సిగరెట్ కంపెనీలకు భారీ 'పొగ'
ముంబై: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా నిషేధించేందుకు కేంద్రం యోచిస్తోందన్నవార్తలతో టుబాకో షేర్లలో ఒక్కసారిగా పొగ' మొదలైంది. ఎఫ్‌డీఐలను నిషేధించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. పొగాకు ఉత్పత్తులదారులకు భారీ షాక్ తగిలింది. ఎఫ్‌డీఐలను పూర్తి నిషేధించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో మార్కెట్లో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.దీంతో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫ్రాంచైజీ లైసెన్సింగ్ రద్దు, ట్రేడ్‌మార్క్, బ్రాండ్ నేం ఇతర రూపాల్లో మొత్త పెట్టుబడులను ని షేధించనుంది. అలాగే పరోక్ష పెట్టుబడుల అవకాశాలను పూర్తిగా నిరోధించనుంది. వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ కోసం పంపినట్టు సంబంధిత అధికారులు పీటీఐకి తెలిపారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ ఆమోదం పొందితే దేశీయ సిగరెట్ తయారీదారులు ఒక ఎదురుదెబ్బ కావచ్చువిశ్లేషకులు భావిస్తున్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిషేధించనున్నారన్న వార్తలతో.. గాడ్ఫ్రే ఫిలిప్ లోయర్ సర్క్యూట్ ను నమోదు చేసింది.దాదాపు 20శాతం శాతం పడిపోయింది. గోల్డెన్ టుబాకో షేర్ ధర 2,శాతం. ఐటీసీ 3.58 శాతం కొఠారి ప్రొడక్ట్ 0.82 శాతం నష్టపోగా వీఎస్టీ ఇండస్ట్రీస్ షేర్ ధర మాత్రం 3 శాతం పైగా (3.94) లాభపడటం విశేషం.