Tirumal Darshan
-
తిరుమల శ్రీవారి సేవలో నటి సోనియా సింగ్ (ఫొటోలు)
-
వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు సిఫారసు లేఖలు పంపద్దు: వైవీ సుబ్బారెడ్డి
-
శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే సహజ వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అభివృద్ధికి స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏపీని నెం.వన్ రాష్ట్రంగా తీర్చిద్దాడానికి అనేక రంగాలు ఉన్నాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా, ఉత్తరాంధ్రలో అద్భుతమైన భూసంపద, మధ్యాంద్రలో నీటి వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతటి మంచి వనరులు కలిగిన ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి పాలకులు ముందుకు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, పరిపాలకులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్వామివారిని ప్రార్ధించినట్లు సోము వీర్రాజు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
-
స్థానికులకు తిరుమలేశుని ప్రత్యేక దర్శనం
తిరుపతి : స్థానికులకు శుభవార్త. ఇకపై నెలలో ఓ మంగళవారం తిరుమల, తిరుపతి, తిరుచానూరు వాసులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. దీన్ని ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనంలో తమకూ ప్రత్యేక కోటా కల్పించాలని మూడు దశాబ్దాలుగా స్థానికులు కోరుతున్న విషయం తెలిసిందే. దీనికి ఆరు నెలల క్రితం టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. నెలలో ఒకసారి అయిదువేల మందికి ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా తొలుత తిరుమల, తిరుపతి, తిరుచానూరు వాసులకు ప్రయోగాత్మకంగా టికెట్లు కేటాయించి పరిశీలించనున్నారు. 4వ తేదీ మొదటి దశలో వెయ్యిమంది స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం 2వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర, కంప్యూటర్ ఫోటో సేకరించి టికెట్లు ఇస్తారు. స్థానికులు తమ ఆధార్ గుర్తింపు కార్డును కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన స్థానికులకు రూ.300 టికెట్ల భక్తుల క్యూలో దర్శనానికి అనుమతిస్తారు. దీనిపై టీటీడీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాక ఈ సంఖ్యను అయిదువేలకు పెంచనుంది. -
ప్రత్యేక ప్రతిభావంతులకు శ్రీవారి దర్శనం
అంధులు, మూగ, చెవిటి, మానసిక వికలాంగులు 1,153 మంది గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. చెన్నైకి చెందిన మూడు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక ప్రతిభావంతులను తిరుమల కొండకు తీసుకొచ్చి వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వీరు మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లేలా టీటీడీ అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. దర్శన సమయంలో వీరు ‘పెరుమాళ్ సామీ.. ఏలుమలై ఎంగటేశా..!’ అంటూ గోవింద నామాలు పలికారు. మాటలు రానివారు సైతం స్వామిని దర్శించుకుని చేతితో ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఆనంద పరవశులయ్యారు. కంటి చూపులేని వారు సైతం ‘మేమంతా మనసుతో స్వామిని దర్శించాం’ అంటూ తన్మయత్వాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులుగా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండడంతో లఘు దర్శనం అమలుచేశారు. గురువారం అనూహ్యంగా భక్తులు పెరిగారు. రెండు నడకదారుల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.