Tomato market
-
డబ్బులు చెట్లకు కాయడం అంటే ఇదే మరి.. టమాటతో లక్షలు సంపాదించొచ్చు!
Tomato Farming Business In India: గత కొన్ని రోజులుగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల ఆశలు చిగురించాయి. టమాటాలు పండించిన రైతులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. కావున ఏదైనా బిజినెస్ చేసి మంచి లాభాలను పొందాలనుకునే వారికి టమాటా సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నేడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే కేవలం కంపెనీలు ప్రారభించడమో, లేకుంటే లెక్కకు మించిన డబ్బు వెచ్చించి ఇతర వ్యాపారాలు చేయడమనేది మాత్రమే ఏకైక మార్గం కాదు.. ఆధునిక కాలంలో వ్యవసాయం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చని కొంతమంది చెబుతున్నారు, మరి కొందరు నిరూపిస్తున్నారు. ఇటీవల టమాటాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న రైతులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. నిజానికి దేని అవసరం ఎప్పుడు ఉంటుందో.. ఉండదో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ప్రతి రోజు టమాటాల అవసరం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం టమాటా కూరలకు మాత్రమే కాకూండా సాస్, పిజ్జా వంటి వాటిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కావున సరైన పద్దతిలో టమాటా సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయన్నది నిజం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది టమాట సాగు చేస్తారు. ఒక హెక్టారులో వివిధ రకాలకు లోబడి 800 నుంచి 1200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సరైన వ్యవసాయ పద్ధతులతో, ఈ పంటను పండించడం ద్వారా బంపర్ లాభాలను పొందవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) టమాట సాగు సంవత్సరానికి రెండు సార్లు చేసుకోవచ్చు. జూలై & ఆగస్టు నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు.. నవంబర్ & డిసెంబర్ నుంచి మొదలై జూన్-జూలై వరకు ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో 15,000 మొక్కలను పెంచవచ్చు. 2 నుంచి 3 నెలల వ్యవధిలో టమాటాలు రావడం మొదలవుతాయి. కొన్ని సార్లు పంట దిగుబడి తగ్గినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఆశించిన లాభాలను పొందవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) ప్రస్తుతం మన దేశంలో కేజీ టమాటాల ధర రూ. 120 వరకు ఉంది. దీంతో రైతులు ఊహకందని మంచి లాభాలను పొందగలుగుతున్నారు. టమాట సాగు చేసే రైతు సగటున కేజీ రూ. 10కి విక్రయిస్తే 1000 క్వింటాళ్లకు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కావున టమాట సాగుతో కూడా తప్పకుండా లాభాలను పొందే అవకాశాలు చాలానే ఉన్నాయి. -
మళ్లీ పెరిగిన టమాట ధరలు
మదనపల్లె సిటీ: టమటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుండడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధర గరిష్టంగా కేజీ రూ.104 పలికింది. కేవలం 92 మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో టమాటాకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. -
‘కర్నూలు టమాటా’కు మంచి రోజులు
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయా పారీ్టలు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇచ్చే హామీల్లో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు తప్పక ఉంటుంది. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా.. హామీ మాత్రం బుట్ట దాఖలవుతూనే వచి్చంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కలగా ఉన్న హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేర్చుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాట ప్రధాన పంటగా సాగవుతోంది. ఏటా రాష్ట్రంలో టమాట 50 వేల ఎకరాల్లో సాగవుతుంటే కర్నూలు జిల్లాలోనే దాదాపు 10 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అయితే ఏటా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. కిలో టమాటకు రూపాయి ధర కూడ లభించక రోడ్లపై పారబోసిన సంఘటనలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టమాటకు ధరలు పడిపోయినపుడు మార్కెటింగ్ శాఖ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతుల్లో కొంతవరకు భరోసా నింపింది. ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టింది. మరుగున పడిన టమాట జ్యూస్ ఇండస్ట్రి ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. 25 ఏళ్ల రైతుల కలను నెరవేర్చేందుకు ముందుకు వచి్చంది. ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో టమాట పల్ప్(గుజ్జు) ప్రాసెసింగ్ ఇండస్ట్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల రైతులకు మేలు జరిగే విధంగా రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న మెట్టుపల్లి గ్రామం పరిధిలో టమాట పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే 15 ఎకరాల భూములను కూడా గుర్తించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాలో టమాట ఎక్కువగా సాగు చేసే ప్యాపిలి, డోన్, దేవనకొండ, పత్తికొండ, పెద్దకడుబూరు, హాలహరి్వ, హొళగొంద, ఓర్వకల్, వెల్దుర్తి, కృష్ణగిరి, కోడుమూరు, సీ.బెళగల్ తదితర పాంత్రాల రైతుల కష్టాలు తొలగిపోనున్నాయి. డీపీఆర్ సిద్ధం? జిల్లాలో 15 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టమాట గుజ్జు పరిశ్రమకు సంబంధించి డీటైల్ ప్రాజెక్టు రిపోర్టును నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాప్కాన్ సిద్ధం చేస్తోంది. నాప్కాన్ నుంచి ప్రత్యేక టీమ్ ఇటీవల ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి వచ్చి భూములను పరిశీలించింది. డీటైల్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తోంది. మరోవైపు ఎంటర్ప్రెన్యూర్ కోసం ఆంధ్రప్రదేశ్ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎక్స్‌ప్రెసెన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) జారీ చేసింది. టమాట గుజ్జుతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల్లో పండించే టమాటకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఏర్పడింది. టమాట గుజ్జు ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటును జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది. గుజ్జు పరిశ్రమ జిల్లాకు వరమే మెట్టుపల్లిలో టమాట పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ 15 ఎకరాలు కేటాయించారు. కన్సల్టెన్సీగా ప్రభుత్వం నాప్కాన్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే నాప్కాన్ ప్రతినిధులు గ్రామానికి వచ్చి సర్వే చేశారు. డీపీఆర్ సిద్ధం అవుతోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇప్పటికే ఎంటర్ప్రెన్యూర్ కోసం ఈవోఐ జారీ చేసింది. ఇటు కర్నూలు, అటు అనంతపురం జిల్లాల టమాట రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఇక్కడ టమాట పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రభుత్వం నెలకొల్పనుంది. – ఉమాదేవి, జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
జాక్‌పాట్ దగా..!
పండ్లు, కూరగాయల రైతులకు మార్కెట్లో రుసుం రద్దుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేశారు. ఇందుకు సంబంధించి జీఓ ఎంఎస్ నంబర్ 58ను తీసుకువచ్చారు. మదనపల్లె మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. సీఎం ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా కమీషన్ల వసూళ్లకు పాల్పడుతూ జాక్‌పాట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి, మదనపల్లె టౌన్ : అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దళారులకే అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారీలతో అధికారుల కుమ్మక్కై ఈ–వేలానికి మంగళం పలికి జాక్‌పాట్ విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. దీంతో రోజుకు రైతులు లక్షల్లో నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి వేలల్లో గండిపడుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లె టమాట మార్కెట్ యార్డుకు సరాసరిన 400 టన్నుల టమాటాలు వస్తున్నాయి. ప్రస్తుతం పది కిలోల టమాటాలు రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ఇలా రోజుకు 4 లక్షల కిలోల టమాటాలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటికి ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.1.52 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో జాక్‌పాట్, కమీషన్ విధానంతో సుమారు రైతులకు దాదాపు రూ.7.23 లక్షల మేర నష్టం కలుగుతోంది. ఈ లెక్కన మార్కెట్ అధికారులు నెలవారీ చూపించే వ్యాపార లావాదేవీల్లో నామమాత్రపు వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు నివేదికలు చూపుతున్నారనే సమాచారం ఉంది. మార్కెట్లో దాదాపు 100కు పైగా మండీల యజమానులు ఉన్నారు. ఒక కమీషన్ మండీ ఏజెంట్ నెలకు రూ.50 లక్షల వ్యాపారం నిర్వహిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపుతున్నారు. మార్కెట్ యార్డుకు సెస్, వ్యాపార కమీషన్ల ద్వారా సంవత్సరానికి రూ.1.90 కోట్లు వరకు ఆదాయం చేకూరుతోంది. మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారికి నేరుగా ఎటువంటి సంబంధాలు ఉండవు. రైతు తీసుకొచ్చిన సరుకు కమీషన్ ఏజెంట్ ద్వారా విక్రయాలు జరుగుతాయి. కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మధ్య ముందుగానే వ్యాపారలావాదేవీల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రైతు, వ్యాపారికి కమీషన్ ఏజెంటే మధ్యవర్తిగా వ్యవహరించి టమాటాలను జాక్‌పాట్, కమీషన్ పద్ధతిలో బహిరంగ వేలం నిర్వహిస్తాడు. వ్యాపారి నుంచి నగదును తీసుకుని తన కమీషన్ మినహా మిగిలిన మొత్తాన్ని రైతుకు అందజేస్తాడు. సీఎం ఉత్తర్వులు బేఖాతర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత వారం రైతులు పండించే పంటలకు కమీషన్ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలను ఇక్కడి అధికారులు మాత్రం ఖాతరు చేయడంలేదు. వ్యాపారులు, మండీల నిర్వాహకులతో కుమ్మక్కై యథేచ్ఛగా రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. మోసం జరుగుతోంది ఇలా.. రైతులు తీసుకువచ్చిన టమాటాలను తనకు ఇష్టమొచ్చిన కమీషన్ మండీల్లో విక్రయించేందుకు సంబంధిత కమీషన్ ఏజెంట్‌తో వ్యాపారి ముందుగానే ఒప్పందం కుదర్చుకుంటారు. ఉదాహరణకు మండీకి ఓ రైతు 50 క్రేట్లు టమాటాలు తీసుకెళ్తే కమీషన్ ఏజెంటు 10 క్రేట్లకు ఒక క్రేట్ (35 కేజీలు) జాక్‌పాట్ కింద తీసుకుంటాడు. క్రేట్‌కు లెక్కప్రకారం 30 కేజీలు భర్తీ చేయాల్సివుండగా అదనంగా ఐదు కిలోలు మండీ వ్యాపారులు తీసుకుంటున్నారు. 50 క్రేట్లకు గాను ఐదు క్రేట్లు జాక్‌పాట్ కింద ఉచితంగా తీసుకుంటాడు. వంద క్రేట్లకు పది క్రేట్లు బలవంతంగా రైతుల నుంచి కమీషన్ మండీల నిర్వాహకులు తీసుకుంటారు. వీటిని వాస్తవిక లెక్కల్లో చూపరు. ఈ కాయలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వ్యాపారి, అధికారులతోపాటు మండీల నిర్వాహకులు పంచుకుంటారు. తరుగు పేరుతో మెలిక ఒక క్రేట్ టమాటాలను రూ.500 వేలం పాటలో పాడితే రైతుకు డబ్బులు ఇచ్చే బిల్లులో తరుగు పేరుతో మెలిక పెట్టి రూ.10 నుంచి 20 తగ్గించి రూ.480 మాత్రమే అందజేస్తున్నారు. బిల్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాలని నిబంధనలు ఉన్నా ఏజెంట్లు దీన్ని 10 నుంచి 30 శాతానికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా వసూలు అయిన దాంట్లో మండీ ఓనర్‌కు క్రేట్ల బాడుగ పేరుతో రూ.5 నుంచి 10 రూపాయలు, దింపే కూలీలకు లెస్ పేరుతో మరో రూ.5, నూటికి రూ.10 కమీషన్, వ్యాపారికి రిటర్న్ కమీషన్ తీసేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా చివరగా 100కి రూ.10 కమీషన్ పట్టుకుంటూ డబ్బులు ఇచ్చే సమయంలో కాయలు నాణ్యత లేవనో, తరుగు ఉందనో ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ నింబ«ంధనలన్నీ పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలివేయడంతో కమీషన్ మండీల నిర్వాహకులకు, వ్యాపారులకు వరంగా మారింది. అంతా చట్టవిరుద్ధం మదనపల్లె టమాటా మార్కెట్లో ఈ–వేలం పద్ధతిలో టమాటాలను రైతుల నుంచి మండీల నిర్వాహకులు, వ్యాపారులు మార్కెట్ అధికారులు కలసి ముందుగానే రైతులతో సమావేశమై ఆన్లైన్ విధానంతో ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి ధరలు పలుకుతాయి. ఇలా చేయడం వల్ల రైతులు ఎక్కువ శాతం కమీషన్ నష్టపోకుండా ఉంటారు. జాక్‌పాట్ లేకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నష్టాలు ఉండవు. అయితే ఇక్కడంతా చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్లోని మండీలకు తీసుకువచ్చిన టమాటాలను ఈనాం పద్ధతిలో వేలం వేస్తున్నామని మార్కెట్ అధికారులు రికార్డుల్లో నమోదుచేస్తూ బహిరంగ వేలం ద్వారా క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ రైతులను బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మార్కెట్ అధికారులే దగ్గరుండి మరీ రైతులను ఏమార్చి నష్టపరస్తున్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా పదిహేను రోజులు గడువిచ్చాం.. ట్రేడర్ లైసెన్సులు పొందాలి. నోటీసులు ఇచ్చి రద్దుపరచినట్లు తెలియజేశాం. కమీషన్ తీసుకోకూడదని చెప్పాం. అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ యార్డులో జాట్‌పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందుకోసం త్వరలో టమాటా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. అధిక కమీషన్ వసూలుచేసే వారిపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు నివేధిస్తాం. – జగదీష్, మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ, మదనపల్లె -
షరామామూలే..!
→ టమాటా మండీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్ → టమాట మార్కెట్లో కనిపించని డిజిటల్ బోర్డుల జాడ → పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ అధికారులు అనంతపురం రూరల్ : టమాట మార్కెట్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి గ్రామ సమీపంలోని టమాట మండీ మార్కెట్ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారు. ప్రతి రోజు రైతులు టన్నుల కొద్ది టమాటలను మార్కెట్‌కు తీసుకువచ్చి మద్దతు ధర లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. టమాటను మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినాlఎవరూ పట్టించుకోవడం లేదు. మంత్రి మాటలు బేఖాతరు నెల క్రితం మంత్రి పరిటాల సునీత మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి టమాట మండీని పరిశీలించారు. టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ప్రతి మండీ ఎదుట ఏర్పాటు చేసి టమాట రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు కనీస మౌలిక వసతులను కల్పించాలని మండి నిర్వహకులకు సూచించినా వారు ఏమాత్రం పట్టించు కోలేదు. ఎక్కడ టమాట ధరలు తెలిపే బోర్డులు కూడా కనిపించడం లేదు. ఒక మండీలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు కూడా పనిచేయడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోజనంలేదు మార్కెట్‌కు టమాటలను తీసుకువచ్చే రైతులకందరికీ కనిపించే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బహిరంగ ప్రాంతంలో ధరలు తెలిపే డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఒక మార్కెట్ లోపలి భాగంలో డిజిటల్ బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. మిగిలిన మండీలకు టమాటాలను తీసుకెళ్లే రైతులకు ధరలు తెలియక వ్యాపారులు చెప్పిన ధరలకే సరుకును అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయిస్తాం: హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లలో టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. -
టమాట మార్కెట్లో ధర నాటకం
మండీ నిర్వాహకులు, వ్యాపారుల రింగ్ ఒకే రోజు బాక్సుకు రూ.150 ధర తగ్గించిన వైనం కార్యాలయం వద్ద రైతుల ధర్నా పలమనేరు : పలమనేరు టమాట మార్కెట్లో మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి టమాట ధర భారీగా తగ్గించేశారు. చుట్టుపక్కల ఉన్న మార్కెట్లతో పోలిస్తే బాక్సుకు రూ.150 దాకా వ్యత్యాసం వచ్చింది. ఆగ్రహిం చిన రైతులు మండీ యజమానులు, వ్యాపారులను నిలదీశారు. అసలేం జరిగిందంటే.. పలమనేరు మార్కెట్‌కు రోజూ సరాసరి 30 లోడ్ల టమాటాలు వస్తుంటాయి. నెల నుంచి టమాట దిగుబడి పెరిగింది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దీంతో స్థానిక మార్కెట్‌కు వచ్చి టమాటాలు కొనుగోలు చేసేవారు. అందువల్ల మదనపల్లె, కర్ణాటకలోని వడ్డిపల్లె మార్కెట్లతో సమానంగా ఇక్కడ ధర ఉండేది. ఇలా అయితే గిట్టుబాటు కాదని భావించిన స్థానిక మండీ నిర్వాహకులు, పొరుగు వ్యాపారులు కుమ్మక్కై ధరను నియంత్రించారు. రూ.వంద వ్యత్యాసం.. మండీ నిర్వాహకులు, వ్యాపారులు కలిసి అనంతపురం జిల్లా నుంచి పది లోడ్ల టమాటాలు పలమనేరు మార్కెట్‌కు ఓ పథకం ప్రకారం తీసుకొచ్చారు. స్థానికంగా మరో 25 లోడ్లు మార్కెట్‌కు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చిన టమాటాలు ఇక్కడి రైతులకు చూపెట్టి ఉన్నట్టుండి సరుకు భారీగా వచ్చేసిందని, అమాంతం ధర తగ్గించేశారు. సోమవారం కర్ణాటక రాష్ర్టం వడ్డిపల్లె మార్కెట్లో బాక్సు రూ.450 పలికింది. మదనపల్లెలోనూ దాదాపుగా అంతే పలికింది. ఆదివారం కూడా స్థానిక మార్కెట్లో రూ.380 పలికిన ధర వ్యాపారుల రింగుతో రూ.230కు పడిపోవడం తో రైతులు అవాక్కయ్యారు. రైతుల ఆగ్రహం స్థానికంగా ధర తగ్గించేందుకు వ్యాపారులు ఆడిన నాటకాన్ని రైతులు గుర్తించారు. ఏడాది పొడవునా తమ వద్ద కమీషన్లు తీసుకుంటూ ఈ విధంగా అన్యాయం చేయడం తగదంటూ మండీ నిర్వాహకులపై, వ్యాపారులపై మండిపడ్డారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గతంలోనూ కొన్నిసార్లు ఇదేవిధంగా ధర తగ్గించేశారని మార్కెట్ కమిటీ కార్యదర్శి సరళకుమారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా నుంచి రైతులు ఇక్కడికొచ్చి అమ్ముకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ధర తగ్గించడానికి నాటకమాడిన వ్యాపారుల లెసైన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.