సీఎం టూర్ ఖరారు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజు నరసన్నపేట, శ్రీకాకుళం, రెండో రోజు రణస్థలం మండలంలో బిజీబిజీగా గడపనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ టూర్ షెడ్యూల్
17న నరసన్నపేట మండలం జమ్ము గ్రామం వద్ద ఉన్న శాలివాహన స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 10.40 గంటల నుంచి 11.10 వరకు తామరాపల్లి ప్రజలతో మాట్లాడతారు. 11.15 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రైతు, ఉపాధిహామీ కూలీలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని రోడ్డు మార్గంలో 2.35 గంటలకు కోమర్తి, అక్కడి నుంచి 3.15 గంటలకు సింగుపురం ప్రజలతో ముచ్చటిస్తారు. 4.05 గంటలకు శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ వసతి గృహానికి చేరుకుని..4.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 4.40 గంటలకు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల మైదానంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7.40 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో రాత్రి 9.10 గంటల వరకు సమీక్ష నిర్వహించారు.
18న
ఉదయం 9.10 గంటలకు అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి 9.40 గంటలకు ఆర్‌అండ్‌బీ బంగ్లాకు చేరుకొని పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం 10.10 గంటలకు డచ్ భవనం వద్ద పర్యాటక శాఖకు సంబంధించి ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్కడే మొబైల్ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 10.50 గంటలకు హెలికాప్టర్‌లో రణస్థలం మండలం పిసిని గ్రామం వద్దకు చేరుకుంటారు. 11.10 గంటలకు దరిశం గ్రామం వద్ద వికెటి ఫార్మాను ప్రారంభించి, అక్కడే పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం 1.40 గంటలకు రోడ్డుమార్గంలో పతివాడపాలెం గ్రామస్తులతో మాట్లాడతారు. పిసినిలో 2.15 గంటలకు డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో విశాఖపట్నం వెళ్తారు. అయితే సీఎం పర్యటనపై సోమవారం నాటికి మరిం త స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.