tiruchanuru bramhostavalu
-
అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు
-
స్వర్ణరథంపై సర్వతేజోమయి
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం రాత్రి శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు గరుత్మంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకరణలో తిరువీధుల్లో భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం 12గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారికి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4.10గంటలకు స్వర్ణరథంపై సర్వతేజోమయి అయిన అమ్మవారు కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7గంటలకు ఆస్థానమండపంలో అమ్మవారికి ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహనమండపానికిు తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య మణిమాణిక్యాలు, శ్రీవారి పాదాలు, శ్రీవారి సహస్రలక్ష్మీ కాసుల హారంతో అమ్మవారిని దివ్యాలంకారశోభితంగా అలంకరించారు. రాత్రి 8.30గంటలకు భక్తుల కోలాటాలు, సంప్రదాయ భజన బృందాలు, జీయర్ స్వాముల దివ్యప్రభంద పారాయణం, వేదగోష్టి నడుమ శ్రీవారి పాదాలతో అమ్మవారు గరుత్మంతునిపై ఆశీనులై తిరువీధులలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గరుడసేవలో అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. -
కల్పవృక్షంపై కల్పవల్లి
తిరుచానూరు : తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం ఉదయం కల్పవల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో కుడి చేతిలో చర్ణాకోలు, ఎడమ చేతిలో రాజదండం, నడుములో వేణువు, బుర్రను ధరించి గోవులను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు. అనంతరం 8గంటలకు జీయర్ల దివ్య ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యం, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామస్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారు హనుమంతుని వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు.