tiruvannamalai temple
-
సలసల కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి నైవేద్యం
సాక్షి, చెన్నై(వేలూరు): తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె.అగరం గ్రామంలో అయ్యారమ్మన్ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఆఖరి రోజైన మంగళవారం సాయంత్రం అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: (మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి) -
లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ
-
లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ
వేలూరు (తమిళనాడు): కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కోరుతూ ఓ భక్తురాలు భగవంతుడిని వినూత్న రీతిలో వేడుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మాధవి తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు. చదవండి: నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ! -
కొండపై జారిపడ్డ హైదరాబాద్ యువకుడు
తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ మహాకొండపై హైదరాబాద్‌కు చెందిన యువకుడు కాలుజారి పడిపోయాడు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వరరావు కుమారుడు తరుణ్ (24) 8వ తేదీన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాడు. కందాశ్రమం దారిలో మహాకొండగా భావించే 2,666 అడుగుల ఎత్తుగల కొండపైకి ఎక్కాడు. అన్నామలై ప్రాంతంలో ప్రమాదవశాత్తూ కాలుజారి పల్లంలో పడిపోయాడు. ప్రమాదంలో తరుణ్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ నుంచి రాలేక.. 2 రాత్రులు, పగలు పూర్తిగా అక్కడే ఉండిపోయాడు. అనంతరం కాలు కొంత సహకరించడం, సెల్‌ఫోన్ సిగ్నల్ అందడంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కుటుంబీకులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్ పోలీసులు మంగళవారం సమాచారం అందజేశారు. 20 మంది పోలీసులు తరుణ్‌ను గాలించి మంగళవారం సాయంత్రం బయటకు తీసుకొచ్చారు. -
తిరువణ్ణామలైలో వైభవంగా రథోత్సవం