొన్ని సంగతులు ► బ్రిటిష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కోల్‌కతా టైమ్ జోన్లుగా విభజించారు. ► 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమానం(ఐఎస్టీ) ఏర్పడింది ► 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైమ్)ను పాటించాలని అసోం(అప్పటి అస్సాం) అనధికారికంగా నిర్ణయించింది. పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టారు. ► ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైమ్ జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువాహటి హైకోర్టు తోసిపుచ్చింది. ► 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ సైతం ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైమ్‌జోన్ కావాలని డిమాండ్ చేశారు. -
ఒక దేశం రెండు టైం జోన్లు...!
న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఒకే ‘టైం జోన్’ స్థానంలో రెండు టైం జోన్లు ఉంటే భారతదేశానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన లాంటి సువిశాల దేశంలో భిన్నమైన వేషభాషలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒక టైంజోన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరో టైం జోన్ ఏర్పాటు చేస్తే మంచిదని సైంటిస్ట్‌లు తమ అధ్యయనంలో వెల్లడించారు.ఈ మేరకు ఢిల్లీలోని సీఎస్ఐఆర్– నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తమ పరిశోధన ఆధారంగా ‘రెండు టైం జోన్ల ఆవశ్యకత’ శీర్షికతో రాసిన పత్రం ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితమైంది. ఈశాన్యంలో ముందే సూర్యాస్తమయాలు... భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో వెలుగుపరంగా కొన్ని గంటలు కోల్పోవాల్సి వస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమై పగటి సమయం మరింత కుచించుకుపోవడంతో ఉత్పాదకత తగ్గిపోయి, అధిక విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రెండో టైంజోన్లోని రాష్ట్రాలు, ప్రాంతాల్లోని గడియారాలను మిగతా దేశంలోని (మొదటి టైంజోన్ రాష్ట్రాలు) ప్రాంతాల కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని ఈ అధ్యయనంలో సూచించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పనివేళలు ముందుగా ప్రారంభమై ముందుగా ముగుస్తాయి. ఈ కారణంగా ఉత్పాదకత పెరగడంతో పాటు విద్యుత్ ఆదా కూడా చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30గా అమలవుతోంది. (అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశ గీత ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివరల్ టైం (యూసీటీ) అర్థరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైంగా లెక్కిస్తున్నారు). ఈ పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల్లో ఒక గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా లేదా, ఈ విధానాన్ని అమలుచేయొచ్చా లేదా అన్న విషయాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు. యూటీసీ కంటే అయిదున్నర గంటల స్థానంలో, ఆరున్నర గంటల టైమ్‌జోన్ పెడితే ఈశాన్యరాష్ట్రాలు, పోర్ట్‌బ్లెయిర్‌లలో ఉత్పాదకత పెరుగుతుందని తాము కనుక్కున్నామని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేష్ కె ఆస్వల్ తెలిపారు. రెండు టైం జోన్ల కారణంగా రైలు ప్రమాదాలకు ఆస్కారమేర్పడుందనే ఆందోళనను కొందరు వ్యక్తం చేయగా, పశ్చిమబెంగాల్, అస్సాం సరిహద్దులోని అలిపుర్దౌర్ స్టేషన్లో రైలు గడియారాల సమయాలు మార్చితే ఈ ప్రమాదాన్ని అధిగమించవచ్చునని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ‘మనదేశంలో రెండు టైంజోన్లు ఉండొచ్చునని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించాం. దీనిని అమలు చేయాలా వద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది’ అని అస్వల్ చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఐఎస్టీ–2ను అమలు చేసేందుకు ఎన్పీఎల్ ప్రైమరి టైమ్ స్కేల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు టైంజోన్లను అమలు చేస్తే, ఏడాదికి 20 మిలియన్ల కిలో వాట్ల విద్యుత్‌ను ఆదాచేయొచ్చునని అంచనా వేశారు. పూర్వాపరాలు... బ్రిటీష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కలకత్తా టైంజోన్లుగా విభజించారు 1947 సెప్టెంబర్ 1న భారత కాలమానం (ఐఎస్టీ)ఏర్పడింది 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైం)ను పాటించాలని అస్సాం అనధికారికంగా నిర్ణయించింది. ఐఎస్టీ కంటే పగటి సమయం ఒక గంట ముందు ఉండేలా చేసుకున్న ఏర్పాటును గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటీషర్లు ఉపయోగించారు ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైం జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువహటి హైకోర్టు తోసిపుచ్చింది. 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పేమా ఖందు ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైంజోన్ కావాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించారు -
దేశంలో రెండు టైమ్జోన్లు!
న్యూఢిల్లీ: దేశంలో రెండు వేర్వేరు టైమ్జోన్ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో తెలిపింది. బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ ఈ విషయాన్ని సభలో లేవనెత్తుతూ దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉందన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 4 గంటలకు సూర్యోదయమైతే కార్యాలయాలు 10 గంటలకు తెరుచుకుంటున్నాయి. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ దీనిపై గతంలో అధ్యయనం కూడా జరిపింది’ అని వెల్లడించారు. దేశంలో రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనివేళలపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం–పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుందని తెలిపారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ స్పందిస్తూ.. మెహతబ్ సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని తెలిపారు. -
రైతులతో చెలగాటం
ఏడాదిగా నకిలీ విత్తనాల తయారీ రైతుల నుంచి కొన్న విత్తనాలకే రంగుపూసి తిరిగి విక్రయం నకిలీ పత్తి విత్తనాలతో భారీ స్థాయిలో రైతులకు నష్టం బి.కొత్తకోటలో అనుమానంరాని చోట అద్దె ఇల్లు రెండు కేసుల నమోదు బి.కొత్తకోట: నకిలీ విత్తనాలు తయారుచేస్తూ రైతుల జీవితాల్లో చెలగాటమాడాడు. ఏడాదికాలంగా గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రం లోని ఐదు జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తివిత్తనాలను విక్రయించాడు.. కర్ణాటకకు చెందిన ఓ కంపెనీ పేరుతో విక్రయాలు చేస్తూ పత్తిరైతులను నట్టేట ముంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా బి.కొత్తకోటలో మకాం వేసి విత్తనాల తయారు చేస్తున్నాడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి. సోమవారం రాత్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా మండల కేంద్రం వైరాకు చెందిన ఎస్.లక్ష్మణాచారి(30) గతంలో ఆదర్శ సీడ్స్‌లో పనిచేస్తుండేవాడు. కంపెనీ నుంచి ఇతన్ని తొలగించడంతో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. పడమటి ప్రాంతమైన బి.కొత్తకోటను కేంద్రంగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించి, స్థానిక శెట్టిపల్లె రోడ్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలోని ఓ పూలవ్యాపారికి చెందిన భవనంలో గదిని అద్దెకు తీసుకొన్నాడు. ఇందులో ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం బయటకు పొక్కదు. దీంతో ఇంతకాలం ఈ నకిలీ వ్యవహారం గుర్తించే వీలులేకుండా పోయిందని భావిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల తయారీ కోసం మొదట పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పత్తి విత్తనాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచుతాడు. ఈ విత్తనాలకు రంగుపూసి కర్ణాటకలోని గల్బర్గాకు చెందిన అజిత్ పత్తివిత్తనాల కంపెనీపేరుతో ప్యాకెట్లు, లోగోను బెంగళూరులో తయారుచేయిస్తాడు. ఈ విషయం దాడులు చేసిన విజిలెన్స అధికారులు పేర్కొన్నారు. వీటిలో అరకిలో నకిలీ పత్తి విత్తనాలను నింపి రూ.930 చొప్పున విక్రయిస్తున్నట్టు వారు గుర్తించారు. అజిత్ పత్తి విత్తనాల కంపెనీ పేరు, అదే రకమైన ప్యాకింగ్ ఉండడంతో రైతులు నకిలీ విత్తనాలు గుర్తించే వీలులేకుండా పోతోంది. వీటిని కొనుగోలుచేసి పంటసాగుచేసిన పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు వీటిని సరఫరా చేసివుంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణ జిల్లాలు, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో లక్ష్మణాచారికి పరిచయాలున్న వారితో రైతులకు విక్రయాలు చేసివుంటారని చెబుతున్నారు. గతంలో పనిచేసిన కంపెనీలోని ఉద్యోగులతో పరిచయాలుంటాయని వారి సహకారం తీసుకొని ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. గదిలో 291 అరకేజీల ప్యాకెట్లు, మరో 291 చిన్నప్యాకెట్లను సాధ్వీనం చేసుకొన్నారు. అలాగే 336 కిలోల పత్తి విత్తనాలు, రంగు సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని విజిలెన్స్ సీఐలు సూర్యనారాయణ, శ్యామ్‌సుందర్ చెప్పారు. ఈ వ్యవహారంపై బి.కొత్తకోట వ్యవసాయాధికారి జీఎన్.నాగప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. లక్ష్మణాచారిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. ఇతనిపై రెండు కేసులు నమోదవుతాయని విజిలెన్స్ సీఐ యూ.సూర్యనారాయణ చెప్పారు.