tonk
-
మృగాళ్ల పైశాచికత్వం: చిన్నారిని హింసించి..
జైపూర్ : దేశ వ్యాప్తంగా మానవమృగాలు రెచ్చిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు పిచ్చికుక్కల్లా వెంటపడుతూ అకృత్యాలకు ఒడిగడుతున్నాయి. దేశమంతా దిశా పాశవిక హత్య గురించి నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ రాజస్తాన్‌లో ఓ చిన్నారి అత్యంత దారుణ పరిస్థితుల్లో శవమై తేలింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అంతమొందించారు. వివరాలు.. టోంక్ జిల్లా ఖేతడి గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో శనివారం స్కూళ్లో ఆటలపోటీలు ఉండటంతో తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపింది. అయితే మధ్యాహ్నం మూడు గంటలు దాటినా సదరు చిన్నారి ఇంటికి రాకపోవడంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమె కోసం స్కూల్ సహా బంధువుల ఇళ్లల్లో వెదికారు. అయినప్పటికీ చిన్నారి జాడ తెలియరాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చిన్నారి తన గ్రామానికి సమీపంలో పొదల్లో శవమై కనిపించింది. యూనిఫాం మొత్తం రక్తపు మరకలతో నిండి ఉండగా.. స్కూలు బెల్టు మెడకు చుట్టి ఉంది. ఘటనాస్థలంలో మందు బాటిళ్లు, స్నాక్స్ కూడా లభించడంతో మద్యం మత్తులోనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నారిపై అత్యాచారం చేసిన అనంతరం... దుండగులు బెల్టుతో తన మెడకు ఉరి బిగించి హత్య చేశారని తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని.. త్వరితగతిన కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు. ఇక చిన్నారి అత్యాచారం, హత్య గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితులను తొందరగా అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాజస్థాన్‌లో బీజేపీ వ్యూహాత్మక మార్పు
-
సచిన్‌పై యూనస్ ఖాన్ పోటీ!
జైపూర్ : ఉత్కంఠ పోరుకు వేదికగా మారిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న పీసీసీ చాఫ్ సచిన్ పైలెట్‌పై ముస్లిం నేత, మంత్రి యూనిస్ ఖాన్‌ను బరిలో దింపింది. రాజస్తాన్‌లో అత్యధికంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన టోంక్ స్థానంలో వీరిద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలమైన క్యాడర్ ఉన్న ఈ స్థానంలో 1972 నుంచి ముస్లిం అభ్యర్థినే బరిలో నిలుపుతూ వచ్చింది. బీజేపీ కూడా గత నాలుగు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థినే పోటీలో నిలిపేంది. కాగా నలభై ఆరేళ్ల తరువాత కాంగ్రెస్ తొలిసారి ముస్లిమేతరులకు టికెట్ కేటాచించడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. దీంతో ఈ నియోజకవర్గంపై రాజకీయం రసవత్తరంగా మారింది. నలభైఏళ్ల సాంప్రదాయానికి చెక్‌పెట్టిన కాంగ్రెస్ సచిన్‌ను బరిలోకి దింపడంతో.. చివరి నిమిషంలో తేరుకున్న బీజేపీ మైనార్టీల ఓట్లను దండకుంనేందుకు ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపింది. యూనిస్ ఖాన్ వసుంధర ప్రభుత్వంలో రవాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సోమవారం నామిషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. -
ఏటీఎంలో డబ్బుల వర్షం
జైపూర్: డీమానిటైజేషన్, నగదు కొరతతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు రాజస్థాన్ లోని ఒక ఏటీఎం డబ్బుల వర్షం కురిపించడం కలకలం రేపింది. రాజధాని జైపూర్ కు సమీపంలోని టాంక్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఏంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తుల్ని లక్కీస్టార్స్ ని చేసేసింది. అడిగిన దానికంటే ఎక్కువగా భారీ మొత్తంలో నగదును అందించింది. దీంతో ఏటిఎం కేంద్రానికి వచ్చిన ప్రజలు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులో రావడంతో భలే చాన్సులే.. లల..లల. లక్కీ ఛాన్స్ లే అంటూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అయితే 100 నోట్లకు బదులుగా రెండు వేల నోట్లు జారీ కావడంతో ఈ పరిణామం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే జితేష్ దివాకర్ ఏటీఎంకు వెళ్లి.. 3500 కావాలని టైప్ చేశాడు. కానీ రూ 3,500 స్థానంలో రూ 70వేలు రావడంతో షాకయ్యాడు. దాదాపు ఇదే అనుభవం మిగిలినవారికి కూడా ఎదురైంది. అయితే ఏటీఎం మిషీన్ లో లోపాన్ని తండ్రి, ఇతర బంధువులకు చేరవేశాడు దివాకర్. వారు బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందించడంతో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే ఏటీఎంను మూసివేశారు. కానీ అప్పటికే రూ.6.76 లక్షలు విత్ డ్రా అయిపోయాయి. రూ.100 నోట్ల స్లాట్ లో రూ.2 వేల నోట్లను లోడ్ చేయడం వల్ల లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రతినిధి హరిశంకర్ మీనా తెలిపారు. కానీ సాధారణంగా ఇలా జరగదనీ, సాంకేతికంగా రూ 100 కేసెట్ లో రూ 2వేల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదని అందుకే ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. అలాగే ఏటీఎం మెషీన రికార్డుల అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి సహకారంతో నగదును ఖాతాదారులనుండి తిరిగి రాబడతామ చెప్పారు. దివాకర్ ఒక్కరే తమకు సమాచారం అందించాడనీ.. మిగిలినవారు అదనపు నగదు తో ఇంటికి వెళ్లి మిన్నకుండిపోయారని మీనా వ్యాఖ్యానించారు. -
మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది!
-
బంగారు నాణేలు.. తవ్వుకునేందుకు జనాల పోటీ!
నది ఒడ్డున ఉన్న ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ కొందరికి బంగారు నాణేలు దొరికియట. ప్రాచీనకాలంలో పాతిపెట్టిన గుప్తనిధికి సంబంధించిన ఆ బంగారు నాణెముల్లో రాజు లేదా దేవుడి ప్రతిమ, మహిళ, నెమలీ ప్రతిమలు ఉన్నాయని, అవి మాకు దొరికాయంటూ కొందరు వాట్సప్‌లో ఆ ఫొటోలు కూడా పెట్టారు. ఇంకేముంది ఆ నోటా ఈ నోటా ఈ వార్త దావాహనంలా పాకింది. తెల్లారిలేచేసరికి స్థానిక గ్రామస్తులు అంతా ఆ నది ఒడ్డుకు వెళ్లి ఉత్త చేతులతో తవ్వడం మొదులుపెట్టారు. దీంతో ఆ నది ప్రాంతమంతా జాతరలా మారిపోయింది. ఎటుచూసినా ప్రజలు రోజుల తరబడి గుంతలు తవ్వుతూనే ఉన్నారు. బంగారు నాణెలు తమకు దొరకకపోతాయా అన్న ఆశతో గ్రామస్తులు తవ్వుతూనే ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని టాంక్ అనే మారుమూల గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సమీపంలో ఉన్న నది ఒడ్డున బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న వదంతులు వచ్చాయి. ఈ బంగారు నాణెలకు సంబంధించిన ఫొటోలు సైతం వాట్సాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. గ్రామస్తులందరినీ వాకబు చేసినా.. ఎవరూ తమకు బంగారు నాణెం దొరికిందని చెప్పలేదు. ఎవరో దుండగులు కావాలని వదంతులు రేపినట్టు గుర్తించిన పోలీసులు.. వాట్సాప్‌లో ఫొటోలు పెట్టిన నలుగురు వ్యక్తుల్ని అరెస్టుచేశారు. అయినా.. ఆ నది ఒడ్డున గత మూడు రోజులుగా గ్రామస్తులు తవ్వడం మాత్రం ఆపలేదు.