together
-
అమెరికా- జపాన్ సైనిక ఒప్పందం.. ఇక చైనాకు చుక్కలే?
చైనా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు జపాన్- అమెరికాలు ఒక సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చైనా చర్యలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా జపాన్, అమెరికా రక్షణ అధిపతులు, అగ్ర దౌత్యవేత్తలు టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు యూఎస్ఏ సైనిక కమాండ్‌ను నవీకరించడం, జపాన్‌లో యూఎస్ఏ నుండి లైసెన్స్ పొందిన క్షిపణుల ఉత్పత్తిని పెంచడం తదితర అంశాలపై చర్చించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ జపాన్-అమెరికా సెక్యూరిటీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో జపాన్ ప్రతినిధులు యోకో కమికావా, మినోరు కిహారాతో భద్రతా చర్చలు జరిపారు. చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడంలో నిమగ్నమైందని, తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ చుట్టూ యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆస్టిన్ ఆరోపించారు.ఉత్తర కొరియా చేపట్టిన అణు కార్యక్రమం, రష్యా నుంచి ఆ దేశానికి అందుతున్న సహకారం మొదలైనవి ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. యుఎస్ఏ బలగాల పెంపుతో సహా కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాలను ఆధునీకరించే విషయమై త్వరలో చర్చించనున్నట్లు ఆస్టిన్ తెలిపారు. -
మళ్లీ ‘చేయి’ కలిపిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కోదండరాం మరోమారు కాంగ్రెస్ పార్టీ చేయిపట్టి నడవాలని నిర్ణయించుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేసిన ఆయన ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ పక్షానే నిలబడ్డారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తాయని, కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన ప్రకటించారు. టీజేఎస్ మద్దతిచ్చేందుకు ఆరు డిమాండ్లను కాంగ్రెస్ ముందుంచారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విధాన రూపకల్పనలో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రేవంత్, ఠాక్రేతో చర్చలు.. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన కోదండరాం ఎన్నికల వేళ మళ్లీ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు నాంపల్లిలోని టీజేఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతోపాటు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ధర్మార్జున్ తదితరులతో గంటకుపైగా చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గత పదేళ్లుగా టీజేఎస్, కోదండరాం పోరాడుతున్నందున తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే వారి సహకారం అవసరమని రేవంత్ కోరారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని, ఎన్నికల క్షేత్రంలో ఇరు పార్టీల శ్రేణులు కలసి పనిచేసేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కోదండరాం కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు అంగీకరించారు. చర్చల్లో భాగంగా టీజేఎస్ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చించారు. సీట్లు కేటాయించాలంటే ఇప్పుడు మళ్లీ అధిష్టానంతో మాట్లాడాల్సి ఉంటుందని, ఈసారికి పోటీ లేకుండానే మద్దతివ్వాలని రేవంత్ తదితరులు కోదండరాం, టీజేఎస్ నేతలను కోరారు. వీలునుబట్టి ఇప్పటికైనా అవకాశం ఉన్న చోట పోటీకి అంగీకరించాలని, లేకపోయినా తమ మద్దతు ఇస్తామని టీజేఎస్ పక్షాన స్పష్టం చేశారు. అండగా ఉంటామన్నారు: రేవంత్ ఇరు పార్టీల చర్చల అనంత రం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రజాప్రభు త్వం ఏర్పాటు చేసేందుకు టీజేఎస్‌తో కలసి ముందుకెళతామన్నారు. టీజేఎస్ డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని నెరవేర్చడం కోసం సమన్వయ కమిటీని నియమించుకుంటామని చెప్పారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు కోదండరాంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ అధిష్టానం సూచ న మేరకు ఆయన్ను కలసి మద్దతివ్వాలని కోరినట్లు వివరించారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటా మని కోదండరాం హామీ ఇచ్చారని, సీట్లు ఓట్లు కంటే ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు రాష్ట్రంలో కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్పారు. తమ ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు హ్యాక్ చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నియంత్రించాలన్న ఆలోచనలతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారన్నారు. తమకు సహకరించాలనుకుంటున్న వారిని బెదిరిస్తున్నారని, తాము ప్రైవేటుగా మాట్లాడిన మాటలను వింటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఎంఐఎం, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. టీజేఎస్ 6 డిమాండ్లు ఇవే.. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. ఏ సంవత్సరం ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేయాలి. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించాలి. సంప్రదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత కల్పించాలి. చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. వాస్తవ వ్యవసాయ సాగుదారులను గుర్తించాలి. చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించాలి. భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక పాలన నెలకొల్పాలి. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, పేదలకు పాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు సమగ్ర సాయం అందించాలి. -
ఫొటో తీయకపోవడంతో అలిగి వెళ్లిపోయింది.. మళ్లీ 15 ఏళ్లకు ‘బలంగం’తో...
వరంగల్: మండల పరిధి వనపర్తిలో ఇటీవల ప్రదర్శించిన ‘బలగం’ సినిమా మనస్పర్థలతో దూరమైన అక్కా.. తమ్ముడి కుటుంబాలను కలిపింది. వివరాలిలా ఉన్నాయి. అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మిని అదే గ్రామంలో పప్పు వీరారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. రెండు కుటుంబాలు వనపర్తిలోనే ఉంటున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని వివాహవేడుకల్లో లక్ష్మి ఫొటో తీయకపోవడంతో భోజనం చేయకుండా అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి మృతి చెందగా.. అంత్యక్రియల సమయంలో లింగారెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. దీంతో అతడి భార్య వసంత, కొడుకు శ్రీకాంత్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లొచ్చారు. అయినా రెండు కుటుంబాలు కలిసిపోలేదు. ఇటీవల సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ గ్రామంలో బలగం సినిమాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించారు. ఆ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మి హృదయాల్లో మార్పు వచ్చింది. పంతాలు వదిలేసి సర్పంచ్ శ్రీధర్, గ్రామస్తులు మహేష్, రవీందర్‌రెడ్డి సమక్షంలో ఈనెల 15న లింగారెడ్డి తన అక్క లక్ష్మి ఇంటికి వెళ్లాడు. దీంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. -
చదువులమ్మ చెట్టు నీడలో..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాజమహేంద్రవరం రూరల్: ఇరవై ఏళ్ల క్రితం బొమ్మూరులోని జిల్లావిద్యాశిక్షణ కేంద్రం (డైట్)లో ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొంది... ఇప్పుడు ఉపాధ్యాయులుగా స్థిరపడిన 1997–98 బ్యాచ్ విద్యార్థులు ‘స్నేహ గౌతమి’పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం చదువులమ్మ చెట్టునీడలో ఉల్లాసంగా .. ఉత్సాహంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన ఉపాధ్యాయులను గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆనాడు తమకు లెక్చరర్‌గా ఉన్న అప్పారి జయప్రకాశరావు నేడు డైట్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉండడం ఆనందంగా ఉందని స్నేహ గౌతమి అధ్యక్షుడు ఐ.మోహన్ అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని సభకు పరిచయం చేసుకున్నారు. అలనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకోవడంతో అప్పటి చిలిపి పేరులతో పిలుచుకుంటూ స్నేహమాధుర్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. తమకు బోధించిన గురువులు అప్పారి జయప్రకాశరావు, గంగారాం, బాలచందర్, ఈవీఎస్.జ్యోతి, కేవీ రమణ, గోవిందు, వై.నాగేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, ఐజీహెచ్‌ఎన్.ప్రసాద్, వీవీఎన్ ఆచార్యులు, బి.వెంకట్రావు, అన్నాజీరావులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులను ఉద్ధేశించి డైట్ ప్రిన్సిపాల్ జయప్రకాశరావు మాట్లాడుతూ తమ వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 20 ఏళ్ల తరువాత స్నేహగౌతమి పేరుతో కలుసుకుని గురుపౌర్ణమి రోజున సత్కరించడం చాలా ఆనందరంగా ఉందన్నారు. టి.బంగారునాయుడు, కెఎస్.మల్లేశ్వరరావు, భమిడిపాటిఫణికుమార్, సత్తిబాబు, సూర్యకిరణ్, కృష్ణంరాజు, కవిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. గత మూడేళ్లుగా నేను డయాబెటిస్తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. వ్యాయామం విషయంలో డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రత్నకిశోర్, నూతనకల్ డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలరు. దీనివల్ల ఇన్సులిన్ పట్ల శరీరం బాగా స్పందించడంతో పాటు ఒంట్లోని చక్కెరపాళ్లు కూడా తగ్గుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ∙వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులుఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ∙వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. ఒకవేళ రక్తంలోని షుగర్ పాళ్లు100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే శ్నాక్స్ లేదా ఏదైనా పండు వంటిది తినాలి. ఒకవేళ రక్తంలో చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. ∙మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగా, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. ∙డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్