సీఎం జిల్లా పర్యటన ఖరారు | Andhra Pradesh CM Chandrababu Naidu Srikakulam District tour finalized | Sakshi
Sakshi News home page

సీఎం జిల్లా పర్యటన ఖరారు

Published Wed, Oct 8 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

సీఎం జిల్లా పర్యటన ఖరారు

సీఎం జిల్లా పర్యటన ఖరారు

 శ్రీకాకుళం పాతబస్టాండ్:  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.   10న ఉదయం 10.35 గంటలకు కాశీబుగ్గలోని డీఎస్పీ కార్యాలయ హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 10.55 గంటలకు కాశీబుగ్గలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో  పాల్గొంటారు. 11.25 గంటలకు పలాసలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించే ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి 2.25 గంటలకు బయల్దేరి  2.55 గంటలకు జలుమూరు మండలం చిన్నదుగాం గ్రామానికి చేరుకుంటారు. 3.00 గంటలకు జలుమూరు మండలం రాణ గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటలకు చల్లవానిపేట గ్రామంలో ‘జన్మభూమి- మాఊరు’ లో పాల్గొంటారు. అక్కడి నుంచి 5.15 గంటలకు చిన్నదూగాం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని సాయంత్రం 5.45 గంటలకు శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement