
Tomato Farming Business In India: గత కొన్ని రోజులుగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుల ఆశలు చిగురించాయి. టమాటాలు పండించిన రైతులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. కావున ఏదైనా బిజినెస్ చేసి మంచి లాభాలను పొందాలనుకునే వారికి టమాటా సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
నేడు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే కేవలం కంపెనీలు ప్రారభించడమో, లేకుంటే లెక్కకు మించిన డబ్బు వెచ్చించి ఇతర వ్యాపారాలు చేయడమనేది మాత్రమే ఏకైక మార్గం కాదు.. ఆధునిక కాలంలో వ్యవసాయం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చని కొంతమంది చెబుతున్నారు, మరి కొందరు నిరూపిస్తున్నారు. ఇటీవల టమాటాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న రైతులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము.
నిజానికి దేని అవసరం ఎప్పుడు ఉంటుందో.. ఉండదో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ప్రతి రోజు టమాటాల అవసరం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం టమాటా కూరలకు మాత్రమే కాకూండా సాస్, పిజ్జా వంటి వాటిలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కావున సరైన పద్దతిలో టమాటా సాగు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయన్నది నిజం.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది టమాట సాగు చేస్తారు. ఒక హెక్టారులో వివిధ రకాలకు లోబడి 800 నుంచి 1200 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సరైన వ్యవసాయ పద్ధతులతో, ఈ పంటను పండించడం ద్వారా బంపర్ లాభాలను పొందవచ్చు.
(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)
టమాట సాగు సంవత్సరానికి రెండు సార్లు చేసుకోవచ్చు. జూలై & ఆగస్టు నుంచి ఫిబ్రవరి-మార్చి వరకు.. నవంబర్ & డిసెంబర్ నుంచి మొదలై జూన్-జూలై వరకు ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో 15,000 మొక్కలను పెంచవచ్చు. 2 నుంచి 3 నెలల వ్యవధిలో టమాటాలు రావడం మొదలవుతాయి. కొన్ని సార్లు పంట దిగుబడి తగ్గినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఆశించిన లాభాలను పొందవచ్చు.
(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)
ప్రస్తుతం మన దేశంలో కేజీ టమాటాల ధర రూ. 120 వరకు ఉంది. దీంతో రైతులు ఊహకందని మంచి లాభాలను పొందగలుగుతున్నారు. టమాట సాగు చేసే రైతు సగటున కేజీ రూ. 10కి విక్రయిస్తే 1000 క్వింటాళ్లకు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. కావున టమాట సాగుతో కూడా తప్పకుండా లాభాలను పొందే అవకాశాలు చాలానే ఉన్నాయి.