Top Heroines
-
Actresses: కథానాయికల క్యాలెండర్.. బిజీ బిజీ
హీరోలు దాదాపు ఒకే భాషకు పరిమితం అవుతారు. అయితే హీరోయిన్లు పలు భాషల్లో నటిస్తుంటారు. అందుకే కొందరు కథానాయికలు కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి డైరీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని అవకాశాలు వస్తాయి. మరి.. ఈ ఏడాది క్యాలెండర్లో ఏ హీరోయిన్ డైరీలో ఎన్ని చిత్రాలున్నాయో తెలుసుకుందాం. అనుష్క: అనుష్క లీడ్ రోల్లో రూపొందిన ‘నిశ్శబ్దం’ సినిమా 2020 అక్టోబర్ 2న రిలీజైంది. ఆ తర్వాత రెండేళ్లు ఆమె తెరపై కనిపించలేదు. దాంతో అనుష్క నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపి, అందర్నీ ఆశ్చర్యపరిచారు అనుష్క. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంతో బిజీగా ఉన్నారు అనుష్క. త్రిష: ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘సదురంగ వేట్టె 2, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్’ వంటి తమిళ చిత్రాలతో పాటు మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘రామ్’ ఉన్నాయి. ఇక 2016లో విడుదలైన ‘నాయకి’ తర్వాత త్రిష తెలుగులో నేరుగా ఏ సినిమాలోనూ నటించలేదు. తమన్నా: ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘బోళా శంకర్’, తమిళ్లో రజనీకాంత్ సరసన ‘జైలర్’, మలయాళంలో ‘బాంద్రా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బోలే చూడియా’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాజల్ అగర్వాల్: ఈ ఏడాది నాలుగు సినిమాలతో అలరించనున్నారు కాజల్. ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘కురుంగాప్పియమ్, ఘోస్టీ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. హిందీలో చేసిన ‘ఉమ’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) చిత్రంలో నటిస్తున్నారు. నయనతార: గత ఏడాది తెలుగులో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటించిన నయనతార ఈ ఏడాది తెలుగు సినిమాలేవీ కమిట్ కాలేదు. హిందీ చిత్రం ‘జవాన్’లో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్నారామె. బాలీవుడ్లో నయనకి ఇది తొలి చిత్రం. తమిళంలో ‘ఇరైవన్’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతీహాసన్: ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో అలరించారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌కి జోడీగా ‘సలార్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుంది. మరోవైపు ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నారు శ్రుతీహాసన్. కీర్తీ సురేశ్: ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు. కీర్తీ సురేశ్. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు కీర్తి. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ్లో ‘మామన్నన్, సైరన్, రఘు తాతా, రివాల్వర్ రీటా’ వంటి చిత్రాలతో జోరుగా ఉన్నారు కీర్తీ సురేశ్. పూజా హెగ్డే: గత ఏడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన పూజా హెగ్డే ప్రస్తుతం ఒక తెలుగు, మరో హిందీ సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా నటిస్తున్నారామె. అలాగే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. రష్మికా మందన్న: కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా ఈ సంక్రాంతికి ‘వారీసు’ (‘వారసుడు) తో తెరపైకి వచ్చారు. అలాగే హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ శుక్రవారం రిలీజైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ సరసన హిందీ చిత్రం ‘యానిమల్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. కృతీ శెట్టి: గత ఏడాది ‘బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కృతి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్య సరసన ఆమె నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ‘అజయింటే రందం మోషణం’ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. శ్రీలీల: దక్షిణాదిలో దూసుకెళుతున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఈ బ్యూటీ గత ఏడాది ‘ధమాకా’లో కనిపించారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్నారు. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు ‘అనగనగా ఒకరాజు, జూనియర్ (తెలుగు–కన్నడ) వంటి సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారీ బ్యూటీ. అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతీ సనన్ అటు తెలుగు, ఇటు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో దీపికా పదుకోన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్లో ఆమె నటించిన ‘పఠాన్’ ఈ నెల 25న రిలీజ్ కానుండగా, ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్–కియారా జంటగా నటిస్తున్న చిత్రమిది. అలాగే ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు కియారా. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్’లో హీరోయిన్గా నటించారు కృతీ సనన్. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. హిందీలో ‘షెహజాదా, గణపత్’తో పాటు మరో సినిమా చేస్తున్నారు కృతీ సనన్. సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’లో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు సమంత. మరోవైపు ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అయితే మయోసైటిస్ వ్యాధి చికిత్సలో భాగంగా ఆరు నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారామె. ఇప్పుడు కోలుకున్న సమంత ముంబైలో ‘సిటాడెల్’ షూట్లో పాల్గొంటున్నారు. సమంతకు పేరు తెచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ 2’ వెబ్æసిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి దర్శకులు. -
2022 లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ?
-
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
మేకప్ లేకుండా ఈ స్టార్ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్‌తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఎప్పుడు మేకప్‌తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, అలియా భట్, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్‌తో, మేకప్ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి. ఐశ్వర్యరాయ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ దీపికా పదుకొనే విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ ప్రియాంక చొప్రా విత్ అవుట్ మేకప్- విత్ మేకప్ అలియా భట్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అనుష్క శర్మ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ జాక్వేలిన్ ఫెర్నాండేజ్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ కరీనా కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సోనమ్ కపూర్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ నర్గిస్ ఫఖ్రీ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ అమీషా పటేల్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ సుష్మిత సేన్ విత్ అవుట్ మేకప్-విత్ మేకప్ -
హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి?
హీరోయిన్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. ఆ సెట్ నుంచి ఈ సెట్‌కి.. ఈ సెట్ నుంచి ఆ సెట్‌కి వెళ్తూ బిజీబిజీగా ఉంటారు. లాక్డౌన్లో షూటింగ్స్ మాత్రమే ఆగిపోయాయి. కొత్త కథలు తయారవుతూనే ఉన్నాయి. కొత్త సినిమాలు కమిట్ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? సెట్స్‌లో ఉన్న, పూర్తయిన, విడుదలకు సిద్ధమైన చిత్రాలతో ఒక్కో స్టార్ డైరీ ఎలా ఉంది? ఓ లుక్కేద్దాం. తమన్నా: వెంకటేశ్‌తో ‘ఎఫ్ 3’, నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్. గోపీచంద్‌తో ‘సీటీమార్’, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’. కాజల్ అగర్వాల్: చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్ళు’, దుల్క ర్తో ‘హే సినామిక’ (పూర్తయింది), తమిళంలో రెండు హారర్–కామెడీ చిత్రాలు కమిటయ్యారు. కీర్తీ సురేశ్: మహేశ్‌బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, నితిన్‌తో ‘రంగ్ దే’, నితిన్‌తో ‘పవర్ పేట’, ఆదితో ‘గుడ్ లక్ సఖీ’ (పూర్తయింది), తమిళంలో సెల్వ రాఘవన్‌తో ‘సాని కాయిదమ్’. రకుల్ ప్రీత్ సింగ్: నితిన్‌తో ‘చెక్’ (పూర్తయింది). కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా, హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’, ‘మే డే’, ‘థ్యాంక్ గాడ్’. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘అయలాన్’. సాయి పల్లవి: రానాతో ‘విరాట పర్వం’, నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ (పూర్తయింది), నానీతో ‘శ్యామ్ సింగరాయ్’. లావణ్యా త్రిపాఠి: సందీప్ కిషన్‌తో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’. శ్రుతీహాసన్: ‘క్రాక్’ (రేపే విడుదల). పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ నిత్యా మీనన్: సత్యదేవ్‌తో ‘స్కై ల్యాబ్’ చిత్రం, అశోక్ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా’, మలయాళంలో ‘కులంబీ’. నిధీ అగర్వాల్: గల్లా అశోక్‌తో ఓ తెలుగు సినిమా, తమిళంలో శింబుతో ‘ఈశ్వరన్’, ‘జయం’ రవితో ‘భూమి’ సినిమాలు పూర్తయ్యాయి. నివేదా థామస్: ‘వకీల్ సాబ్’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా. సమంత: గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుం తలం’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్’ చేస్తున్నవి. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కమిటయ్యారని టాక్. రష్మికా మందన్నా: అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, కార్తీతో ‘సుల్తాన్’ (పూర్తయింది), హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ’మిషన్ మజ్ను’, అమితాబ్‌తో ‘డెడ్లీ’. కన్నడంలో ‘పొగరు’ (పూర్తయింది). పూజా హెగ్డే: ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, దుల్కర్–హను రాఘవపూడి సినిమా, హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీపావళి’, రణ్వీర్తో ‘సర్కస్’. రాశీ ఖన్నా: తమిళంలో విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’, ఆర్యతో ‘అరణ్మణై’. షాహిద్‌తో హిందీలో ఓ వెబ్ సిరీస్. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా కమిటయ్యారట. నయనతార: తమిళంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్, నెట్రిక్కన్’, మలయాళంలో ‘నిళల్, పాట్టు’. రీతూ వర్మ: నానీతో ‘టక్ జగదీష్’, శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రం, నాగ శౌర్యతో ‘వరుడు కావలెను’, అశోక్ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా, తమిళంలో విక్రమ్‌తో ‘ధృవ నక్షత్రం’. నభా నటేశ్: నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, ‘అల్లుడు అదుర్స్’ (సంక్రాంతికి విడుదల కానుంది). పాయల్ రాజ్‌పుత్: తెలుగులో లేడీ ఓరియంటెడ్ ‘5డబ్ల్యూస్’, తమిళంలో ‘ఏంజెల్’. ప్రియమణి: ‘నారప్ప, కొటేషన్ గ్యాంగ్’. అంజలి: పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. రెజీనా: విశాల్‌తో ‘చక్ర’, ‘నేనేనా’, అరవింద్ స్వామితో ‘కల్లాపాట్’. అదితీ రావ్ హైదరీ: శర్వానంద్‌తో ‘మహా సముద్రం’, తమిళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘హే సినామిక’ (పూర్తయింది), హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’. అనుపమా పరమేశ్వరన్: నిఖిల్‌తో ‘18 పేజెస్’ మెహరీన్: ‘ఎఫ్ 3’. నివేదా పేతురాజ్: సాయిధరమ్–దేవా కట్టా సినిమా. ఈషా రెబ్బా: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, తమిళ సినిమా ‘ఆయిరమ్ జన్మంగళ్’. శ్రద్ధా శ్రీనాథ్: సిద్ధు జొన్నలగడ్డతో ‘నరుడి బ్రతుకు నటన’, విశాల్‌తో ‘చక్ర’ (పూర్తయింది) ఐశ్వర్యా రాజేష్: నానీతో ‘టక్ జగదీష్’. -
నాయకి 2015
-
ఆ హీరోయిన్స్ ఖాళీగా ఎందుకున్నారు
-
ఆయన అండ ఉంటే చాలు!
సెక్సీ స్టార్ సన్నీ లియోన్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్స్‌ని పక్కనబెట్టి ఆమె నం.1గా నిలిచారు. ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో జరిపిన ఈ సర్వేపై సన్నీ స్పందిస్తూ -‘‘నాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నాను. మిగిలిన వాళ్లకెలా ఉన్నా... ఎంత వయసొచ్చినా నా భర్త డేనియల్‌కు మాత్రం ఎప్పటికీ మోస్ట్ డిజైరబుల్గా మిగిలిపోవాలని ఆశ. నేను ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో స్థిరపడుతున్నా. నా భర్త ప్రోత్సాహంతోనే ఇంతవరకూ రాగలిగాను. ఆయన అండ ఉంటే చాలు’’ అని చెప్పారు. ‘‘నిర్మాత ఏక్తా కపూర్‌తో మీకు గొడవ జరిగిందటగా?’’ అనడిగితే ‘‘అలాంటిదేం లేదు. నాకు ఆమె అంటే చాలా గౌరవం. ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ చిత్రం గురించి ఆమె నన్ను సంప్రతించారు. కానీ అందులో హద్దుమీరే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇది వరకే నేను అలాంటి చిత్రాలు చాలా చేశాను. మళ్లీ ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకుని ఆ చిత్రానికి నో చెప్పాను. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు ’’ అని చెప్పారు. -
రివర్స్ గేర్‌లో బాలీవుడ్ ఆశలు