విజయ్ మెర్సల్ ట్రేడ్‌మార్క్ సంచలనం
సాక్షి, చెన్నై: సౌత్‌లో ఎమోజీల పేరిట మెర్సల్ చిత్రంతో సరికొత్త పంథాను క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్ర టైటిల్‌కు ట్రేడ్ మార్క్ హక్కులను తీసుకుని ఆసక్తికర చర్చకు దారితీశాడు.
మెర్సల్ ఇక ఈ పేరును ఎవరైనా వాడుకుంటే వాళ్లు చిత్ర నిర్మాతలకు రాయల్టీ కింద డబ్బులు చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఏదైనా ఒక పాపులర్ సంస్థ మెర్సల్ అనే టైటిల్ ను వాడినా, లేక ఆ పేరుతో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించినా ఎంతో కొంత డబ్బు చెల్లించి నిర్మాతల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెర్సల్ తో సౌత్ సినిమాలో మరో ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పుకుంటున్నారు.
ఇక మెర్సల్ ట్రేడ్ మార్క్ హక్కుల ప్రక్రియకు ఆరు నెలల సమయం పట్టిందంట. దీంతో టైటిల్ తమదేనంటూ ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఉన్న మెర్సల్ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కానుంది. కాజల్, నిత్యామీనన్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.