Tour finalized
-
కేసీఆర్ అమరావతి పర్యటన ఖరారు
-
సీఎం పర్యటన ఖరారు
14న సాయంత్రం జిల్లాకు రాక 15న రైతులతో సమావేశం పోలవరం ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించనున్న సీఎం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష ఏలూరు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సీఎం ఈ నెల 14న మధ్యాహ్నం 3.45 గంటలకు వెలిగొండ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి పోలవరం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ పనులు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల పరిస్థితి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు, వివిధ ప్రాజెక్టుల ప్రగతి, నీరు-చెట్టు పతకం అమలు తీరుపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. 14న రాత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఆయన బస చేస్తారు. 15న ఉదయం 8.30 గంటలకు పట్టిసీమ చేరుకుని ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ పనులను పరిశీలిస్తారు. ఉదయం 9. 30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కొవ్వాడ చే రుకుని అవుట్‌ఫాల్ స్లూయిజ్ రెగ్యులేటర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ రైతులతో సమావేశం అవుతారు. ఉదయం 11గంటలకు పట్టిసీమ చేరుకుని హెలికాప్టర్లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళతారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కె.భాస్కర్ సోమవారం సమీక్షించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, ఆర్అండ్ బీ ఎస్ఈ పి.శ్రీమన్నారాయణ, పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ బీఎస్ శ్రీనివాస్ యాదవ్, ఇరిగేషన్ ఎస్ఈ ఎన్వీ రమణ, పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎ.శ్యామ్‌ప్రసాద్, జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరీ, ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భరత్ పాల్గొన్నారు. -
సీఎం జిల్లా పర్యటన ఖరారు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 10న ఉదయం 10.35 గంటలకు కాశీబుగ్గలోని డీఎస్పీ కార్యాలయ హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 10.55 గంటలకు కాశీబుగ్గలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.25 గంటలకు పలాసలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించే ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి 2.25 గంటలకు బయల్దేరి 2.55 గంటలకు జలుమూరు మండలం చిన్నదుగాం గ్రామానికి చేరుకుంటారు. 3.00 గంటలకు జలుమూరు మండలం రాణ గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటలకు చల్లవానిపేట గ్రామంలో ‘జన్మభూమి- మాఊరు’ లో పాల్గొంటారు. అక్కడి నుంచి 5.15 గంటలకు చిన్నదూగాం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని సాయంత్రం 5.45 గంటలకు శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. -
సీఎం టూర్ ఖరారు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు నరసన్నపేట, శ్రీకాకుళం, రెండో రోజు రణస్థలం మండలంలో బిజీబిజీగా గడపనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ టూర్ షెడ్యూల్ 17న నరసన్నపేట మండలం జమ్ము గ్రామం వద్ద ఉన్న శాలివాహన స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్లో చేరుకుంటారు. 10.40 గంటల నుంచి 11.10 వరకు తామరాపల్లి ప్రజలతో మాట్లాడతారు. 11.15 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రైతు, ఉపాధిహామీ కూలీలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని రోడ్డు మార్గంలో 2.35 గంటలకు కోమర్తి, అక్కడి నుంచి 3.15 గంటలకు సింగుపురం ప్రజలతో ముచ్చటిస్తారు. 4.05 గంటలకు శ్రీకాకుళం ఆర్అండ్బీ వసతి గృహానికి చేరుకుని..4.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 4.40 గంటలకు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల మైదానంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7.40 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో రాత్రి 9.10 గంటల వరకు సమీక్ష నిర్వహించారు. 18న ఉదయం 9.10 గంటలకు అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి 9.40 గంటలకు ఆర్అండ్బీ బంగ్లాకు చేరుకొని పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం 10.10 గంటలకు డచ్ భవనం వద్ద పర్యాటక శాఖకు సంబంధించి ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్కడే మొబైల్ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 10.50 గంటలకు హెలికాప్టర్లో రణస్థలం మండలం పిసిని గ్రామం వద్దకు చేరుకుంటారు. 11.10 గంటలకు దరిశం గ్రామం వద్ద వికెటి ఫార్మాను ప్రారంభించి, అక్కడే పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం 1.40 గంటలకు రోడ్డుమార్గంలో పతివాడపాలెం గ్రామస్తులతో మాట్లాడతారు. పిసినిలో 2.15 గంటలకు డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో విశాఖపట్నం వెళ్తారు. అయితే సీఎం పర్యటనపై సోమవారం నాటికి మరిం త స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.