దోపిడీకి యత్నించిన ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్
జల్సాలకు అలవాటు పడి స్నేహితులతో కలిసి బంధువుల ఇంట్లోనే దోపిడీకి యత్నించిన ఏడుగురు సభ్యుల ముఠాను మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేటలోని సలీంనగర్‌కు చెందిన ప్రియంతోష్నివాల్ బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ తోష్నివాల్ దొంగతనం చేసేందుకు పథకం రూపొందించాడు. తన ఇంటి సమీపంలో ఉండే దూరపు బంధువు రతన్‌దేవి తోష్నివాల్ను టార్గెట్ చేశారు.
గోషామహల్‌కు చెందిన సూరబ్ అగర్వాల్, రేఖా అగర్వాల్, తీగలగూడకు చెందిన మహ్మద్ జాఫర్, అంబర్‌పేటకు చెందిన ఫిరోజ్ ఖాన్, హర్షల్ శర్మ, మలక్‌పేట్‌కు చెందిన మహ్మద్ అతిక్, మహ్మద్ సైఫ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 29న రతన్ దేవి ఇంటికి పెళ్లి సంబంధం సాకుతో ఇంటిలోనికి ప్రవేశించారు. అదను చూసి రతన్‌దేవి నోరుకు ప్లాస్టర్ వేసి దోపిడీకి యత్నించారు.
ఆ సమయంలో బాత్రూం నుంచి బయటకు వచ్చిన రతన్ దేవి కుమారుడు యాష్ తోష్నివాల్ సంఘటనను గమనించి కేకలు వేయడంతో ఆగంతకులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చే శారు. సంఘటన జరిగిన ఇంటి సమీపంలో సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, అనంతరం చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైక్‌లు, 7 సెల్ఫోన్లు స్వాధీన పరుచకున్నట్లు తూర్పు మండల డీసీపీ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు.