tourisam spots
-
వెళితే మడమ తిప్పలేం
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతిసిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ.. సాగరుడితో జతకట్టేందుకు వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ.. చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలుపోతున్నట్టు వినసొంపైన పక్షుల కిలాకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలాహిరిలో అంటూ కడలి తీరానికి సాగే పడవ ప్రయాణం.. సముద్ర జలాల మధ్యలో చూసితీరాల్సిన అందాల దీవి.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్టు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు స్వాదించాలంటే నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. మరి ఓసారి చూసొద్దాం రండి.. రేపల్లె: తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కార్తీక మాసాన యాత్రికులను రారమ్మంటూ పిలుస్తున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని గుంటూరు–కృష్ణా జిల్లాల తీరప్రాంతంలో పదివేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు గుంటూరు జిల్లా పరిధిలోని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో సుమారు 4వేల హెక్టార్లలో దట్టంగా అలుముకున్నాయి. ఆహ్లాదం.. పడవ ప్రయాణం నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పాతూరు గ్రామ సమీపంలో పాతూరు డ్రెయిన్ ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్ల మేర మలుపులు తిరుగుతూ ప్రయాణించి సముద్రంలో కలుస్తోంది. ఈ డ్రెయిన్ ఇరువైపులా దట్టంగా విస్తరించిన మడ అడవులు విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ డ్రెయిన్‌లో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. సాగర తీరానికి ఈ మార్గంతో పాటు నక్షత్రనగర్ నుంచి బీఎం డ్రెయిన్ మీదుగా మరో మార్గమూ ఉంది. అయితే ఆ మార్గం మడ అడవులు తక్కువగా ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్లేందుకు పాతూరు లేదా నక్షత్రనగర్‌లో మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. బోటు మొత్తం బుక్ చేసుకుంటే సుమారు రూ.7వేలు తీసుకుంటారు. కార్తీక ‘ద్వీపం’ మడ అడవుల మధ్య ఆహ్లాదకర ప్రయాణం అనంతరం సముద్ర తీరానికి కొంచెం దూరంలో సహజసిద్ధంగా ఏర్పడిన అందాల ద్వీపం ఉంటుంది. ఇది ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సముద్రంలో కొంత దూరం పడవలో ప్రయాణించాలి. ఈ ఐలాండ్ సాగర స్నానాలకు అనువుగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉల్లాసంగా గడపొచ్చు. సముద్ర తీరం వంపులో ఉండటంతో ఐలాండ్‌తోపాటు, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశావారిపాలెం గ్రామంలోని సముద్రంలో ఎడమ వైపు సూర్యోదయం, కుడి వైపు సూర్యాస్తమయం కనిపిస్తాయి. కన్యాకుమారి తరహాలో సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను తిలకించే అవకాశం ఇక్కడ ఉండడం విశేషం. ఐలాండ్‌లో వసతుల లేమి బోట్లు అంబాటులో లేకపోవడం వల్ల ఐలాండ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంటుంది. సరైన వసతులు లేకపోవడం కూడా యాత్రికులు రాకపోవడానికి మరో కారణం. గతంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా మడ అడవుల నడుమ ప్రయాణించి ఐలాండ్‌లో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. ఐలాండ్ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు కల్పించి అందుబాటులో బోట్లు ఉంచితే ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఫలితంగా తీరప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. , -
Tourist Spot: కొత్తదంపతులు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు..
స్వయంబువుగా వెలిసిన కొమురెల్లి మల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారం. చందమామలాంటి బిడ్డనిచ్చి ఒడినింపుతాడని నమ్మకం. మల్లన్నకు ఉయ్యాల కడితే ఇంట్లో ఉయ్యాల ఊగుతుందని విశ్వాసం. అందుకే... ఉయ్యాల కట్టి మరీ మల్లన్నకు మొక్కుతారు. నూతన దంపతులు కొమురెల్లి మల్లన్నను దర్శించుకుంటే పండండి బిడ్డ నట్టింట నడయాడుతుందని నమ్ముతారు భక్తులు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం కుందారం గ్రామంలో కొలువైన స్వయంభువు కొమురెల్లి మల్లన్న. కడుపు పండాలని మల్లన్నకు మొక్కి, కొత్త గుడ్డలో కొబ్బరికాయను కట్టి చెట్టుకు వేళ్లాడదీస్తారు. ఈ ఆలయంలోని చెట్ల కొమ్మలు నిండుగా ఈ ఉయ్యాలలే కనిపిస్తాయి. కుందారం గ్రామంలో పదేళ్ల కిందట కాకతీయుల కాలం నాటి కొమురెల్లి మల్లన్న విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా మారింది. కార్తీకమాసం మొదలైంది. ఇక శివుని కోవెలలన్నీ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఈ టూర్లో శివ్వారంలోని మొసళ్ల మడుగును కూడా కవర్ చేయవచ్చు. – వేముల శ్రవణ్‌కుమార్, సాక్షి, మంచిర్యాల చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!
ఇప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరిపోయింది. ఎంత బరువునైనా, ఎంత పెద్ద వస్తువునైనా ఒక చోటు నుంచి మరోచోటుకి తేలికగా రవాణా చేయొచ్చు. ఈ రోజుల్లో ఇట్లాంటి ఫీట్లు మామూలే! కానీ 5 వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనదేకదా! నాగరికత, సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆనాటి రోజుల్లో దాదాపుగా 23 అడుగుల ఎత్తైన రాళ్లను ఎట్లా రవాణా చేయగలిగేవారో? ఒకదానిపై మరొకటి ఏ విధంగా పేర్చేవారో కనీసం ఊహించగలరా? అవునండీ! ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్టోన్‌హెంజ్‌ను చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది!! వీటిని బృహత్ శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. అరుదైన బ్లూస్టోన్ మెటీరియల్‌తో రూపొందించిన అతిపెద్ద మెగాలితిక్ రాళ్ల వృత్తాకర సమూహమే ఈ స్టోన్‌హెంజ్. ఐతే ఈ భారీ శిలలు అంత ఎత్తు ఏవిధంగా పెరిగాయో? వీటి నిర్మాణ సమయంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ రాళ్లను ఎలా తీసుకురాగలిగారో? ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అద్భుతమైన కట్టడాన్ని వీక్షించడానికి ప్రతీ యేట ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా టూరిస్టులు సందర్శిస్తున్నారు. కుదిరితే.. మీరు ఓసారి వెళ్లి చూడండి. చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు
ఆధునిక ప్రపంచం.. ఎటుచూసినా కాలుష్యం.. భయాందోళనకు గురిచేస్తున్న వాతావరణం.. ఇలాంటి పరిస్థితులకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. స్వచ్ఛతకు ప్రతిరూపమైన తడ మండలంలోని వేనాడు, ఇరకం దీవుల్లో ప్రతిదీ విలువైనదే. ఈ దీవులకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారనే భావన తప్ప నేటి కాలుష్య జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారన్న వీరి సంతృప్తిని చూసి ఎవరైనా అసూయ పడాల్సిందే. పర్యాటక కేంద్రంగా ఇరకం పులికాట్ సరస్సు నడుమ ప్రకృతి అందాలతో కాలుష్య కోరలకు దూరంగా ప్రశాంతంగా ఉండే దీవి గ్రామం ఇరకం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభించడం దీని ప్రత్యేకత. గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు వాటి పక్కన మొగలి పొదలు కనిపిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు విరివిగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. వేనాడులో ప్రకృతి కనువిందు రాకెట్ ప్రయోగ కేంద్రం షార్కు సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. గ్రామం కాలుష్యపు కోరలకు దూరంగా తెల్లటి ఇసుక దిబ్బలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు చాలానే ఉన్నాయి. వరి ప్రధాన పంట. తాగునీటికి సమస్య లేదు. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిమామిడి, పేము, వెదురు, తంగేడిపూలు, సీగిరేణి(అరిపాకు) ఆకు విరివిగా లభిస్తాయి. గతంలో ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేసేవారు. దీని వల్ల చుండ్రు, జుత్తురాలే సమస్యలు తగ్గడంతోపాటు చలవ చేసే గుణం కూడా ఉండేది. అనంతర కాలంలో షాంపులు రావడంతో ఈ ఆకును వాడే వారు కరువైపోయారు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు కూతవేటు దూరంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండగా మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ పులికాట్ సరస్సు ఉప్పు నీళ్లు ఉన్నా గ్రామాల్లో మాత్రం స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు ఉండడం వీరు అదృష్టంగా భావిస్తారు. ఈ నీటి ఆసరాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన పని లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణం కలిగినవిగా ఉంటాయి. వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ పెద్దగా కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఆ దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం వేనాడు, ఇరకం దీవులు అద్భుత గ్రామాలు. ఇక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందించడంతోపాటు ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తాం. ఇరకం దీవిలో పర్యాటక పెట్టుబడుల కోసం ఇప్పటికే చెన్నైలోని ‘వీజీపీ’ ప్రతినిధులతో చర్చలు జరిపాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వసతి, పులికాట్ ముఖద్వారాల పూడికతీత, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే గతంలో అరిపాకే అందరికీ మా చిన్నతనంలో అరిపాకుతోనే తల స్నానం చేసే వాళ్లం. దీని వల్ల జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఈ ఆకును పొడి కొట్టించడం, స్నానం చేసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ప్రజలు షాంపూల వైపు మళ్లారు. తిరిగి ప్రస్తుతం పాత అలవాట్లకు వస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడు ఈ ఆకు కోసం గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో పేము బాగా పెరుగుతుంది. ఇక్కడ పట్టా భూముల్లో సాగయ్యే పేముని వేలం పాట ద్వారా విక్రయిస్తాం. ఆకు నుంచి, కాడ వరకు ముళ్లతో ఉండే ఈ పేముని గిరిజనులు తప్ప ఇతరులు కొయ్యలేరు. ఈ రెండింటినీ బాగా సాగు చేసి వినియోగంలోకి తెస్తే కొందరికైనా ఉపాధి లభిస్తుంది. – కె.వాసుమొదలి, వేనాడు గ్రామం, తడ మండలం -
వన భో‘జనం’