tour details
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.శనివారం (ఆగస్ట్31)ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్‌కి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవనున్నారు. పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.అక్కడి నుంచి అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
-
మీరంతా ఎక్కడికెళ్లారో చెప్పండి: ప్రధాని
గడిచిన మూడు నెలల్లో కేంద్ర మంత్రులంతా ఎక్కడెక్కడకి వెళ్లారో ఆ వివరాలన్నీ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు తదితర ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా వాళ్లు ఏమైనా ప్రచారం చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికే ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులకు ఈ విషయం చెప్పారు. సోమవారానికల్లా మొత్తం వివరాలన్నీ ఇవ్వాలని మోదీ ఆదేశించారు. ఈ వివరాలను అందరు మంత్రుల నుంచి తీసుకుని ప్రధానికి సమర్పించాల్సిన సమన్వయ బాధ్యతలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు అప్పగించారు. గత మూడు నెలల్లో ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారన్న వివరాలు చెప్పాలని, ఒకవేళ ఢిల్లీలోనే ఉండి ఎక్కడకూ వెళ్లకపోతే తమ మంత్రిత్వశాఖ కార్యాలయాలకు వెళ్లారో లేదో కూడా చెప్పాలని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా ప్రచారం చేశారో లేదో తెలుసుకోవాలని ప్రధాని భావిస్తున్నారని, అదే సమయంలో వాళ్లు ఆఫీసు పని, క్షేత్రస్థాయిలో విధుల మధ్య సమన్వయం ఎలా చేసుకుంటున్నారో చూస్తారని అంటున్నారు. దీంతో మొత్తమ్మీద కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవాళ్లలో ఎవరెవరు ఏమేం చేశారన్న వివరాలను ప్రధాని సమీక్షిస్తారని తేలిపోయింది. -
సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించిన బాబు
-
జగన్,విజయమ్మ,షర్మిల పర్యటన షెడ్యూల్
-
చంద్రబాబు పర్యటన వివరాలు
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. అయోధ్య మైదానంలో జరిగే ప్రజాగర్జనకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి పార్టీ జిల్లా నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 15 నిమిషాల విశ్రాం తి అనంతరం 2.30 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి మీదుగా బాలాజీ కూడలికి చేరుకుంటారు. అక్కడి నుంచి సత్య కళాశాల మీదుగా కోటకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్తారు. సింహాచలం మేడ వద్ద తెలుగు యువత, తెలుగు మహిళా విభాగం ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు సభ జరుగుతుంది. 7.30 నుంచి 9 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని నియోజవర్గాల వారీగా నాయకులతో చర్చిస్తారు.