సీఎం పర్యటన ఖరారు | CM Chandrababu Naidu tour finalized | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఖరారు

Published Tue, May 12 2015 2:32 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM Chandrababu Naidu tour finalized

14న సాయంత్రం జిల్లాకు రాక
     15న రైతులతో సమావేశం
     పోలవరం ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించనున్న సీఎం
     ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

 
 ఏలూరు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సీఎం ఈ నెల 14న మధ్యాహ్నం 3.45 గంటలకు వెలిగొండ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పోలవరం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ పనులు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల పరిస్థితి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు, వివిధ ప్రాజెక్టుల ప్రగతి, నీరు-చెట్టు పతకం అమలు తీరుపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. 14న రాత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఆయన బస చేస్తారు. 15న ఉదయం 8.30 గంటలకు పట్టిసీమ చేరుకుని ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ పనులను పరిశీలిస్తారు.
 
  ఉదయం 9. 30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కొవ్వాడ చే రుకుని అవుట్‌ఫాల్ స్లూయిజ్ రెగ్యులేటర్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ రైతులతో సమావేశం అవుతారు. ఉదయం 11గంటలకు పట్టిసీమ చేరుకుని హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళతారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కె.భాస్కర్ సోమవారం సమీక్షించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
 
  జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, ఆర్‌అండ్ బీ ఎస్‌ఈ పి.శ్రీమన్నారాయణ, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ బీఎస్ శ్రీనివాస్ యాదవ్, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎన్‌వీ రమణ, పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్యామ్‌ప్రసాద్, జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరీ, ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్ భరత్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement