the title
-
అతడు ఏలూరెళ్లాలి....
కథల నామకరణం - 3 సినిమాల్లో కూడా షావుకారు, మిస్సమ్మ పేర్లకే అలవాటు పడ్డారుగాని ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. చాలాసార్లు- బుద్ధి ఊరికే ఉండదు కదా- కొన్ని టైటిల్స్ ఫ్యాన్సీగా తడతాయి. వాటికి కథ రాయాలనిపిస్తుంది. ఆ రంధిలో దిగకపోవడమే మంచిది. ఇంటర్లో కథలు మొదలెట్టాక ‘సెంటర్లో శిలావిగ్రహం’ అనే టైటిల్ మీద కథ రాయాలని గట్టిగా అనుకున్నాను. అంటే ఏంటో తెలీదు. కనుక ఎప్పటికీ రాయలేదు. దావత్, జమీన్ కథలు రాశాక - మ్యూజిక్ అంటే కొంత ఆసక్తి గనక, మద్రాసులో రికార్డింగ్స్ అవీ చూసి ఉన్నాను గనక ‘కోరస్’ అనే టైటిల్ మీద కథ రాయాలని మనసు పీకింది. ‘కోరస్’ అనేది కచ్చితంగా కథకు పనికొచ్చే పేరే. కాని అందుకు తగ్గ కథేమీ నా లోపల లేకపోవడంతో రాయలేదు. ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’కు ముందు దర్శకుడు వంశీని కలుస్తూ ఉన్నప్పుడు దీని గురించి చెప్తే ఆయనకు సంగీతం చాలా ఇష్టం కనుక నేను రాస్తాను అని ఎంతో ఉత్సాహంగా ‘కోరస్’ పేరుతో కథ రాశారు. కాని చూపించకుండానే చింపేశారు. అంటే దానికి తగ్గ సమాచారం, అంత తీవ్రంగా స్పందించాల్సిన నిజాయితీ, అందుకు అవసరమైన సంకల్పం లేవని ఆయనకే అర్థమయ్యింది. కథ బాగ రాలేదు. కనుక కొన్ని పేర్లు పుట్టి గిట్టడమే మంచిది. ముందు నుంచీ మనకు కావ్యాలకుగానీ, కథలకుగానీ, సినిమాలకుగానీ ఒకటి రెండు పదాల్లో తేలే పేర్లే తప్ప పొడవు పేర్లు మరీ కవితాత్మకంగా ఉండే దీర్ఘమైన పేర్లు పెట్టే ఆనవాయితీ లేదు. ‘త్వమేవాహం’, ‘మహా ప్రస్థానం’, ‘ఋతు సంహారం’, ‘శేషజ్యోత్స్న’, ‘కృష్ణపక్షము’... ఇవే అలవాటు చేశారు. ‘అమృతం కురిసిన రాత్రి’ తక్కువ. కనుక నవ్యత కోసం ప్రయత్నించిన (అలా ప్రయత్నించడం మంచిదే అయినా) చాలా కవిత్వం పుస్తకాల పేర్లు మనకు గుర్తుండకుండా పోయాయి. ‘ఆమె స్పర్శ సోకినంత మేరా’.... అని ఒక కవితా సంపుటికి పేరు పెడితే ఒక క్షణం బాగుందే అనిపించవచ్చు కాని గుర్తు పెట్టుకోము. సులువుగా మననం చేసుకొని ఇతరులకు చెప్పలేము. ‘అలా అయితే పూలు ప్రవాసం వెళ్లాల్సిందే’ పేరు ఎంత బాగున్నా పాఠకులు ఇదొక పుస్తకానికి ఇష్టపడి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పేరు అని అనుకోరు. సినిమాల్లో కూడా ‘షావుకారు’, ‘మిస్సమ్మ’ పేర్లకే అలవాటు పడ్డారుగాని ‘ఉమా చండీ గౌరీ మహేశ్వరుల కథ’ అనగానే ఏదో మతలబు ఉందే అని గ్రహించారు. ఎన్టీఆర్ ఎంత పట్టుదలగా ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ అని పెట్టినా ఊళ్లలో అందరూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వచ్చిందట అని సులువు చేసుకున్నారు. తమిళులు అలా కాదు. ముందు నుంచీ వారు కవితాత్మక మకుటాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ‘ఒడ్డంతా చంపక పుష్పాలే’ అనేది ఒక నవల పేరు. ఇలా మనవాళ్లు పెట్టరు. ‘పసుపుపచ్చని ఎండ’, ‘బుగ్గ మీద ముద్దులాడింది’ ఇవి సినిమాల పేర్లు. ఇవి కూడా మనకు నప్పవు. కనుక మనం కథ రాసి సూటిగా ‘ఇంద్రధనస్సు’ అనే పేరు పెడితే తెలుగువాళ్లకు నచ్చుతుంది గుర్తుంచుకుంటారు తప్ప ‘ఒక ఇంద్రధనస్సు విరిసే ముందు’ అనంటే కాదనకపోయినా ఇబ్బందైతే పడతారు. కథకు పేరు ఇంటికి గడప వంటిది. పూరి గుడిసె గడప వేరు. పెంకుటిల్లు వాకిలి వేరు. రాజమహల్ సింహద్వారం వేరు. వీటిని ఒకదానికి ఒకటి పెడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో మకుటం గురి తప్పితే అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. మకుటం కుదిరి, ప్రవేశం అనాయాసంగా జరిగితే లోపల చెప్పే కథను పాఠకుడు చెవి ఒగ్గి వినే శ్రద్ధ పెరుగుతుంది. మామిడిచెట్టు (రావిశాస్త్రి), ఏలూరెళ్లాలి (చాసో), చూపున్న పాట (కెఎన్‌వై పతంజలి), వఱడు (అల్లం శేషగిరిరావు), మాడంత మబ్బు (కల్యాణసుందరి జగన్నాథ్), పొద్దుచాలని మనిషి (మధురాంతకం రాజారాం), పడవ ప్రయాణం (పాలగుమ్మి పద్మరాజు), ఊరబావి (కొలకలూరి ఇనాక్), చివరి గుడిసె (డా.కేశవరెడ్డి), తోడు (ఓల్గా), అతడు (అల్లం రాజయ్య), ఖాళీ సీసాలు (స్మైల్), మురళి ఊదే పాపడు (దాదాహయత్)... ఇలా ఎన్నో కథలు మంచి మకుటాలతో మకుటాలకు తగ్గ వస్తుబలంతో నిలబడ్డాయి. రచయితలను నిలబెట్టాయి. కనుక- ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రచయితగా పేరు రావాలంటే మనకు పేరు పెట్టడంసరిగా రావాలనే. - ఖదీర్ -
బూర్జువా కుక్క... షోకు పిల్లి... కమ్యూనిస్టు గాడిద...
బుచ్చిబాబు కథలను ప్రస్తావించేవారు తప్పకుండా ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’, ‘అరకులో కూలిన శిఖరం’... కథలను ప్రస్తావిస్తారు. ఈ రెంటినీ నేను చదవలేదు. చదవను కూడా. ‘ఎల్లోరాలో ఏకాంతసేవ’ ఏమిటి? ‘ఎల్లోరా’ కాబట్టి ‘ఏకాంత సేవా’? అదే ‘అజంతా’ అయితే ‘అందమైన ఊహా’ అనేవాడా? పాఠకునికి అలా అనిపించిన మరుక్షణం కథ హాస్యాస్పదం అయిపోతుంది. కథ నుంచి పాఠకుణ్ణి విముఖం చేసేస్తుంది. కనుక ‘ఎల్లోరా’ చాలు. ‘కూలిన శిఖరం’ చాలు. పాఠకులను ఆకర్షించడానికి ఇలాంటి గంభీరమైన టైటిల్స్ పెడుతుంటారు మనలో చాలామంది. సాదాసీదా టైటిల్స్ సరిపోవా? ‘నన్ను గురించి కథ రాయవూ’ ఎంత హాయిగా ఉంది. కుర్రకారు ఫ్యాషన్ రంధి మీద అప్పుడెప్పుడో కాళోజి ‘ఫేస్ పౌడర్’ అనే కథ రాశారు. ఎంత బాగుందీ టైటిల్. కథ స్వభావాన్ని చెబుతోంది. అలాగే క్లుప్తంగా సూటిగా కూడా ఉంది. కేతు విశ్వనాథరెడ్డి ఒక మంచికథ రాసి ‘గడ్డి’ అని ఊరుకున్నారు. అవార్డు ఇవ్వాలి అలాంటి టైటిల్‌కి. పాలగుమ్మి పద్మరాజు చాలా బీభత్సమైన కథ రాసి ‘గాలివాన’ అని అతి సరళమైన పేరు పెట్టారు. అంతేతప్ప ‘తుఫానులో చిక్కిన కెరటాలు’ అనలేదు. తుఫాను ఆల్రెడీ కథలో ఉంది. మళ్లీ టైటిల్లో ఎందుకు? చాలా పెద్దవాళ్ల కథల్లో కూడా ఇలాంటి వింతల్ని గమనిస్తాం. చెహోవ్ ఒక కథ రాశాడు. ఒక పోలీసువాడు. దార్లో పోతుంటే ఏదో గలాటా కనిపించింది. చూస్తే ఒక బార్బర్‌ను ఒక కుక్క కరిచేసింది. పాపం అతడి చిటికినవేలు నుజ్జునుజ్జు అయ్యింది. అది చూసిన పోలీసువాడికి కోపం వచ్చి ఈ కుక్కను ఇలా రోడ్డు మీద వదిలేసిన వాణ్ణి అది చేస్తాను ఇది చేస్తాను అని ఎగురుతాడు. ఇంతలో ఆ కుక్క డబ్బున్నవాళ్లదని తెలుస్తుంది. తగ్గుతాడు. ఆ తర్వాత పోలీసు అధికారిదని తెలుస్తుంది. ఇంకా తగ్గుతాడు. కాదు వీధికుక్కే అని తేలుతుంది. మళ్లీ లేస్తాడు. కాదు- పోలీసు అధికారి ఇంటికొచ్చిన అతడి తమ్ముడిది అని చెప్తారు. ఆ సంగతి తేలాక పోలీసువాడు పూర్తిగా మారిపోతాడు. కుక్కను చేతపట్టుకొని- ఏంట్రా నాన్నా... ఆ బార్బర్ వెధవ వేలు కొరకాలనిపించిందా నీకు... చిచ్చీ... బుజ్జీ... అని గారం చేసి దానిని పైఅధికారి ఇంట అప్పజెప్పడానికి బయల్దేరి కుక్కకాటుతో కుయ్యో మొర్రో అంటున్న బార్బర్‌ని నీ సంగతి చూస్తా అన్నట్టుగా హెచ్చరించి వెళ్లిపోతాడు. దీనికి చెహోవ్ ‘ఊసరవెల్లి’ అని పేరు పెట్టాడు. కథంతా వాడు ఊసరవెల్లే అని చెప్తోంది. మళ్లీ ‘ఊసరవెల్లి’ అని నామకరణం ఎందుకు? దీనికి ‘న్యాయం’ అని పెట్టాలి యదార్థానికి. అవసరాన్ని బట్టి న్యాయం ఎటువైపు మొగ్గుతుందో తెలిసింది అని పాఠకుడు అనుకుంటాడు. అంటే నెరేషన్ కొంత కథ చెప్తే టైటిల్ మరికొంత కథ చెప్పిందన్నమాట. మంచి కథకు పేరు ఇలా కొంత ముసుగువేసి ఉంచాలిగాని తేటతెల్లం చేసేయకపోవడమే ఉత్తమం అని అంటారు. నిజమే. ‘కాటేసిన కరువు’ అంటే ఇంక దాన్ని చదవడం ఎందుకు? గొరుసు జగదీశ్వరరెడ్డి ‘గజ ఈతరాలు’ అనే కథ రాశారు. కుతూహలం రేపే పేరు అది. ఏంటిది.. భలే ఉందే అని చదువుతాం. కాని ఆయనే ‘జలగల వార్డు’ అనే కథ రాశారు. చదవడం ఎందుకు? గవర్నమెంటాస్పత్రి. పేషంట్లని పీక్కుని తింటారు. టైటిలే కథంతా చెప్పేసింది. రచయిత ఉద్దేశం కూడా చెప్పేసింది. అబ్బూరి ఛాయాదేవి ఇలాంటి కథనే రాసి ‘ఆఖరకు అయిదు నక్షత్రాలు’ అనే పేరు పెట్టారు. చాలా మంచి పేరు. అది కథేమీ చెప్పేయడం లేదు. కనుక ఆసక్తి పోదు. కథలకు ‘కుంకుడాకు’ వంటి చాలా మంచి పేర్లు పెట్టిన చాసో కూడా ‘బూర్జువా కుక్క’ అని టైటిల్ పెట్టి కథ రాశారు. టైటిల్లోనే రచయిత ఉద్దేశం తెలిసిపోయింది. చదవడం ఎందుకు? రావిశాస్త్రి- ‘షోకుపిల్లి’, నందిగం కృష్ణారావు- ‘కమ్యూనిస్టు గాడిద’... ఈ పేర్లలో ఉన్న కుతూహలం, వ్యంగ్యం... బూర్జువా కుక్కలో లేవు. ఆ గాంభీర్యం పాఠకుణ్ణి కథలో దాదాపుగా అడుగుపెట్టనివ్వదు. చాసో గొప్ప కథల్లో బూర్జువా కుక్కను ప్రస్తావించేవారు ఉన్నారా? చాలా మంచి కథలు ఏవంటే కథ కొంత చెప్పి మిగిలింది కథ మకుటం చెప్పడం. చింతా దీక్షితులు రాసిన ‘అభిప్రాయ భేదం’ కథ చూస్తే కథ- టైటిల్ రెండూ ఒక యూనిట్‌గా ఉంటాయి. శ్రీరమణ ‘మిథునం’ అంతే. గోపిని కరుణాకర్ ‘కానుగపూల వాన’లో కథ- టైటిల్ పెనవేసుకు ఉంటాయి. ఎంత గొప్ప ఊహ అది. పైవర్ణాల మీద పారిజాత వర్షం కురుస్తుంది. నిమ్నవర్ణాల మీద కురిసేది కానుగపూల వానే కదా! మరో క్లాసిక్ ఉదాహరణ ‘నల్లతోలు’. బ్రిటిష్‌వారి చేతిలో అవమానానికి గురైన ఒక భారతీయుడి కథను సి.రామచంద్రరావు ఆ మకుటంతో రాశారు. నువ్వు ఎంత పైఅధికారివైనా నీకు ఎంత డబ్బూ హోదా ఉన్నా నువ్వు ఎంత బ్రిటిష్‌వారిని అనుకరణ చేసినా నీ రంగు వల్ల నిన్ను అధముడుగా చూడక తప్పదు అని తాహతు తెలిపే కథ అది. దీనికి ‘నల్లతోలు’ అని పెట్టడంలోనే జరగబోయే తీవ్ర అవమానాన్ని సూచిస్తున్నాడు రచయిత. ‘నల్లరంగు’ అంటే మర్యాద ఉంది. ‘వర్ణభేదం’ అంటే అదేమిటో! కాని ‘నల్లతోలు’లో ఉండే రూడ్నెస్సే కథంతా. మాస్టర్‌స్ట్రోక్. కొన్ని కథలకు- కథలు జరిగే ప్రదేశమే టైటిల్‌గా బాగుంటుంది. మధురాంతకం నరేంద్ర ‘నాలుక్కాళ్ల మంటపం’ క్లాసిక్ ఎగ్జాంపుల్. కొన్ని కథల్లో పాత్రే కథైతే అదే కథ పేరవుతుంది. ‘బల్లకట్టు పాపయ్య’. ఇదీ క్లాసిక్ ఎగ్జాంపులే. ఇంకోటి ఏం చెప్తారంటే మనం పెడుతున్న పేరు ఏ కథకైనా పెట్టుకోవచ్చా లేదా ఈ కథకు మాత్రమే ఒప్పుతుందా అనేది చూసుకోవడం. ‘విపణి వీథి’ అనే పేరు ఏ కథకైనా పెట్టొచ్చు. కాని ‘కువైట్ సావిత్రమ్మ’ మాత్రం ఫలానా కథకు తప్ప వేరే దేనికీ పనికి రాదు. మంచి టైటిల్ అంటే ఈ లక్షణం కొంత పాటించాలి. కొందరు కథ రాసి, కోట్స్‌లో టైటిల్ పెడతారు. ‘చెడ్డవాడు’. ఇలా అన్నమాట. దీనర్థం ఏంటంటే అతడు నిజంగా చెడ్డవాడు కాదు సుమా, కథంతా చదివాక నీకే తెలుస్తుందిగా అని చెప్పడం. పాఠకులను తక్కువ చేయడం ఇది. కథ సరిగ్గా రాసి కోట్స్ లేకుండా చెడ్డవాడు అని పెట్టినా వాళ్లకు అర్థం అవుతుంది ఏ ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను పెట్టారో. మళ్లీ పాఠకుణ్ణి గుర్తు చేసుకోండి. ఏం కథ చదివావు అనంటే కోట్స్‌లో ఉన్న చెడ్డవాడు అనే కథ చదివాను అనంటాడా? ఇదంతా ఏమిటంటే పాఠకుడికి దగ్గరవ్వాల్సింది పోయి దూరంగా జరిగి కథను లిఖిత స్వభావానికి దగ్గరగా మౌఖిక స్వభావానికి దూరంగా ఉంచడం. ఇలాంటి రచయితల్ని పాఠకులు మనవాడు అనుకోరు. అనుకుందామనుకున్నా రచయిత అనుకోనిస్తే గదా. - ఖదీర్ -
చాంప్ పద్మిని
జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే పద్మినికి టైటిల్ ఖాయమైంది. మంగళవారం జరిగిన పదో రౌండ్లో పద్మిని 94 ఎత్తుల్లో తెలంగాణకు చెందిన హిందూజా రెడ్డిపై గెలిచింది. ప్రస్తుతం పద్మిని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నిషా మొహతా (పీఎస్‌పీబీ), మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్) ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఫలితంగా బుధవారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేమ్ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా పద్మినికి టైటిల్ ఖరారైంది. మరోవైపు ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు బొడ్డ ప్రత్యూష, కె.లక్ష్మీ ప్రణీతలకు మరో పరాజయం ఎదురైంది. పదో రౌండ్ లో లక్ష్మీ ప్రణీత 54 ఎత్తుల్లో నిషా మెహతా చేతిలో; ప్రత్యూష 38 ఎత్తుల్లో వర్షిణి (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు. -
వరుణ్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్-7 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్, జూబ్లీహిల్స్) విద్యార్థి వరుణ్ శంకర్ సత్తాచాటాడు. మైసమ్మగూడలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ ఈవెంట్లో అతను రెండు పసిడి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల స్కూలు జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. వ్యక్తిగత విభాగంలో టైటిల్ గెలిచిన వరుణ్... ఇదే జోరుతో టీమ్ ఈవెంట్లో తన స్కూల్ జట్టును గెలిపించి మరో స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో బీవీబీపీఎస్ జట్టు జాతీయ సీబీఎస్ఈ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించింది. ఈ టోర్నీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 8 నుంచి 12 వరకు జరగనుంది. సోమవారం జరిగిన బాలుర వ్యక్తిగత విభాగం ఫైనల్లో వరుణ్ శంకర్ 11-5, 11-9, 11-4తో కార్తీక్ (మెరిడియన్ స్కూల్)ను వరుస గేముల్లో కంగుతినిపించాడు. సెమీస్‌లో అతను 11-6, 12-10, 11-7తో బక్ష్ తిలన్ (వీవీడీ స్కూల్, కర్ణాటక)పై, క్వార్టర్స్‌లో 11-5, 11-6తో ఆదిత్య (డీపీఎస్, మంగళూరు)పై గెలుపొందాడు. టీమ్ ఈవెంట్ ఫైనల్లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, హైదరాబాద్)పై విజయం సాధించింది. బీవీబీ కెప్టెన్ వరుణ్ 11-5, 11-6, 11-2తో రోహన్ దేశాయ్ (డీపీఎస్)పై, వత్సిన్ 11-8, 11-5, 11-8తో ఆర్యన్ (డీపీఎస్)పై, వృశిన్ 11-9, 11-9, 11-6తో రాఘవ్ రతిపై గెలుపొందారు. సెమీఫైనల్లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో చిరెక్ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్)పై, క్వార్టర్స్‌లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో డీపీఎస్ (బెంగళూరు) జట్టుపై నెగ్గింది. బాలికల చాంప్ లాస్య భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ (హైదరాబాద్) అమ్మాయి వి.లాస్య బాలికల వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి కేంద్రీయ విద్యాలయ (బెంగళూరు)కు చెందిన అనర్గ్య రన్నరప్‌తో సరిపెట్టుకోగా, శ్రీఅరబిందో స్కూల్ (బెంగళూరు) క్రీడాకారిణి ఆనందమయి మూడో స్థానంలో నిలిచింది. బాలికల టీమ్ ఈవెంట్లో డీపీఎస్ (బెంగళూరు) జట్టు చాంపియన్‌షిప్ సాధించింది. రెండు కర్ణాటక జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్లో డీపీఎస్ 3-1తో కేఎల్ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. -
సానియా ‘షో'
కారా బ్లాక్‌తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సింగపూర్: పట్టుదలకు అనుభవం కూడా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిరూపించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా తన భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి అంతిమ సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 7-5, 11-9తో క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీపై అద్భుత విజయం సాధించింది. రెండు గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ పోరులో సానియా జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందడం విశేషం. ఒకవైపు తన భాగస్వామి కారా బ్లాక్ కచ్చితమైన సర్వీస్‌లు చేయడంలో ఇబ్బంది పడుతోంటే... మరోవైపు సానియా అన్నీ తానై మ్యాచ్‌ను నడిపించింది. పదునైన రిటర్న్ షాట్లకు తోడు నెట్‌వద్ద అప్రమత్తంగా వ్యవహరించి కీలక దశలో పాయింట్లు నెగ్గడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట ఒక దశలో 6-9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సానియా, కారా బ్లాక్ సమన్వయంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 9-9తో సమం చేశారు. అదే జోరులో మరో రెండు పాయింట్లు నెగ్గి 11-9తో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. తద్వారా సానియా తన కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకుంది. మరోవైపు వేర్వేరు భాగస్వాములతో కలిసి గతంలో ఈ టోర్నీని రెండుసార్లు నెగ్గిన కారా బ్లాక్ మూడో టైటిల్ రేసులో నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా)లతో సానియా ద్వయం తలపడుతుంది. మరో సెమీఫైనల్లో సు వీ సెయి-షుయె పెంగ్ 6-1, 6-4తో అలా కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా)లపై గెలిచారు. ఆ సమయంలో చాలా ఉత్కంఠకు లోనయ్యా. ఎలాగైనా మ్యాచ్‌లో నిలవాలని భావించాం. సూపర్ టైబ్రేక్‌లలో ఏదైనా జరగొచ్చు. 6-9తో ఉన్న సమయంలో ఒక్క సర్వ్‌ను ప్రత్యర్థి బ్రేక్ చేసినా చాలు. అందుకే తొలి సర్వీస్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనుకున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చని అనిపించింది. - సానియా మీర్జా