రేపు వడుప్సా కరస్పాండెంట్లకు సన్మానం
విద్యారణ్యపురి : వడుప్సా ఏర్పా టు 36 ఏళ్లయిన సందర్భంగా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 25న హన్మకొండలోని అలకనంద గార్డెన్ లో నిర్వహించనున్నామని వడుప్సా జిల్లా అధ్యక్షు డు బుచ్చిబాబు వెల్లడించారు.
శుక్రవారం హన్మకొండలోని వడు ప్సా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడుతూ ఆదివారం టీచర్స్‌డేను కూడా జరుపుకుంటున్న సందర్భంగా ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. వడుప్సా చేపట్టిన కార్యక్రమాలు, సమస్యలపై చర్చించడంతో పాటు కార్యాచరణపై సమావేశంలో తీర్మానించనున్నట్లు పేర్కొన్నారు. వడుప్సా జిల్లా జనరల్ సెక్రటరీ దేవేందర్‌రెడ్డి, శ్రీధర్, బాధ్యులు చక్రపాణి, రామచంద్రమూర్తి, పాల్గొన్నారు.