కష్టం.. నష్టం | problem..loss | Sakshi
Sakshi News home page

కష్టం.. నష్టం

Published Fri, Mar 7 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

problem..loss

అలంపూర్ నియోజకవర్గంలోదాదాపు 1500 ఎకరాల్లో మిర్చిపంటకు నష్టం వాటిల్లింది. అలంపూర్‌లో 35 మిల్లీమీటర్లు, ఇటిక్యాలలో 11మి.మీ., అయిజలో 31 మి. మీ., మానవపాడులో 36.4మి.మీ., వర్షపాతం కురిసింది.  80 ఎకరాల మునగా, 300 ఎకరాల మొక్కజొన్న, 100 ఎకరాల్లో జొన్న, 200 ఎకరాల పత్తి, ఉల్లి, టమాటా పంటలు నాశనమయ్యాయి. బయట నిల్వ చేసిన పొగాకు తడిసిపోయింది.
 
 వడ్డేపల్లి మండలంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత 16.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. కళ్లంలో ఆరబెట్టేందుకు ఉంచిన మిర్చి పంట పూర్తిగా తడిసిపోయింది. మొక్కజొన్న నేలకొరిగింది. ఇటిక్యాల మండలం ఆరు గార్లపాడు, ధర్మవరం, దువ్వాసిపల్లి, బి.వీరాపురం, షేక్‌పల్లి గ్రామాల్లో 500 ఎకరాల్లో మిర్చి పంట పండించగా, దాదాపు 300 ఎకరాల్లో పంట నాశనం కాగా, రూ. 50 లక్షల వరకు నష్టం ఉంటుంది.
 
 కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్లలో అయ్యవారిపల్లి, కొప్పునూర్, పెద్దదగడ, పెద్దమారూర్, చిన్నమారూర్ వర్షం బీభత్సానికి మిర్చి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది.
 
 మాగనూరు మండలంలో అకాల వర్షానికి 750 ఎకరాల వేరుశనగపంట,  చేగుంట, అలంపల్లి, కున్సి గ్రామాల్లో వంద ఎకరాల జొన్న పంట, నాశనమైంది.   
 
 ఖిల్లాఘనపురం మండలంలో రూ.దు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి దాదాపు 300 ఎకరాల వేరుశనగ పంట నాశనమైంది. ఇటుక బట్టీలు పూర్తిగా తడిసిపోయాయి.
 
  కొత్తకోట మండలం కొన్నూరు, కనిమెట్ట గ్రామాల్లో వంద ఎకరాల వరకు పంట నాశనమైంది. వ్యవసాయాధికారి గురువారం పంటలను పరిశీలించి రూ.25 లక్షల వరకు నష్టం వాలిట్లవచ్చని అంచనా వేశారు.
 
 చిన్నచింతకుంట మండలం ఏదులాపురం, వడ్డెమాన్, నెల్లికొండి గ్రామాల్లో ఆరు వందల ఎకరాల మిర్చిపంట సాగుచే యగా,పొలం కళ్లా ల్లో ఆరబెట్టిన సగానికి పైగా మిర్చి పూర్తిగా తడిసిపోయింది. అడ్డాకుల మండలం తిమ్మాపూర్‌లో డీలర్ మనోహర్ ఇంటి పైకప్పుకూలింది.
 
 జిల్లాలో పలు చోట్ల ఇటుక బట్టీలు తడిసి అపార నష్టం కలిగింది. కొత్తకోటలో 21 మంది వ్యాపారులకు 12 లక్షల మేర నష్టం వాటిల్లింది. ధన్వాడ మండలం మరికల్‌లో 70 ఇటుక బట్టీలు నాశనమయ్యాయి. ఒక్కో వ్యాపారికి రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.
 ఆత్మకూర్ మండలంలో మామిడి, వేరుశనగ, బత్తాయి పంటలను వెయ్యి ఎకరాల్లో సాగు చేయగా, 500 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. పాన్‌గల్, పెద్దమందడి, గోపాలపేటలో వేరుశనగ పంట బాగా దెబ్బతింది.  
 
 మానవపాడు మండలంలోని బోంకుర్‌లో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లడంతో పాటు నాలుగు పూరి గుడిసెలు కుప్పకూలాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement