tirupati parliament
-
వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డిని అనంతపురం, హిందూపురం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదనంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ డిప్యూటీ రీజినల్ కో–ఆర్డినేటర్‌గా టీజేఆర్ సుధాకర్ బాబును నియమించినట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
ఈ విజయం.. విశ్వసనీయతకు చిహ్నం
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంతకు తగ్గించగలిగితే, ప్రజలలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని వారనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. మతపరంగా రాజకీయాలు చేయడానికి, అసందర్భ ఆరోపణలు చేయడానికి టీడీపీ పూనుకున్నా.. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ శ్రేయస్సుకోసం పనిచేస్తున్న పార్టీపై, దాని అధినేతపై ఏపీ ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి ఈ విజయం తిరుగులేని సంకేతం. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందా? లేదా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాను ఓడిపోయినా, వైసీపీకి ఐదు లక్షల మెజార్టీ రాలేదని సంతోషపడుతున్నట్లుగా ఉంది. సీఎం జగన్ రెండేళ్ల పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా కూడా ఈ ఉపఎన్నిక ఫలితాన్ని తీసుకోవచ్చు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎప్పుడూ ఐదు లక్షల మెజార్టీతో ఎవరూ గెలవలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థ్దిగా పోటీచేసిన ఒక సాధారణ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి గతంలో తిరుపతిలో ఎన్నడూ లేనంత మెజార్టీతో విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఈ ఉపఎన్నికతో సహా మొత్తం పదిహేడుసార్లు ఎన్నికలు జరిగితే ఈసారే అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఉంది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు 2.28 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. అంతకుముందు జరిగిన ఎన్నికల కన్నా అదే అత్యధికం. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో అంతకన్నా ఎక్కువగా 2.70 లక్షల ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్ సీపీ గెలిచింది. అంటే సగటున ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై వేల ఓట్ల ఆధిక్యత వచ్చిందన్నమాట. అంతేకాదు. ఓట్ల శాతాలను పరిగణనలోకి తీసుకున్నా గతంలో వైఎస్సార్ సీపీకి ఏభై శాతం లోపు మెజార్టీ రాగా, ఈసారి ఏభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఆరు శాతం పెరిగాయన్నమాట. మరి అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ గత లోక్‌సభ ఎన్నికలలో 37 శాతం ఓట్లు సాధించగా, ఈ ఉపఎన్నికలో 32 శాతం ఓట్లనే తెచ్చుకుంది. నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ గెలిచినా మెజార్టీతో పాటు ఓట్లశాతం తగ్గుతుంది. అలాగే ప్రతిపక్షం గట్టి పోటీఇస్తే దాని ఓట్ల శాతం పెరుగుతుంది. కాని ఇక్కడ రివర్స్‌లో జరిగింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా కవర్ చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతలు చెప్పినంతగా మెజార్టీ రాలేదని సంతోషపడవచ్చు. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం లేదు.కాకపోతే తన వర్గం మీడియాలో టీడీపీ ఓటమి గురించి కాకుండా వైఎస్సార్ సీపీ మెజార్టీ గురించి మాట్లాడుకునేలా చేయాలన్న ఎత్తుగడలు కావచ్చు. 1991లో కర్నూలు లోక్‌సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డికి 54 వేల పైచిలుకు ఓట్లు వస్తే, ఆయన ఉమ్మడి ఏపీ సీఎం అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1993లో ఆ స్థానంలోనే పోటీ చేసిన కోట్ల తనయుడు సూర్యప్రకాశ్ రెడ్డి కేవలం 20 వేల లోపు మెజార్టీతో గెలిచారు. నాటి అధికార పార్టీపై వ్యతిరేకతకు అది గుర్తు. కానీ తిరుపతి లోక్‌సభ స్థానానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో కన్నా ఇప్పుడు ఏభైవేలకు పైగా ఓట్ల మెజార్టీ పెరిగింది. కాగా తిరుపతిలో ఆరుసార్లు గెలిచి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన చింతా మోహన్‌కు ఈ ఉప ఎన్నికలో పదివేల ఓట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా వచ్చాయి. ఇక బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థ్ధిగా వచ్చిన కర్ణాటక మాజీ ఛీ‹ఫ్ సెక్రటరీ రత్నప్రభ సుమారు అరవై వేల ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. నిజానికి ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి చెందినవారు కానీ, ఆయన అభిమానులు కానీ గణనీయంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ రీత్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఆయన మనసు మాత్రం చంద్రబాబు వైపే ఉందన్నది ఎక్కువ మంది భావన. దానికి తగ్గట్లుగానే జనసేన అభిమానులు కొంత శాతం మంది టీడీపీకి వేసి ఉండవచ్చు. అందువల్లే టీడీపీకి ఆ మాత్రం ఓట్లు అయినా వచ్చాయని మరో విశ్లేషణ కూడా లేకపోలేదు. చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసిన రత్నప్రభను బీజేపీ పక్షాన రంగంలో దించి ఆమెను కూడా రాజకీయంగా బలిచేసినట్లయింది. సునీల్ దేవ్‌ధర్ వంటివారు మతపరంగా వైషమ్యాలు పెంచేందుకు ఇక్కడ ప్రయత్నం చేసినా ప్రజలు తగురీతిలో జవాబు ఇచ్చారు. ఏíపీలో వ్యూహాత్మకంగా బీజేపీ ఇంకా పరిణితి చెందలేదని ఈ ఉప ఎన్నిక స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ గురించి పరిశీలిస్తే గతంలో కన్నా తక్కువ శాతం ఓట్లు రావడం ఆ పార్టీ ఇంకా కష్టాల నుంచి బయటపడలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మొదటి నుంచి అనాసక్తిగానే ఉన్నారు. అయినా టీడీపీ ఒత్తిడితో మళ్లీ రంగంలో దిగారు. ఆమెకు ఈ సీటులో గెలవడం అసాధ్యమన్న సంగతి తెలియకకాదు. కానీ ఎన్నికల వ్యయం అంతా పార్టీ నాయకత్వం పెట్టుకునే కండిషన్‌తో పోటీకి ఒప్పుకున్నారని అంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు కూడా వైఎస్సార్ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంత, ముఖ్యంగా 2019 నాటి మెజార్టీ కన్నా తగ్గించగలిగితే, ప్రజ లలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. టీడీపీ కూడా మతపరంగా రాజకీయాలు చేయడానికి, పలురకాల పిచ్చి ఆరోపణలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడలేదు. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. అయినా టీడీపీ తన వైఖరి మార్చుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడానికి సిద్ధపడుతున్నట్లుగా లేదు. కేవలం ఒక విధ్వంసకర పాత్ర పోషిస్తూ, మీడియాపరంగా మాత్రం ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతోంది. టీడీపీ ధోరణి ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికలలో వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడం కష్టమేనని చెప్పవచ్చు. నాయకత్వ స్థాయిలో టీడీపీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ముందుగా దాని నుంచి అది బయటపడవలసి ఉంది. ఉప ఎన్నికలలో ఓట్ల కొనుగోలు, మద్యం పంపిణీ వంటివి చేయరాదని పార్టీ నేతలకు జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి తోడు కరోనా సమస్య ప్రజలను భయపెట్టింది. ఈ కారణాల వల్ల ఉప ఎన్నికలో పోల్ అయిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. కానీ గతంలోకంటే ఈసారి అధిక మెజార్టీ సాధించడం ఆ పార్టీకి సంతోషం కలిగించే అంశమే. అంతేకాక జగన్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార సభ నిర్వహించాలని అనుకున్నా, కరోనా పరిస్థితిలో తాను సభ పెడితే, పెద్ద సంఖ్యలో జనం వస్తే, కరోనా కేసులు పెరగవచ్చని ఆయన భావించి సభను రద్దు చేసుకున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఏతావాతా ఏభై ఆరు శాతం ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ గెలవడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడం, వలంటీర్ల వ్యవస్థ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పరిపాలనను అందించడం, వృద్ధాప్య పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వడం, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీములు పేదలకు బాగా ఉపయోగపడటం, కరోనా సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో లాక్డౌన్లతో ప్రజల ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు జగన్ చేసిన ఆర్థ్దిక సాయం పేదలకు కొండంత భరోసా ఇచ్చింది. ఇలాంటి పలు కారణాల వల్ల జగన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం వైఎస్ జగన్‌పై ఉన్నవి, లేనివి అసత్య ప్రచారం చేసినా ఆయనను జనం నమ్మడం లేదని కూడా రుజువు అయింది. ఏది ఏమైనా తనకు వచ్చిన మెజార్టీతో సంతృప్తి చెందక వైíసీపీ మరింత గట్టిగా పనిచేయవలసి ఉండగా, టీడీపీ ఇంతవరకు కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకోడానికి తంటాలు పడాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు విశ్వసనీయత కన్నా, వేరే అంశాలకే ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ఆయనను జనం నమ్మరు. అదే సమయంలో జగన్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడడం ఆయనకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నిన్ను నమ్మం బాబూ..
సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఎత్తులు పారలేదు. రాళ్ల రాజకీయం చేసినా.. ధర్నాలు చేసినా.. దొంగ ఓట్లంటూ డ్రామాలు వేసినా.. ఓటర్లు నమ్మలేదు. ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ స్పష్టంగా తీర్పు చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి 37.65 శాతం ఓట్లు పడ్డాయి. అదే స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి 32.08 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు రెండేళ్లలో టీడీపీ ఓటు బ్యాంకు 5.57% పడిపోయింది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఏడాదిగా కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోని చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం తనతోపాటు టీడీపీ శ్రేణులను రంగంలోకి దించారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన తనయుడు లోకేశ్‌తోపాటు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు వీధివీధికి తిరిగినా ప్రజల ఆదరణ దక్కలేదు. వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆడని డ్రామాలేదు. కోడ్ అమలులో ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన చిత్తూరులో 5 వేలమందితో ధర్నా, నిరసనకు వెళ్లి రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్ నిబంధనలు, తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చంద్రబాబు ఆందోళన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి కూర్చుని తిరుపతి ప్రజల సానుభూతి కోసం ఆడిన హైడ్రామా ఆయనకు రాజకీయ మైలేజీ తేలేకపోయింది. చివరకు బహిరంగసభలో చిన్న రాయిని పట్టుకుని.. తమపై రాళ్లు వేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ‘రాయి’ రాజకీయం రక్తికట్టలేదు. తనపై రాళ్లు విసిరి హత్యాయత్నం చేశారంటూ తిరుపతి ప్రజలను నమ్మించి సానుభూతి ఓట్లు పెంచుకోవాలన్న బాబు ఎత్తుగడ పారలేదు. అక్కడే నేలపై కూర్చుని ధర్నా చేసి దాన్ని లబ్ధిపొందాలన్న కుతంత్రం నెరవేరలేదు. చివరకు ఓట్ల వేటలో రాజకీయ మౌలిక సూత్రాలను సైతం పక్కన పెట్టి ‘వకీల్‌సాబ్’ పేరుతో సినిమా ట్రిక్కులకు తెరలేపారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత అయిన పవన్‌ను భుజానికెత్తుకున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో ఆ సామాజికవర్గ ఓట్లకు గాలం వేశారు. పవన్ నటించిన వకీల్‌సాబ్ సినిమాకు రేట్లు పెంచుకునేందుకు, ఎక్కువ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు.. పవన్ అనుకూల ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. అయినా బాబు వేసిన సినిమా ట్రిక్కులు తిరుపతి ప్రజల ముందు పారలేదు. చివరకు పోలింగ్ రోజున అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు పార్టీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. స్వేచ్ఛగా వచ్చి ఓటేసే ప్రజలను దొంగ ఓట్ల పేరుతో బెదరగొట్టి వైఎస్సార్సీపీకి వచ్చే మెజారీటిని తగ్గించేందుకు చంద్రబాబు హైడ్రామా నడిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి వచ్చే అనేకమంది బయటి భక్తులను సైతం దొంగ ఓటర్లుగా చూపించి మభ్యపెట్టేందుకు చంద్రబాబు అండ్ కో చేసిన హడావుడికి తిరుపతి ప్రజలు గట్టి బదులిచ్చారు. చంద్రబాబు చీప్ ట్రిక్కులను నమ్మని తిరుపతి ఓటర్లు ఛీత్కరించడమే కాకుండా ఘోర పరాజయంతో గట్టి బదులిచ్చినట్టు అయింది. -
Tirupati Election Results 2021: ‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: వరుసగా మూడుసార్లు నెగ్గి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ సాధించింది. 2014 నుంచి తాజా ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినా భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. అప్పుడు 13,16,473 (79.76 శాతం) ఓట్లు పోల్ కాగా తాజా ఉప ఎన్నికలో 11,04,927 (64.42 శాతం) పోలయ్యాయి. అంటే ఈసారి 2,11,546 (15.34 శాతం తక్కువ) ఓట్లు తక్కువగా పోలయ్యాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 55.03 శాతం ఓట్లతో 2,28,376 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు డాక్టర్ ఎం.గురుమూర్తి 56.67 శాతం ఓట్లతో 2,71,592 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీ మెజార్టీ శాతం 15.38 అయితే ఇప్పుడు మెజార్టీ శాతం 24.59 కావడం గమనార్హం. అంటే 23 నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ 9.21 శాతం పెరిగింది. టీడీపీ దీనావస్థ.. రెండు దఫాలు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో 4,94,501 ఓట్లు సాధించగా ఈసారి ఆమెకు 3,54,516 ఓట్లు మాత్రమే దక్కాయి. 2019లో టీడీపీకి 37.65 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 32.08 శాతం మాత్రమే వచ్చాయి. అంటే 5.57 శాతం ఓట్లు తగ్గాయి. అది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డితే ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ 20,971 (1.60 శాతం) ఓట్లు సాధిస్తే అప్పుడు బీజేపీకి 16,125 (1.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే 37,096 ఓట్లు (2.82 శాతం) వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 57,080 ఓట్లు (5.17 శాతం) సాధించింది. ఇదే అత్యధికం తిరుపతిలో 1989 సాధారణ ఎన్నికల దగ్గర్నుంచి పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి గురుమూర్తి సాధించిన మెజారిటీనే అత్యధికమని స్పష్టమవుతోంది. -
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు నామినేషన్ వేయనున్న గురుమూర్తి
-
తిరుపతిలో బీజేపీకి అంత సీన్ లేదు..!
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అంతకుముందు పీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది. -
బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయాలు
స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయాలు వెలువడుతున్నాయి. యాత్రల పేరుతో రచ్చ రాజకీయానికి తెరతీస్తున్నాయి. మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని కుయుక్తులు పన్నుతున్నాయి. అందులో భాగంగా కపిలతీర్థం టు రామతీర్థం అంటూ కమలనాథులు, ధర్మ పరిరక్షణయాత్ర అంటూ తెలుగు తమ్ముళ్లు రాగాలు ఆలపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీడీపీ, బీజేపీ నేతలు ముందస్తు దుష్ప్రచారానికి పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి కపిలతీర్థం టు రామతీర్థం యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తన హయాంలో వందల ఆలయాలను కూల్చిన విషయం వదిలేసి, పదిరోజుల ధర్మపరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో యాత్ర సాగించాలని నిర్ణయించారు.ఈ యాత్రలో పార్టీ శ్రేణులు తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత రాజకీయాలే లక్ష్యం రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు పక్కదారులు తొక్కుతున్నాయని మేధావులు విమర్శిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయాలని ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దేవాలయాలపై దాడులంటూ అవసరానికి మించి ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా మత రాజకీయాలు చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. మేమే నిజమైన పోటీ! వైఎస్సార్సీపీకి తామే నిజమైన ప్రత్యర్థి అని ప్రకటించుకునేందుకు టీడీపీ, బీజేపీ–జనసేన కూటమి తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిందుత్వాన్ని భుజానికెత్తుకుని గుడ్డిగా పరుగెడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు ఆయా పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని పరిశీలకులు వివరిస్తున్నారు. అందుకే పోటాపోటీగా రాజకీయ తీర్థయాత్రలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడిస్తున్నారు. -
ప్రాపకం కోసం బీజేపీ, జనసేన మధ్య అంతర్యుద్ధం
సాక్షి, తిరుపతి: జనసేన పేరుకు సొంత పార్టీ అయినా అధినేత పవన్‌కల్యాణ్ ఒంటరిగా పోటీచేసే ధైర్యం చేయలేక కమలనాథుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వ్యూహత్మంగా అడుగులు వేస్తోంది. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన పవన్ మాటమార్చారు. జనసేన ప్రకటనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ బరిలో నుంచి పవన్ తప్పించారు. వెంటనే బీజేపీ అభ్యర్థులకు పవన్ మద్దతును సైతం ప్రకటించారు. ఈ పరిణామం జన సైనికుల్లో ఆగ్రహం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది. మరో వైపు గత ఎన్నికల్లో తిరుపతిలో నోటాకు పడ్డ ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. అయినా కమలనాథులు తమ బలం ఏమిటో తెలిసినా, ఎంపీ స్థానం ఉప ఎన్నికల్లో జనసేన ద్వారా వచ్చే చిల్లర ఓట్ల కోసం పాకులాడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో పవన్ ఎదురుచూపులు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన నేతల ఆశలపై పవన్ నీళ్లు చల్లారని సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మంగళవారం తిరుపతిలో జనసేన నాయకులకు షాక్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని ప్రకటించారు. మరోవైపు తమ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయాలని బీజేపీ పట్టుపడుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో తిష్టవేసి బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: నాకెందుకీ తలనొప్పి.. ఏ మొహంతో ఓట్లడగాలి!) ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతోపాటు మరికొంత మంది కీలక నేతలను కలిసి తిరుపతి సీటు జనసేనకు కేటాయించమని కోరేందుకు ఆయన వేచి ఉన్నారు. అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తన ప్రచారం చేసే అంశంపైనా స్పష్టత తీసుకునేందుకు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటును తమకు కేటాయించాలని పవన్ షరతు పెట్టే అవకాశం కూడా ఉంది. జన సైనికులకు అమరావతి తలనొప్పులు దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతి సీటును వదులుకునే పరిస్థితుల్లో కమలనాథులు లేరు. అదే విధంగా జనసైనికులపై కమలనాథులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ అమరావతిలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపై జనసేన నాయకులు ప్రస్తావించారు. తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థే ఉండేలా పట్టుపట్టాలని జన సైనికులు పవన్‌పై ఒత్తిడి తెచ్చారు. (చదవండి: తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) ఇక్కడ బీజేపీ నాయకుల ప్రభావం లేదని, వారు కేవలం పేపరు పులులే తప్ప పోటీచేసే ధైర్యం లేని వారని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై బీజేపీ శ్రేణులు జనసేన నాయకుల తీరుపై లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తిరుపతి సీటు కేటాయిస్తే నిండా మునిగిపోతామని ఇరు పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం. -
నాకెందుకీ తలనొప్పి.. ఏ మొహంతో ఓట్లడగాలి!
‘ఎందుకు నాకు ఈ తలనొప్పి. క్షేత్రస్థాయిలో పార్టీకి గడ్డు పరిస్థితులున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని చెప్పాపెట్టకుండా ప్రకటించారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకుంటే ఇదొక భారాన్ని నెత్తినపెట్టారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేలో అర్థం కావడం లేదు. ఆయన (చంద్రబాబు) తీరు ఏం బాగోలేదు.. నా డిమాండ్లు పరిష్కరిస్తేనే తిరుపతి ఎంపీగా పోటీ చేస్తా’నన్నట్టు ఉంది ఆ పార్టీ అభ్యర్థి పనబాకలక్ష్మి మనోగతం. అభ్యర్థిత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే ఆమె తమ పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, తిరుపతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని మాత్రం అందరికంటే ముందే ప్రకటించింది. ఉప ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పనబాకలక్ష్మిని ముందే ప్రకటించడానికి కారణం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ మంత్రి పనబాకలక్ష్మి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు నెరిపి తేదీ కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. షాక్ ఇచ్చిన చంద్రబాబు పనబాకలక్ష్మి బీజేపీలో చేరుతుందని తెలుసుకున్న చంద్రబాబు ఆమెను సంప్రదించకుండా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు తీరుతో ఆమె షాక్‌కు గురైనట్లు సమాచారం. టీడీపీ అధినేతపై తీవ్ర అంసతృప్తితో మౌనంగా.. కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అభ్యర్థిత్వం ప్రకటించినా ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. తనను సంప్రదించకుండా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారని, టీడీపీ అభ్యర్థిత్వం నుంచి తప్పుకునే అవకాశందని ఉందని టీడీపీ అధిష్టానానికి సమాచారం అందింది. వెంటనే చంద్రబాబు సోమిరెడ్డిని రంగంలోకి దింపారు. అందులో భాగంగా ఆయన పనబాకలక్ష్మితో భేటీ అయ్యారు. అయితే ఆమె కొన్ని డిమాండ్లు టీడీపీ అధిష్టానం ముందుంచింది. వాటిని ఆమోదించాలా? వద్దా? అనే సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) బీజేపీతో లోపాయికారి ఒప్పందమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ముందు నొయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. వైఎస్సార్సీపీ ధాటికి తట్టుకోలేక బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పనబాకలక్ష్మి డిమాండ్లను ఆమోదించినట్లే ఆమోదించి.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అటు బీజేపీ, ఇటు టీడీపీకి సన్నిహితంగా ఉండే మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పట్ల మొగ్గుచూపుతున్నట్లు కమలం శిబిరం నుంచి అందిన సమాచారం. ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు కూడా ఆయనకే మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు టీడీపీ క్యాంప్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా పనబాకలక్ష్మికి చంద్రబాబు మరో సారి షాక్ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. -
తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు
సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అసంతృప్తి నేతలకు గాలం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యంత సన్నిహితుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి ద్వారా బేరసారాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకోసమే విష్ణు తిరుపతిలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అకస్మిక మరణంతో పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. బీజేపీ, టీడీపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏకగ్రీవం కావాల్సిన లోక్‌సభ సీ టును ఉపఎన్నికల వరకు తీసుకువెళ్లడానికే సిద్ధమయ్యారు. దుబ్బాక వాపును చూసి, బలుపనుకుని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. (శ్రీకాళహస్తిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జనసేన) గత ఏడాదిన్న కాలంగా సీనియర్ టీడీపీ నేతలు పలువురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి నచ్చక కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీకి రాజీనామా చేసినా తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడ్డారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి జాబితా దగ్గర పెట్టుకుని బీజేపీ నేతలు సదరు అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్ధానికంగా కమలం పార్టీలోని నేతలతో టీడీపీ అసమ్మతి నేతలతో ముందుగా మాట్లాడించి, తర్వాత విష్ణు రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. అందులో భాగంగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని తిరుపతికి పిలిపించుకుని మంతనాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దుబ్బాక గెలుపుతో ఏపీ నాయకత్వంపై ఒత్తిడి తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా గెలవడంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల విషయమై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. నిజానికి దుబ్బాకలో గెలిచేంత సీన్ కమలానికి లేదు. అయితే టీఆర్ఎస్ను వ్యతిరేకించే అనేక అంశాలు కలసి రావడంతో బీజేపీ నేతలంతా దుబ్బాకలో తిష్ట వేసి, గెలుపు కోసం రేయింబవళ్లు కష్టపడడంతో విజయం సాధ్యమైందనేది వాస్తవం. కాగా దుబ్బాకకు తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ అంతే దూరంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమలనాథులు మాత్రం విజయం తమదే అంటూ రెచ్చిపోతున్నారు. (రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు) డిపాజిట్ కోల్పోయిన కమలం గత ఎన్నికల్లో విజయం సాధించిన బల్లికి 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కమలం అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది జరగబోయే ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని వీర్రాజు లాంటి వారు చెబుతుంటే... జనం నవ్వుకుంటున్నారు. అయితే కమలదళం హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. గెలుస్తారో లేదో తెలియదు కానీ టీడీపీ అసమ్మతి నేతలతో పాటు రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులను కూడా తమ వైపునకు మొగ్గేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా జనసేన కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
అవకాశమిస్తే అభివృద్ధిచేసి చూపిస్తా
ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని పుట్టినగడ్డకు మేలుచేయడమే లక్ష్యం ఉద్యోగాలు, ఇళ్లపేరుతో మోసం చేయడం తెలియదు తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌రావు తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని, ఎన్నికల్లో గెలిపించి ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రరుువేటు హోటల్లో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 33సంవత్సరాలుగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశానని, 1983 నుంచి 2009వరకు కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నానని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజల కష్టాలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసుకున్నానన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని దాదాపు ఎనిమిది వందల గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. వెంకటగిరి ప్రాంతంలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభివృద్ధికి నోచుకోకుండా అనేక కాలనీలు దుర్భరస్థితిలో ఉన్నాయని చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే వాటి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకరరెడ్డి, ఎంపీగా తనను గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తిరుపతిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లున్నా పట్టాలు లేని వారికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. పుట్టినగడ్డకు మేలు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని, ప్రజాసేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చింతామోహన్‌లాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలందరికీ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓట్లు కోసం మోసం చేయడం తనకు తెలియదని వరప్రసాద్ అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 30ఏళ్లుగా నమ్మి ఓట్లు వేసినందుకు చింతామోహన్ వారికి ఆవగింజంత అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ఎంతసేపూ అంతర్జాతీయ విమానాశ్రయం, వరల్డ్‌క్లాస్ రైల్వే స్టేషన్, మూడు వందల పడకల ఆస్పత్రి, నేషనల్ క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేస్తానని ప్రజలను మోసంచేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఎంపీ అరుుతే ఎంత అభివృద్ధి చేయగలమనే విషయాన్ని ప్రజలకు తాను చేసి చూపిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి టీడీపీతో పాటు పూర్తి సహకారం అందించిన బీజేపీకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్రె డ్డి అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఇల్లు లేనివారికి సొంత ఇల్లు, నిరుద్యోగ యువతకు వడ్డీలేని రుణాలు, పొదుపు సంఘాల్లో మహిళా రుణాల మాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐదు సంతకాలు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మన్నెం చంద్రశేఖర్ నాయుడు, టీ జనార్ధన్ పాల్గొన్నారు.