Tomato crops
-
Tomato Price: దారుణంగా పడిపోయిన టమాట ధర
-
భారీగా పతనమైన టమోటా ధర..
-
టమాటా ధరలు ఢమాల్
-
స్ట్రైకింగ్ పద్ధతిలో నాణ్యమైన టమాట సాగు దిగుబడి
-
ఆధునిక పద్ధతిలో టమాట సాగు
-
గిట్టుబాటు ధర లేక బోరుమంటున్న టమోటా రైతులు...
-
రోడ్డు పైనే పారేసి వెళ్తున్నారు..
సాక్షి, పాపన్నపేట(మెదక్): కనికరం లేని కరోనా ఏవర్గాన్ని వదిలి పెట్టడడం లేదు. లాక్డౌన్ అన్ని వర్గాలకు బేడీలు వేసింది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే ..కూర గాయల ధరలు పాతాళానికి పడి పోతున్నాయి. అంగళ్లపై నిషేధం ఉండటంతో ..కూరగాయల రైతులు ఎక్కడో ఒక చోట వీధి మూలన బిక్కు బిక్కుమంటూ అరగంట పాటు అమ్ముకొని ఎవరి కంట పడకుండా ఇంటి బాట పడుతున్నారు. ఈ పద్ధతి వారి అవసరానికే అమ్ముకుంటున్నట్లు ఉండటంతో ..ధరలు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా టమాటా రైతు చితికి పోతున్నాడు. రూ.10కి మూడు కిలోల చొప్పున అమ్ముకుంటున్నాడు. ఒక్కో సారి అవి కూడా అమ్మక పోవడంతో జిల్లాలో యాసంగి పంటగా సుమారు 750 ఎకరాల టమాటా పంట వేశారు. 7500 టన్నుల పంట దిగుబడి వస్తోంది. ఇతర కూరగాయలు 3500 ఎకరాల్లో వేసినట్లు హారి్టకల్చర్ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవి కాలంలో నీటి లభ్యత మోస్తారుగా ఉన్న చోట కూరగాయల పంటలకు ప్రాధాన్యత ఇస్తారు. యేటా మే నెల నాటికి ఎండల ప్రభావం పెరగడంతో, సాధారణంగా కూరగాయల ధరలు కూడా పెరుగుతుతాయి. కానీ ఈ సారి కరోనా..లాక్డౌన్ ప్రభావాలతో ధరలు పతనమయ్యాయి. రైతు కంట కన్నీళ్లు.. కరోనా కల్లోలం కూరగాయల రైతుల బతుకులను ఆగం చేసింది. విత్తు విత్తి..కలుపు తీసి..పురుగు మందులు చల్లి పండించిన కూరగాయలు రైతు కలలను కల్లలు చేశాయి. అంగళ్లు మూతబడ్డాయి. హాస్టళ్ళు, హోటళ్లు, మెస్‌లు బంద్ అయ్యాయి. దీంతో కూరగాయల వ్యాపారులు ఇళ్లిల్లు తిరుగుతూ అమ్ముతున్నారు. ఇంటికి వచి్చన వ్యాపారి ఎంతో కొంతకు ఇవ్వక మానడు అన్న తలంపుతో తక్కువ ధరలకే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంగళ్లకు వచ్చే వ్యాపారులు చాటు మాటుకు దుకాణాలు పెట్టుకొని ఏదో కొంత ధరకు అమ్ముకొని పరుగులు తీస్తున్నారు. టమాటా రైతు పరిస్థితి మరీ దీనంగా ఉంది. రూ.10కి మూడు కిలోల టమాటా అమ్ముకుంటున్నారు. ఒక్కో సారి ధరలేక రూ.2 కు కిలో ఇస్తున్నట్లు చెపుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో అసలు కొనే వారే లేకపోవడంతో దారి పక్కనే పారేసి కన్నీళ్లతో వెళ్తున్నారు. ధర గిట్టుబాటు కాకపోవడంతో టమాటా తెంపకుండా పొలంలోనే వదిలి వేస్తున్నారు. బీరకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.30, గోపి గడ్డ రూ. 10, కాలి ఫ్లవర్ రూ.20 కి లో చొప్పున అమ్ముతున్నారు. -
కష్టం.. నష్టం
అలంపూర్ నియోజకవర్గంలోదాదాపు 1500 ఎకరాల్లో మిర్చిపంటకు నష్టం వాటిల్లింది. అలంపూర్‌లో 35 మిల్లీమీటర్లు, ఇటిక్యాలలో 11మి.మీ., అయిజలో 31 మి. మీ., మానవపాడులో 36.4మి.మీ., వర్షపాతం కురిసింది. 80 ఎకరాల మునగా, 300 ఎకరాల మొక్కజొన్న, 100 ఎకరాల్లో జొన్న, 200 ఎకరాల పత్తి, ఉల్లి, టమాటా పంటలు నాశనమయ్యాయి. బయట నిల్వ చేసిన పొగాకు తడిసిపోయింది. వడ్డేపల్లి మండలంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత 16.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. కళ్లంలో ఆరబెట్టేందుకు ఉంచిన మిర్చి పంట పూర్తిగా తడిసిపోయింది. మొక్కజొన్న నేలకొరిగింది. ఇటిక్యాల మండలం ఆరు గార్లపాడు, ధర్మవరం, దువ్వాసిపల్లి, బి.వీరాపురం, షేక్‌పల్లి గ్రామాల్లో 500 ఎకరాల్లో మిర్చి పంట పండించగా, దాదాపు 300 ఎకరాల్లో పంట నాశనం కాగా, రూ. 50 లక్షల వరకు నష్టం ఉంటుంది. కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్లలో అయ్యవారిపల్లి, కొప్పునూర్, పెద్దదగడ, పెద్దమారూర్, చిన్నమారూర్ వర్షం బీభత్సానికి మిర్చి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది. మాగనూరు మండలంలో అకాల వర్షానికి 750 ఎకరాల వేరుశనగపంట, చేగుంట, అలంపల్లి, కున్సి గ్రామాల్లో వంద ఎకరాల జొన్న పంట, నాశనమైంది. ఖిల్లాఘనపురం మండలంలో రూ.దు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి దాదాపు 300 ఎకరాల వేరుశనగ పంట నాశనమైంది. ఇటుక బట్టీలు పూర్తిగా తడిసిపోయాయి. కొత్తకోట మండలం కొన్నూరు, కనిమెట్ట గ్రామాల్లో వంద ఎకరాల వరకు పంట నాశనమైంది. వ్యవసాయాధికారి గురువారం పంటలను పరిశీలించి రూ.25 లక్షల వరకు నష్టం వాలిట్లవచ్చని అంచనా వేశారు. చిన్నచింతకుంట మండలం ఏదులాపురం, వడ్డెమాన్, నెల్లికొండి గ్రామాల్లో ఆరు వందల ఎకరాల మిర్చిపంట సాగుచే యగా,పొలం కళ్లా ల్లో ఆరబెట్టిన సగానికి పైగా మిర్చి పూర్తిగా తడిసిపోయింది. అడ్డాకుల మండలం తిమ్మాపూర్‌లో డీలర్ మనోహర్ ఇంటి పైకప్పుకూలింది. జిల్లాలో పలు చోట్ల ఇటుక బట్టీలు తడిసి అపార నష్టం కలిగింది. కొత్తకోటలో 21 మంది వ్యాపారులకు 12 లక్షల మేర నష్టం వాటిల్లింది. ధన్వాడ మండలం మరికల్లో 70 ఇటుక బట్టీలు నాశనమయ్యాయి. ఒక్కో వ్యాపారికి రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆత్మకూర్ మండలంలో మామిడి, వేరుశనగ, బత్తాయి పంటలను వెయ్యి ఎకరాల్లో సాగు చేయగా, 500 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పాన్‌గల్, పెద్దమందడి, గోపాలపేటలో వేరుశనగ పంట బాగా దెబ్బతింది. మానవపాడు మండలంలోని బోంకుర్లో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లడంతో పాటు నాలుగు పూరి గుడిసెలు కుప్పకూలాయి.